హరిఓం , - - - *తలరాత మార్చుకోవచ్చా*?
అవును మార్చుకోవచ్చు .ఎలాగంటే ఏ విషయానికైతే నీవు బాధ పడుతున్నావో దాని గురుంచి కొంత సేపు దృష్టి పెట్టి చూడు .అలోచించు ,ఈ బాధ నాకు ఎందుకొచ్చిది , ఏకారణం వల్ల వచ్చింది ,నేను ఏ తప్పుచేయడం వలన వచ్చింది ,అని అలోచించు .సమాధానం నీకు వస్తుంది .
అవును నీకు సమధానం దొరుకుతుంది, నీకు వచ్చిన బాధకు సమధానం దొరుకుతుంది .కారణం ఏమైవుంటుందో తెలుసుకుని వొప్పుకో ,నీ బాధకు కారణం నీవు మాత్రమే అని తెలుసుకుంటావు ,
నేను పూర్వం చేసిన తప్పుకు అనుగుణం గా ఈ బాధ వచ్చింది అని వొప్పుకో .ఇదనీవు రాసుకున్న తలరాత అని వొప్పుకో .దీనిని నేను మార్చుకుంటున్నాను ఆనుకో .ధ్యానంలో నిమగ్నుడవుకమ్ము .
ధ్యానాగ్ని దగ్ధ కర్మణి అని గీతలో భగవానుడు ఎన్నడో చెప్పివున్నాడు .మర్చిపోకు తీవ్రం గా ధ్యానం చెయ్యి .నా కర్మనుంచి నేను తప్పుకుంటున్నాను అని అనుకో , నమ్మకంగా నమ్ము .తప్పని సరిగా తప్పించుకుంటావు .
నిన్ను నీవు నమ్ముకో ,ఎవరిని నమ్మకు నిన్ను నీవు మాత్రమే ఉద్ధరించుకోగలవు .ఎవరూ నిన్ను ఉద్దరించలేరు , ఏ పూజలు ,వ్రతాలూ ,నోములు ,ఉపవాసాలు ,జపాలు ,దానాలు ,ఏమి కూడ నిన్ను కాపాడలేవు .తెలుసుకో ఇదే నిజం, నివు నమ్మలేని నిజం .పూర్వం నేను చేసిన కర్మకు ప్రతిఫలంగా నాకు ఈ భాధ వచ్చింది ,కావున ఈ భాధను నేను మాత్రమే తప్పించుకోవాలి అని నిజముగ నమ్ము .తప్పించుకుంటావు .
నీ కర్మనుంచి నీవు ఖచ్చితంగా తప్పించుకుంటావు .ఎప్పుడు ? నీవు నమ్మినపుడు - నా కర్మకు నేనే కారణం అని .
నా కర్మనుంచి నేను బయట పడుతున్నాను .
నాలో మంచి కర్మ లేదు ,చెడు కర్మ లేదు ,నిర్గుణ స్థితికి నేను చేరుకుంటున్నాను .అని అనుకుని ధ్యానము చేయి , చేయగ ,చేయగ నీ కర్మలు అన్ని దగ్దమవుతాయి .నీ కర్మలనుంచి నీవు కచ్చితంగా తప్పించుకుంటావు .ఇది నేను చెప్పిన మాట కాదు .గీతలో శ్రీ కృష్ణులవారు చెప్పిన విషయము .
భగవానుడను నమ్ము ,నిన్ను నీవు పుర్తిగా నమ్ము ,ఎవరిని నమ్మకు ,ధ్యానాన్ని నమ్ము ధ్యానము చేయి .కర్మలు దగ్ధం చేసుకో ............... - - 🙏🙏 .... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ ..... - 98660 35557 ..... - 28.03.2024 ...
No comments:
Post a Comment