*పాఠకులకు త్రిపురా రహస్యం ఇంకా రెండు రోజులలో ముగియనున్నది 73వ భాగం చివరి భాగం.*
*త్రిపురా రహస్యము - 71*
================
*స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము*
*వసుమంతుని సందేహాలు - 3*
ప: ఫలభావమున్నది. కాబట్టి ఫలానికి కారణమైన కర్మ ఉండి తీరాలి. అప్పుడు ప్రారబ్దకర్మ అతనికి కూడా ఉన్నట్లే కదా ?
హే; మనకు కనిపించేదంతా మనది కాదు. ఇతరులను చూసి 'వాడు సుఖంగా ఉన్నాడు' అనుకుంటాం. ఆంతమాత్రాన వారి సుఖదుఃఖాలు మనవి కావు. ఇతరులు తమవిగా భావించే సుఖదుఃఖాలు వారివే అవుతాయి. అవి వారి ప్రారబ్దకర్మ ఫలితాలే.
మధ్యమ, ఉత్తమ జ్ఞానులకు ఈ రకమైన ఫలితం లేదు. అందువల్ల వారికి ప్రారబ్దం కాని, ప్రారబ్దకర్మను కల్పించినందువల్ల ప్రయోజనంకాని ఉండవు.
మందజ్ఞాని అయినవాడు లౌకికంలో మునిగి తేలతాడు. ఈ సుఖదుఃఖాలు తనవిగానే భావిస్తాడు. అందువల్ల అతనికి ప్రారబ్టాన్ని కల్పించటంవల్ల ప్రయోజనం ఉంది.
వ: కేవలజ్ఞానికీ, జీవన్ముక్తుడికీ తేడా ఏమిటి ?
హే: జీవన్ముక్తుని దృష్టిలో సుఖదుఃఖాలే ఉండవు. కేవలం జ్ఞానివాటిని చిద్రూపాలుగా భావిసాడు. జ్ఞానం కలిగిన మరుక్షణంలోనే అజ్ఞానం నశిస్తుంది.
అందువల్ల పవిత్రక్షేత్రంలోగాని, అపవిత్ర ప్రదేశంలోగాని, స్మృతి ఉండిగాని, లేకగాని ఎక్కడ ఏ విధంగా మరణించినా అతడు ముక్తి పొందుతాడు.
గురూపదేశంవల్లగాని, శాస్త్రపరిజ్ఞానం వల్లగాని, ఇతరత్రా గాని అతడికి ఒకసారి తత్త్వజ్ఞానం కలిగిందంటే, అతడికి ముక్తి లభించినట్లే, సర్వము పరబ్రహ్మమయము అని భావించే జ్ఞానుల కర్మ, వారి జ్ఞానాగ్నిలో భస్మమై పోతుంది. ప్రారబ్దకర్మ శేషంవారికి ఉండదు.
జ్ఞానులు కూడా సుఖదుఃఖాలు అనుభవిస్తున్నారని మనం అనుకుంటాం. వారి దృష్టిలో అంతా సమానమే. సుఖదుఃఖాలనేవి అసలు టేనే లేవు. పరబ్రహ్మకు జ్ఞానికి భేదం లేదు. అందుకే వారికి ప్రారబ్బకర్మ ఏ మాత్రమూ ఉండదు.
ఆ మాటలు విన్న వసుమంతుడికి సర్వసందేహాలూ తీరిపోయి స్పష్టమైన జ్ఞానం కలిగింది. రాకుమారులు ఆ బ్రాహ్మణోత్తముణ్లి పరిపరివిధాల పూజించి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు రత్నాకరుడు.
🪷⚛️✡️🕉️🪷
No comments:
Post a Comment