*🙏ప్రశ్న: స్వామీ! నాకిప్పుడు ఈ ఉద్యోగంవల్ల సాధన, జపం, ధ్యానం చేసేంత తీరిక లేదు. కనుక రిటైర్ అయ్యాక తీరికగా సాధన ప్రారంభిస్తాను. పైగా ఇప్పుడెన్నో సమస్యలు - కుటుంబపరంగా, ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా ఎంతో ఒత్తిడిలో ఉన్నాను. ఇవన్నీ తీరాక సాధన చేస్తాను.🙏*
*🪷రామకృష్ణ పరమహంస గారు :*
*నీబోటివాడే ఒకడు సముద్ర స్నానానికి వెళ్ళా డట. ఎంతకీ నీటిలోకి దిగకుండా ఒడ్డునే వేచివున్నాడు. అతణ్ణి చూస్తున్న మరొకడు, “ఏమయ్యా! స్నానం చేయడానికి వచ్చి, చేయవెందుకు?" అని అడిగాడు. "సముద్రంలో అలలు ఆగిపో యాక స్నానం చేస్తాను!" అని అతడు సమాధానం చెప్పాడట!*
*అలాగే జీవితంలో పనులు, సమస్యలు ఉండడం అనేది సర్వసాధారణం. వాటిని ఎదుర్కొంటూనే సాధన చేయాలి. యుక్తవయస్సులో చేయలేనిది వృద్ధాప్యంలో ఎలా చేస్తారు? నిజానికి ఇ సమస్యలే మనల్ని భగవంతుడి వైపు నడిపించడంలో సహాయపడతాయి!*
No comments:
Post a Comment