అంతర్యామి
🥀 అణువణువునా గురువులే... 🥀
✍️ మాడుగుల రామకృష్ణ
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️
🪷 విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం♪. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు♪. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి♪. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు♪. జీవితానికి వాటిని అన్వయించుకొంటే నిజమైన బతుకంటే ఏమిటో అర్థమవుతుంది♪.
🪷 మనిషికి సుఖాలు, దు:ఖాలు రమ్మంటే రావు♪. వద్దంటే మానవు♪. తట్టుకుని నిలబడాలి♪. నిరాశతో చతికిలపడకూడదు. తన్నినా, తవ్వినా, ఎన్నోవిధాల హింసించినా భూమి చలించదు. ఓర్పుతో సహిస్తుంది. పర్వతాలను, చెట్ల భవనాలను మోస్తుంది. మనిషి సుఖజీవనానికి బాసటగా నిలుస్తుంది. పరోపకారార్థమే బతుకని, బాధ్యతలు భరించక తప్పదని చెబుతుంది. క్షమాగుణాన్ని నిలువెల్లా నింపుకొమ్మని బోధిస్తుంది♪. ఓర్పు, సహనమే ఉన్నత జీవితానికి సోపానాలని వివరిస్తుంది♪.
🪷 నిర్మలత్వానికి స్నిగ్ధత్వానికి మాధుర్యానికి పెట్టింది పేరు - జలం. జలం ప్రాణాన్ని నిలబెడుతుంది♪. మాలిన్యాన్ని వదిలిస్తుంది♪. స్నానంతో మనిషిని పవిత్రుణ్ని చేస్తుంది♪. వర్షంగా కురిసి పరుగెత్తి పంటపొలాల్లో ఎగిరెగిరి దూకుతుంది♪. నేలను సస్యశ్యామలం చేసి బంగారు పంటలు పండిస్తుంది♪. ప్రత్యుపకారాన్ని ఆశించని జలం పదిమందికీ ఉపయోగపడుతుంది♪. మనిషి జీవితం ఇలా ఉండాలని బోధిస్తుంది♪.
🪷 మనిషి తన సత్ప్రవర్తన ద్వారా సాటి మనిషి అభిమానాన్ని పొందగలడు♪. వారి గుండెల్లో గూడు కట్టుకోగలడు♪. ఒకరికి సాయంచేస్తే మనకు దైవం సాయపడతాడని మనిషి నమ్మకం♪. ఉన్నదానితో నలుగురు బతకాలి♪. ఇతరులను బతికించాలి♪. ఇదే మానవత్వానికి అర్థం♪.
🪷 నులివెచ్చని కిరణాలతో ఉదయించి లోకం చీకట్లను పోగొట్టి రోజంతా వెలుగును ప్రసాదిస్తాడు ఆదిత్యుడు♪. లోకమంతా తిరిగి సాయం సంజెకు మాయమవుతాడు♪. మర్నాడు ఉదయమే మళ్ళీ ప్రత్యక్షం♪. బద్ధకం లేదు. విసుగు విరామాలు లేవు. ప్రపంచాన్ని బతికించే శ్రామిక చక్రవర్తి♪. భూమ్మీద జలాన్ని గ్రహించి, దాచి సమయం చూసి మళ్ళీ భూమ్మీదకు వదిలేసే పనిలో నిమగ్నమై ఉంటాడు♪. ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం. బాధ్యతను, సమయాన్ని నిరంతరం గుర్తుచేస్తూ వెలుగు ఉండగానే జీవితాలను చక్కదిద్దుకొమ్మని హెచ్చరిస్తాడు♪.
🪷 ఎన్నెన్నో కోరికలు, ఆశలు తీరాలని నిరంతరం తపిస్తాడు మనిషి♪. అనుకున్నవి నెరవేరితే ఆనందం. లేకపోతే విషాదం.
🪷 వికారం లేని ప్రశాంత జీవితాన్ని అనుభవించమని చెబుతోంది సాగరం♪. అగాధమైన లోతులు గల తనలో ఎన్నో నదులు వచ్చి కలిసినా ఎప్పుడు పొంగిపోదు. వేసవిలో నదుల రాక తగ్గినా తాను ఎండిపోదు. దేశ కాల భేదం వల్ల విచ్ఛిన్నం కాదు. తన గర్భంలో ఏమున్నాయో తెలియనివ్వదు. వచ్చి చేరినవాటిని ఉంచుకోదు. తీరానికి చేరుస్తుంది. నర్మగర్భ నిరాడంబర జీవితాన్ని గడపమని, పరుల సొమ్ముకు పాకులాడవద్దని సందేశాన్ని అందిస్తుంది సాగరం♪.
🪷 పడగొట్టినవారిపై పగ పెంచుకోక, దారం దారం పోగేసుకొని గూడు కట్టుకొనే సాలీడు, క్రమశిక్షణే మన మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పే చీమలు, పడినా పట్టుదలతో లేచే కెరటం, ఎదగాలని సంకల్పబలంతో భూమిని చీల్చే మొక్క, వేడిని భరిస్తూ నీడనిచ్చే చెట్టు... ఇలా ఎన్నో గురువుల రూపేణా నిత్యం కనిపించి ఎన్నో పాఠాలు చెబుతాయి.
✅ మనిషికి మంచిచెడుల భేదాన్ని విప్పిచెప్పే 'మనసు' ప్రధాన గురువు♪. విద్యల్లో తామే అధికులమని భావించేవారికి అణువణువునా కనిపించే అల్పజీవులు, నోరులేని మూగప్రాణులు, పశుపక్ష్యాదుల చెట్టుచేమలు గురువులై చెప్పే పాఠాలు బతుకు రీతుల్ని అర్థవంతంగా వివరిస్తాయి♪.
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️
No comments:
Post a Comment