బంధాలు తెగిపోతున్నాయ్ జాగ్రత్త!
18 ఏళ్ళకే ఆడపిల్లలు, మగ పిల్లలు తేడా లేకుండా అంతా సంపాదన యావలో పడిపోతున్నారు (ఆర్థిక పరిస్థితి వల్ల కొంత మంది, బిజినెస్, రాజకీయ, సినీ వగైరా వారసత్వాల వల్ల కొంతమంది, మరేవో కారణాలతో మిగిలిన వారు)
. ఆ యావలో ఎంతోమంది ఎన్నో రకాల బంధాలకు, అనుబంధాలకు, పండగలకు దూరమై బాధల పాలవుతున్నారు. మెంటల్ టార్చర్లకు గురవుతున్నారు.
విదేశాలకు వెళ్ళే పిల్లల గురించి ఆలోచిస్తే 'అయ్యో' అనిపిస్తుంది. గల్ఫ్ వారి పరిస్థితి మరీ ఘోరం.
"డబ్బు, డబ్బు, డబ్బు." సంపాదన అన్ని వర్గాల వారినీ, అన్ని వయసుల వారిని, అన్ని కులమతాల వారిని అసలు బంధాలకు దూరం చేస్తోంది. ఇంట్లో ఎంత మంది సభ్యులుంటే అన్ని గదులు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కో స్మార్ట్ ఫోన్.. వారి లైఫ్ గదికి, జీవితం ఫోన్‌కి పరిమితమవుతోంది.
*ఎలాంటి శుభాకాంక్షలైనా, సంతాపాలైనా ఫోన్లోనే... 'కంగ్రాట్స్, RIP' ఇక అంతే సంగతులు. పలకరింపులుగానీ, పులకరింతలుగానీ లేవు.
ఆనాటి అచ్చట్లు లేవు... ముచ్చట్లు లేవు... బంధాల చిరునామాలు 'స్మార్ట్‌ఫోన్'లో బంధీగా మారి మనిషిని బంధీ చేసేశాయి. ఒంటరిని చేస్తున్నాయ్....
"తస్మాత్ జాగ్రత్త. రోజుకు కనీసం 2 గంటలు అయినా మనసారా అయిన వారితో మాట్లాడండి. బంధాలని దృఢపరచుకొండి... ఆరోగ్యంగా ఉండండి.
No comments:
Post a Comment