*జీవితంలో ఎలిమినేషన్ లు - ప్రకృతి తత్వం*
*60 సంవత్సరాల వయస్సులో మీరు అప్పటిదాకా పనిచేసిన మీ పనిస్థలం లేదా కార్యాలయం నుండి మీరు తొలగింపబడతారు (మొదటి ఎలిమినేషన్). మీ కెరీర్‌లో మీరు ఎంత విజయవంతంగా లేదా శక్తివంతంగా పని చేసిఉన్నా, మీరు అప్పటినుండి (పెద్దగా) పనేమీ చేయలేని వ్యక్తిగా మారిపోతారు. కాబట్టి, మీ గత ఉద్యోగానికి సంబంధించిన అహం, ఆధిక్యతలను ఆపైన కూడా మీరు అంటిపెట్టుకుని ఉండలేరు. కాబట్టి ఇప్పటి నుండే మీరు అధికారగర్వం లేకుండా జీవించండి.*
*70 ఏళ్ల వయస్సులో, సమాజం కూడా మిమ్మల్ని క్రమంగా తొలగిస్తుంది (సెకండ్ ఎలిమినేషన్). మిమ్మల్ని కలిసే లేదా మీరు కలిసే బంధువులు, స్నేహితులు మరియు సహోద్యోగులు చాలా తక్కువ అయిపోతారు. సమాజంలో మిమ్మల్ని ఎవరైనా గుర్తు పట్టటమే గొప్ప అన్నట్టు పరిస్థితి మారి పోతుంది*.
*80లో మీ కుటుంబం కూడా మిమ్మల్ని నెమ్మదిగా తొలగిస్తుంది ( మూడవ ఎలిమినేషన్). మీకు చాలా మంది పిల్లలు, మనుమలు, మనవరాళ్లు ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం మీరు మీ జీవిత భాగస్వామి లేదా ఇతరుల సహాయంతో ఒంటరిగా జీవిస్తారు. మీ పిల్లలు అప్పుడప్పుడు మాత్రమే మీ దగ్గరికి వచ్చిపోవచ్చు.*
*90 తర్వాత, ఈ భూమి కూడా మిమ్మల్ని తొలగించాలనుకుంటుంది (అంతిమ ఎలిమినేషన్). ఈ సమయంలో మీరు విచార పడవద్దు. ఎందుకంటే ఇది మానవ జీవన ప్రస్థానం. ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోనే వెళ్ళాలి*.
*మీ పార్ధీవ దేహాల్నీ, మీచే ద్వేషించబడిన వారి పార్థివ దేహాల్నీ ప్రకృతి ఒకే తీరుగా తనలో ఐక్యం చేసుకుంటుంది. ప్రకృతి ఎటువంటి భేదాన్నీ పాటించదు*.
*నిజానికి, మొదటి ఎలిమినేషన్ దాకా కూడా రాలేని అభాగ్యులెందరో ఉంటారు. అందుకైనా మనం తృప్తి చెందాలి*.
*అందువల్ల జీవన తత్వం ఏమిటంటే, మీ శరీరాలు ఇంకా సామర్థ్యం కలిగి ఉండగానే జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి! మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి. ఇష్టమైన ప్రదేశాలు చూడండి. మీకు కావలసింది తినండి. మీకు ఇష్టమైన ( ఇతరులను కష్టపెట్టని) పనులు చేయండి. మీరు సంతోషంగా జీవించండి, మీ తోటి వారిని సంతోషంగా జీవించనీయండి. ఎవరినీ, ఏ ప్రాతిపదికన కూడా మీరు ద్వేషించకండి. ద్వేషం జీవన తత్వం తెలియని మూర్ఖుల లక్షణం. ద్వేషం ప్రకృతి విరుద్ధమైనది. ప్రేమ, సహజీవనాలే ప్రకృతి సహజమైనవి*.
🌼💝🌹🌹🌹🌹🌹🌹🌹💝🌼
No comments:
Post a Comment