మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 01
పరిపూర్ణత కొరకు జాగరూకత
పరిశుద్ధ జీవనము, మర్మములేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి యెడల సోదర భావము, సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట,
దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట,
తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట, అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి,
పరిపూర్ణతల యెడ నిరంతరము, జాగరూకత కలిగి యుండుట అనునవి దివ్యజ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు.
No comments:
Post a Comment