Sunday, April 7, 2024

నిర్మల స్పటికాకృతిం - ఆధ్యాత్మిక విశ్లేషణ - వైజ్ఞానిక విశ్లేషణ :

 నిర్మల స్పటికాకృతిం - ఆధ్యాత్మిక విశ్లేషణ - వైజ్ఞానిక విశ్లేషణ :

     Episode - 1

 "నిర్మల స్ఫటికాకృతిం",  "స్పటిక మణి మయీ"... ఇత్యాది... పదాలను మనం స్తోత్రాలు, స్తుతులలో గమనిస్తాం. దైవస్మరణ సమయంలో కాంతిని వర్ణించినప్పుడు స్పటికాల ప్రస్తావన ఉండి తీరుతుంది.

      ఏమిటి ఈ స్పటికాలు (crystals) ? ఏమిటి వాటి నిర్మలత్వం? ఈ రోజుల్లో చాలామంది స్పటిక మాల వేసుకోవడం,  స్పటికాలను (లాకెట్లు,గోళాలు)  ధరించడం ,స్పటికం తోచేసిన శివలింగాలు, గణేశ ప్రతిమలు మొదలైన వాటిని పూజించడం,  రేకీ (reiki), ప్రాణిక్ హీలింగ్ (prani healing) పద్ధతుల్లో వాడడం మనం గమనిస్తున్నాము.  పిరమిడ్లు, యంత్రాలు, మండలాలు మొదలైన సామగ్రి లో కూడా స్పటికాలను (అనేక రకాల వాటిని) వాడుతున్నట్లు మనకు తెలుసు.
 ఇంగ్లీషులో స్పటికాన్ని,  "క్రిస్టల్"(crystal) అంటారు.  గ్రీకు భాషలో  క్రిష్టలోస్ అంటే  స్పష్టమైన మంచు అని అర్థం.  స్పటిక నిర్మలత స్పష్టత మంచు ముక్కలా ఉండడమే దీనికి కారణం.  ఇతరదేశాలలో కొందరి నమ్మకం ఏమిటంటే పరమేశ్వరుడు పవిత్ర జలాన్ని, స్వర్గము నుండి భూమి మీదకు....పొయ్యగా,  ఆకాశంలో  ఆ జలం మంచు స్పటికాలుగా మారిందని, ఆ స్పటికాలను దేవతలు మానవాళి రక్షణ ఆశీస్సుల కోసం శిలలుగా మార్చారని......నిజమే కావచ్చు.  దివి నుండి భువికి వచ్చిన జలాలు, స్పటికాలు.... భూమి లోపల నుండే కదా ఉద్భవించాయి.  ఒక కోణం నుండి చూస్తే దైవశక్తి అయిన ధవళ కాంతి, స్పటిక రూపంలో ఒక ఆకారంగా మారిందని భావించవచ్చు. ఎందుకంటే స్వచ్ఛమైన స్పటికం, కాంతిలో కనబడదు. ఆ కాంతిలో కలిసిపోయి ఉంటుంది. అయినా ఒక భౌతికమైన ఆకారం ఉంది.  స్పటికాల కున్న ఆధ్యాత్మిక శక్తి మొదలైన విషయాలను మున్ముందు పరిశీలిద్దాం. భూమిపై ఉన్న మట్టిలో ఇంచుమించు 80% ప్రాణవాయువు,  ఇసుక రాయి (oxygen & silicon) ఉంటాయని ఖనిజ  శాస్త్రం చెబుతోంది.  స్పటికాల లో ఉన్న ముఖ్య అణువులు ఇవే. దీనిని  సిలికాన్ డయాక్సైడ్ (silicon di oxide) అంటారు.  వాడుక భాషలో "క్వార్ట్జ్" (quartz) అంటారు.

      అతి ఎక్కువ ఉష్ణోగ్రత (600 degrees), పీడనము (pressure)  లేక ఒత్తిడి కలిగిన నీరు (భూగర్భంలో)...ఈ ఇసుకరాయిని కరిగించి అక్కడ జరిగిన ఈ మార్పు వలన, శిలాద్రవం (మాగ్మా/లావా)భూమి పైభాగానికి వస్తుంది.
 వచ్చి,  అక్కడున్న  శిలారాశుల లోనికి  చొచ్చుకొనిపోయి చోటు చేసుకుంటుంది.  ఆ రాళ్ళలో  అప్పటికే Si O  2. అణువుల.... మాలిక్యూల్స్ (molecules)ఉంటే...  వాటిలో  ఇలా , బంధం ఏర్పర్చుకొని, క్రమేపీ చల్లబడి... స్ఫటిక రూపంలో,  ఆరు ముఖాల (six sided/hexagonal)  స్పటికాలుగా పెరుగుతాయి. ఒకవేళ అలా రాశుల్లో ఇసుక అణువులు లేకపోతే (పాలరాయి వంటివి)ఆ మాగ్మా ప్రక్కలకి ప్రాకి, రెండు వైపులా కొనలు (terminations)... ఉండే స్పటికాలుగా, పలకలు దేరి,  షడ్బుజాలతో.... పెరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.
 స్పటికాలు  అన్ని దేశాలలో... కొండ ప్రదేశాలలో... లావా ప్రవాహాలు ఏర్పడిన శిలారాసులలో చూడవచ్చు. ఇవి అతి చిన్న ఆకారం నుండి ..... మూడు, నాలుగు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. బ్రెజిల్, ఆల్ఫ్స్ పర్వాత శ్రేణుల్లో,  పిరనీస్, మడగాస్కర్ ప్రదేశాలలో అత్యద్భుతమైన స్పటికాలను... త్రవ్వకం చేస్తున్నారు. మనదేశంలో రాజస్థాన్ ప్రాంతంలో కూడా వివిధ రకాలైన స్పటికాలు లభిస్తాయి.  సాధారణంగా  స్పటికాలు పెరిగి,  నిశ్చితమైన ఆకారం ధరించడానికి,  కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. బ్రెజిల్ స్పటికాలు 120 కోట్ల సంవత్సరాల వయస్సువని ...." కార్బన్ డేటింగ్ పద్ధతి" లో కనుక్కున్నారు.(సశేషం).


*నిర్మల స్ఫటికాకృతిం -  స్పటికాల పై  ఆధ్యాత్మిక - వైజ్ఞానిక విశ్లేషణ* :

            ------ 2 ------

 రూటైలు, టోర్మలీను.... అనే ఇతర  ఖనిజమిశ్రమం వలన స్పటికాలు రంగులు మారుతాయి.   స్పటికాలు ముద్దలో నుండి పెరుగుతున్నప్పుడు క్రింది భాగం కొంచెం గజిబిజిగా, మీద భాగం చాలా స్పష్టంగా ఉంటాయి. షణ్ముఖాల (six sided/hexagonal)లో కనీసం మూడు ముఖాలు అయినా.... కలిసిపోయి కొన దేరుతాయి. అరుదుగా ఆరుముఖాలు కలిసిపోయి, కొన దేరితే చాలా అపూర్వం .శక్తివంతం ఆ కిరీటం.  ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.

      ఇక ఆధ్యాత్మిక రంగంలో ఈ స్పటికాల పాత్ర ఏమిటి?

      కరుడుగట్టిన కాంతిపుంజమా,  వర్ణాలను వెదజల్లే విద్యుల్లతయో లేక ఇంద్రధనుస్సుయో... అనే భావన కలుగజేసేవి ఈ స్పటికాలు (crystals).  ఇవి చూడముచ్చటగా ఉండడమే కాకుండా, చూసే కొద్ది.... మనలో  ఆధ్యాత్మిక భావనలు కలుగజేస్తాయి. స్పటికాన్ని చర్మానికి  తగిలించి చూడండి!!!! చల్లగా ఉంటుంది.  కానే కాదు మొక్క యొక్క స్పర్శ అలా ఉండదు.... ఇదే స్ఫటికానికి ఉన్న సహజ గుణం.

      స్పటికాలను అనాది కాలం నుండి మానవుడు, పవిత్ర భావంతో చూసేవాడు. వాటి శక్తి, ఆదిమ  కాలం నుండి  మనిషికి తెలుసు. స్పటికంలో దైవానికి ,మానవుడికి అనుసంధానం చేయగల శక్తి ఉన్నట్టు ...ఆత్మకి ప్రతిబింబం లేదా ప్రతీక అని నమ్మేవారు మనిషి. ఒక జీవి ఆత్మసాక్షాత్కారానికి, (సంసారం నుండి బయట పడి),  ఎలా పాటుపడి ఓపికగా కర్మబంధాల నుండి ఉన్నతికి పెరుగుతాడో... అలాగే స్పటికం కూడా ,గజిబిజిగా ఉన్న స్పటిక పదార్థంలో నుండి చక్కగా షడ్భుజాలతో ...ఉద్భవించి,  స్పష్టమైన, కాంతివంతమైన  భగవత్ కాంతి ధవళ కాంతికి ప్రతీకగా నిలుస్తుంది. ఎన్నో లక్షల సంవత్సరాలు  పెరుగుతుంది. పెరుగుతూ ఉంటుంది కూడా.  ముఖ్యంగా స్పటికాలను పవిత్ర కార్యాలలో ఉపయోగిస్తే (healing etc.,)  ఆ శక్తి (దైవ శక్తి),(రేకీ,ప్రాణిక్ హీలింగ్)  వలన స్పటికాలు పెరగడం.... గురువులకు తెలుసు.
 ఇప్పటికీ అమెరికాలో రెడ్ ఇండియన్లు... మెడలో  చిన్న సంచి తగిలించుకుని... అందులో ఒక చిన్న స్పటికం, చెట్టు వేరు .....మొదలైన ప్రకృతి సంబంధం ,ఉన్న వస్తువులను ఉంచుతారు. ఆ స్పటికం తనను రక్షిస్తుందని, దారి చూపుతుందని నమ్ముతారు. టిబెట్టు, చైనా ,జపాను దేశాలలో ,కూడా కొందరు మత గురువులకు స్పటికాల ఆధ్యాత్మిక శక్తి తెలుసు.  స్పటికాలు బాగా దొరికే  కొండలకు,  చైనా దేశపు గురువులు కాపలాగా ఉండే వారు. శిష్యులను ఆ పవిత్ర క్షేత్రాలకు తీసుకుని వెళ్లి మంత్రోపదేశం చేసేవారు. ఆ స్థలాలలో దైవశక్తి మెండుగా ఉంటుందని ...ఆ శక్తి వలన వాళ్ళు కాపాడబడి, మానసిక సేవకి సమర్పించుకోగలుగుతారని విశ్వసించేవారు.
 స్పష్టమైన  జ్యోతి క్షేత్రం. పూర్వం జిజ్ఞాసా పరులకి ఒకటే కోరిక.  పవిత్ర పర్వతశ్రేణులలో స్పటికాన్వేషణ చేయడం. పెద్ద శిలా రూపంలో ఉన్న స్పటిక ఖండాన్ని ..... శ్రమతో  గుండ్రంగా మలచి... నీటితో ...ఇసుకతో... దానిని చాలా కాలం తోమి చాలా మృదువుగా చేసేవారు.  అలా మిలమిల మెరిసే మెరుపులా మెరిసే... నిర్మల స్పటిక గోళాన్ని ,  ప్రత్యేకమైన భావనా శక్తులు ఉపయోగించి (thought forces),  ఆ స్పటిక గోళాన్ని... అద్భుతమైన శక్తి కేంద్రంగా మలచి,  ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం... విశ్వ దర్శనం (Crystal Gazing)  కోసము ఉపయోగించేవారు. పౌర్ణమి రాత్రులలో దానిద్వారా ప్రసారమైన వెన్నెల కాంతి తో మానవులకు మనఃశాంతి  కలుగజేసి,  భౌతిక ,మానసిక ,భావోద్వేగ రుగ్మతలను ...నిర్మూలించే వారు. చిన్న స్పటికాల స్పష్టత, శక్తి వలన, పవిత్ర భావాలు వాటిపై నుంచి... పిల్లలు పుట్టినప్పుడు, ఆ స్పటికాలతో  బొడ్డును కోసేవారు. స్పటికాల లో చిన్న వాటికి కొంచెం శక్తి ,పెద్దవాటికి పెద్ద శక్తి అని ఏమీ లేదు. ఆ స్పటికాలలో ఉన్న పరమాణువుల  అతి క్రమబద్ధమైన క్షేత్రమే కారణము.  అందువలన ఆ పరమాణువుల  మధ్య ఉండే స్థలంలో ప్రవహించే... సూక్ష్మమైన  ఐయాన్సు (charged) వలన ఈ శక్తి వస్తుంది.
 సూక్ష్మంగా గమనిస్తే మానవ శరీరమే ఒక  పెద్ద స్పటికము. రకరకాలైన  ఘన, ద్రవ పదార్థాల...  స్పటిక సముదాయమే... మానవ శరీరము. ఈ స్పటికాలన్నీ ....ఒక్కో  నిర్దిష్టమైన కంపనాల తో ఉంటాయి. కళ్ళు ఒక కంపనం తో ఉంటే,చెవులు ఇంకో కంపనంతోనూ ఉంటాయి.....ఇలా.....

      అట్లాంటిస్ (Atlantis)  అనే దేశంలో  (50,000 సంవత్సరాల క్రితం...సుమారు) ఒక నగరానికి కావలసిన శక్తి... అంతా పెద్దపెద్ద స్పటిక గోళాల ద్వారా సృష్టించే వారట. పిరమిడ్ ఆకారంలో ఉన్న పెద్ద గోపురం లేదా  ఉపరితలం క్రింద పెద్ద స్పటిక గోళం... ఉంచేవారని,  ఆ స్పటిక గోళాన్ని...  శక్తివంతమైన గురువులు ధ్యానం చేస్తే... దాని నుండి ఆ నగరానికి కావలసిన కాంతిపుంజాలు బహిర్గతమయ్యేవని చెప్తారు.  ఆ వచ్చే కాంతిని అక్కడక్కడ వీధులలో ప్రత్యేకంగా అమర్చబడిన స్పటిక పళ్ళాల ద్వారా... ఇనుమడింప చేసే వారిని అంటారు.  అతిపురాతన నగరాలలో, మైళ్ళ పొడవుతో ప్రత్యేక సముదాయాలు ఉండేవని.... ఆయా సముదాయాలు  స్పటికాల ద్వారా సహాయాన్ని పొందే వారని పెద్దవారు,ప్రాచీనులు చెబుతారు.


ప్రకృతి పరిణామంలో ... ఖనిజ సామ్రాజ్యంలో (Mineral k

ingdom) , స్పటికాలు చాలా అగ్రస్థానంలో ఉంటాయి. మనకున్న విలువైన రాళ్ళలో(precious stones)..... స్పటిక జాతి శిలలే .....అన్నిటి కంటే ఎక్కువ రకాలని అందిస్తోంది.  స్పటికానికి ఒక ఆకారం లేకపోయినా... ఇసుకరాయే ఎక్కువ భాగం ఉన్నా... తదితర మధ్యరకం రాళ్ళు(semi precious) కూడా ఉన్నాయి.  కెంపు రకం (agates),  పచ్చ వన్నె రాళ్లు (Jaspers),  ఎరుపు రంగు వి (chalcedony)  మొదలైనవి.

    స్వచ్ఛంగా ఉన్న స్థితిలో స్పటికం రంగులేకుండా (colour less)... నిర్మలంగా మెరుస్తూ....అద్దం కంటే స్పష్టంగా ఉంటుంది.  ఇలా ఉన్న దాన్ని శిలా స్పటికం (rock crystal) అంటారు.  ఆ రంగులేని స్పటికంలో తెలుపు రంగు కలిస్తే తెల్ల స్పటికం (white quartz crystal),  ఊదా రంగు కలిస్తే  దానిని అమెథిస్ట్ (amethyst),  అంటారు.  ఇవి చాలా శ్రేష్టమైనవి.  అలాగే గులాబీ స్పటికం (rose quartz) ప్రేమ శక్తికి ప్రతీక.  ఒక్కొక్కప్పుడు స్వచ్ఛమైన స్పటికంలో ఇంకొన్ని అంటే రెండు ,మూడు స్పటిక ఆకృతులు చొచ్చుకొని ఉండడం గమనిస్తాం. మొదట స్పటికం పెరుగుదల ...కొంత అయ్యాక మరల అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వల్ల పెరుగుదల క్రింద నుండి ప్రారంభం అయితే అలా దొంతర లేక భ్రమ కలిగించేటట్లుగా కొన్ని కనిపిస్తాయి.  వీటిని "క్లస్టర్లు" అంటారు.  వీటికి కూడా హీలింగ్ ప్రక్రియలో ప్రత్యేక స్థానం ఉంది.

     ప్రాచీన కాలంలో  స్పటికాలను ఉపయోగించి  వివిధ రాజ్యాల పిల్లలకు ఎలా ఆలోచనలను, భావాలను ఉపయోగించడం..... కేంద్రీకృతం చేసి విద్యాభ్యాసం చేయడం..... లాంటి అద్భుత చర్యలు చేసేవారు.

      స్పటికాల సహాయంతో ,కొందరు మహనీయులు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి శరీరాలను అతి కంపిత శక్తితోనే ....సంకల్పబలంతో పయనించేవారని కూడా అంటారు.

      అయితే, అక్కడ ఇలాంటి అద్భుత శక్తులు ఉంటాయో..... అక్కడ ఎప్పుడు నూటికి నూరుపాళ్లు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఉండరు.  దురాశ ,పదవీ వ్యామోహం, మాయ వలన కొందరు ఈ స్పటిక శక్తులను దుర్వినియోగం చేశారని చివరకి,  ఆయా ప్రాచీన నాగరికతలు  ధ్వంసం అయ్యాయని.... ప్రాచీన కాలం నాటి వారు చెబుతారు.

     అయితే కొందరు ఉన్నత ఆశయాలు గల వ్యక్తులు ఈజిప్టుకు పారిపోయి... ఆ జ్ఞానాన్ని బోధించినట్లు... ఈజిప్టు లో ఉన్న అద్భుతమైన "గ్రేట్ పిరమిడ్" అట్లాంటిస్ లో నశించిన దేవాలయానికి ప్రతీక లాంటిదని చాలామంది నమ్ముతారు.

      స్పటికాల మన కంట పడితే మనం వాటిని నిశితంగా చూడాలి. తప్పకుండా అందులో మీకు ఒక శక్తి ఒక స్పందన గోచరిస్తాయి. ఏదో ఒక స్ఫటికం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. తప్పకుండా  మీరు దానిని పొందండి. మీరు స్పటికాన్ని కొనుక్కోండి అనే కన్నా స్పటికమే మిమ్మల్ని వరిస్తుంది. ఒక ప్రఖ్యాత రేకి మాస్టర్  స్పటికాలను కొనడానికి ఎగ్జిబిషన్లో కి వెళ్ళినప్పుడు,  ఒక స్పటికం పై ఆమెకు ఆకర్షణ కలిగింది. 

      ఖరీదు ఎక్కువ అని  వెళ్ళి పోతూ ఉంటే..... నన్ను కొనుక్కో.... ఆ స్పటికం అన్నట్లు తోచింది. ఆ రేకి మాస్టర్... ఆ స్పటికాన్ని కొని దివ్యానుభూతి పొందినట్లు ......విషయం జరిగింది.
(సశేషం...)           
                                                      
🪷⚛️✡️🕉️🪷


*నిర్మల స్ఫటికాకృతిం** *స్పటికాల పై  వైజ్ఞానిక - ఆధ్యాత్మిక విశ్లేషణ *:*

            ---3---

     
 ప్రఖ్యాత శాస్త్రవేత్త  "ఐన్ స్టీన్" అన్నట్లు... మన చుట్టూ దట్టమైన, శక్తివంతమైన.... చైతన్యం,(sea of energy) ఆవరించి ఉంటుంది.  దానినే విశ్వశక్తి అని,  అది కొలతకు అందని అద్భుతమైన నియమంతో ఉంటుందని..... దానినే నేడు సూక్ష్మ బిందు స్వరూపం ( zero point of energy) అని అనుకోవచ్చు.  ఆ బిందువే శ్రీ చక్రంలోని బిందువు, శక్తి కేంద్రము. ఆ బిందువు నే మీదకి లాగితే...మేరువు-3d గా ఆవిర్భవిస్తుంది.  ఈ శక్తి మన శరీరంలో ... జ్యోతి రూపంలో ఉందని... లేకపోవడం మన అజ్ఞానం. ఆ జ్యోతిని మనం  ఆలోచనలు,  భావాల  పూజలతో కప్పివేయడం వలన అది గోచరం కాదు. అయితే మరి దారేది? స్పటికాలు కాంతిపుంజాలు కదా! వీటి వలన అంటే ధారణ వలన ఆ వాతావరణం వారాలు,నెలల సాధన వలన, మనకి ఆ లింకు సులువుగా కలుగుతుంది. నీరు ఎత్తు నుండి పల్లానికి దిగినట్లు..... ఈ శక్తి, జ్యోతి కిరణాలు.... చీకటిలోనికి చొచ్చుకుపోతాయి. అంతే సమతలం (balance) అవుతుంది. స్పటికాలు, తమ ప్రభావాన్ని మొదటి కాంతి శరీరం మీద, అద్భుతంగా చూపెడతాయి. చక్ర సంపుటి అంతే. ఆరా (aura) అంటే సుక్ష్మ శరీరాలన్నీ కలిసిన, మిళితమైన కాంతుల వలయమే..... కాబట్టి కంపనాల ద్వారా గ్రంధులను ప్రేరణ చేసి, అవయవాలన్నిటినీ ఆరోగ్యంతో బ్యాలెన్స్ చేస్తాయి. అద్భుతమైన స్వస్థత చేకూరుతుంది. అన్ని శరీరాలకి... భౌతిక ,మానసిక ,భావోద్వేగ శరీరాలకి స్వస్థత చేకూరుతుంది.

      అందుచేత , ఎక్కడైనా మంచి స్పటికం తారసిల్లితే ... మీరు దానిని పొందండి .తర్వాత దానిని శుభ్రపరచండి. పవిత్ర నదీజలాలలో శుభ్రపరచండి. లేదా పవిత్ర తీర్థాలలో శుభ్రపరచండి.  తరవాత శుభ్రమైన గుడ్డతో తుడిచి... ఎండలో ఒకరోజు ఉంచండి.  లేదా పున్నమి వెన్నెలలో ఉంచండి. లేదా సముద్రపు ఉప్పు లో కప్పి ఉంచండి. అది శుభ్ర పడినట్లే. దానిని శక్తివంతం చేయడానికి.... మీకు ఏమైనా పద్ధతులు తెలిస్తే.... రేకి ,ప్రాణిక్ హీలింగ్.... ఇలాంటివి.... ఉపయోగించండి.  లేదా  లేదా ఎవరైనా  రేకి మాస్టర్ కు ఇచ్చి....హీలింగు చేయించండి.  లేదా  ఏ మహాయోగి కో, ఒక మహాత్ముడుకో ఇచ్చి... స్పృశించ మనండి. అలా చేస్తే స్పటికం శక్తివంతమై.... మీకు సర్వదా రక్షగా ఉండి.... మీ లోని ఉత్తమ భావనలకు స్పందన నిస్తుంది.

      ఒక్కోసారి అవి అతి దుష్ట శక్తులను ఎదుర్కొనే స్థితి వస్తే,  లేక ధరించిన వ్యక్తి.... అలాంటి భావనలను అద్భుతంగా ప్రసరింపజేస్తే.... ఆస్పటికాలు.... ఒక బారి పోయి నిర్వీర్యం అయిపోతాయి.  ఒక్కొక్కప్పుడు పగిలిపోతాయి కూడా. మాయమవడం కూడా చాలా మందికి తెలుసు.

      స్పటికాలలో శక్తి పెరిగిన కొద్దీ.... అవి కూడా, భౌతికంగా పెరుగుతాయి. స్పటికాలను ఉపయోగించి మండలాలు, క్షేత్రాలు, యంత్రాలు.... తయారు చేస్తారు. ఒక్కో కార్యానికి ఒక్కో నిర్దిష్టమైన క్రమం ఉంది. వాటిని ఒక ప్రత్యేకమైన దిశల్లో ఉంచాలి.

      *****

      పాఠకులకి... ఏడు చక్రాలు ఉన్నాయని తెలుసు కదా! ఒక్కో దానికి ఒక్కో రంగు ఉంటుంది. 7 చక్రాలకు ఏడు రంగులు, ఇంద్రధనుస్సులోని రంగులు (సింబాలిక్ గా).... ఇంద్రధనుస్సులోని రంగులు.... ఊదా రంగు (సహస్రారం) మొదలు ఎరుపు రంగు (మూలాధారం) వరకు....ఈ ఏడురంగుల కలయికే తెలుపు రంగు (ధవళ కాంతి!) ....ఇదే భగవత్ కాంతి.  ఈ సప్తవర్ణాల కాంతియే  శరీరం చుట్టూ ఆవరించిన కాంతి శరీరము (aura).

     ఇవన్నీ చక్కగా ఉంటే , బాగానే ఉంటాయి. కానీ మన భావనల/  ఆలోచనల మూలంగా.... ఈ శరీరంలో (ఆరాలో) అడ్డంకులు ఏర్పడి,  ఆ చక్రాలు సమంగా పని చేయక,  గ్రంధులు - అవయవాలకి తగిన శక్తి ఇవ్వకపోతే....బాధలు-శారీరక,మానసిక,భావోద్రేక బాధలు....

      ఇలాంటి నిర్బంధంలో, ఉన్న శరీర క్షేత్రంలో ఒక స్పటికాన్ని ప్రవేశపెట్టారు... అనుకోండి. ఇంకా చూడండి .స్పటికంలో ధవళ కాంతిపుంజాలు ఉంటాయని మనకు తెలుసు.  ఆ కాంతిలో సప్తవర్ణాలు ఉన్నాయి కదా!  తనలోని కాంతిని ప్రసరింపచేసి,  తను ఉన్న క్షేత్రాన్ని.... సమతుల్యం(balance) చేయడం మొదలుపెడుతుంది. ఏ రంగు లోపం ఎక్కడున్నా సరే, ఆ రంగుని శక్తివంతం చేసి, తద్వారా ఆ చక్రాన్ని సరిచేసి గ్రంథి ద్వారా అవయవాలకు శక్తినిస్తుంది. సూక్ష్మంగా జరిగేది ఇది. ఇలాంటి అడ్లు, అవరోధాలు .....ఒక్క శరీరాల్లో నే కాదు, అన్ని చోట్లా ఉంటాయి. మానసికంగా ,ఆధ్యాత్మికంగా కూడా....

    .ఒకే కాంతి లోంచి వచ్చిన కిరణం.... స్పష్టంగా ,తెల్లగా ....ఉన్నా ,దాన్ని మీరు నీలి అద్దం లోంచి చూస్తే విష్ణుభగవానుడు, నేను యధాతధంగా చూస్తే.... శశిధరుడు లేదా మహేశ్వరుడు,  ఆమె.... ఎర్ర అద్దంలోంచి చూస్తే..... అరుణకిరణాలు అమ్మ. వీరందరూ వేరువేరని మనలో మనం వాదులాడుకుంటూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది!

      స్పటికం ఉన్న స్థలం చెత్తగా, అవకతవకలు గా...... ఉంటే అది సహించదు. తనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తో వెంటనే పనిలోకి దిగి,  చెడు కంపనాలను అణచి వేసి, తన అద్భుత కంపనాల ద్వారా మార్పులు తెచ్చే స్పటికాన్ని..... ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.....


మొదట ఒక స్పటికం సంపాదించండి.  చిన్నదైన

ా, పెద్దదైనా.... ఒకే శక్తి ఇంచుమించుగా ఉంటుంది .  చూసినప్పుడు కొన్ని స్పటికాలలో....  ఒకటో,రెండో మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వాటిని వెంటనే చేతుల్లోకి తీసుకొని చూడండి. మంచి అనుభూతి కలుగుతుంది. అదే మీ శరీరాలకి పని చేసేది అని గ్రహించండి. ఒకటి అని కాదు, ఎన్ని కావలిస్తే అన్ని,  కొన్ని స్పటికాలు పగిలినట్లు (పగుళ్ళు కావవి),  నల్లని రంగులు కనిపించవచ్చు. ఈ నల్లనివి ఉంటే ఉంచుకోండి. ఈ నలుపు రంగు ఇనుప ఖనిజ సంబంధం. శరీర రుగ్మతలకు విరుగుడు. స్పటికాల మొనలు బాగా ఉండాలి.

      మీ దగ్గరకు రాగానే స్పటికాలను శుభ్రం చేయడం ముఖ్యం. వాటిని ప్రవహించే సెలయేళ్లు లేదా జీవ నది లో అరగంట ఉంచండి. లేదా సూర్యరశ్మిలో ఒకరోజు, లేదా వెన్నెలలో ఒక రాత్రి, ఇవేమీ కుదరకపోతే భూమిలో మూడు రోజులు... పాతి ఉంచితే ఆ స్పటికంలోని చెడు కంపనాలు తొలగిపోతాయి. లేదా సముద్రపు నీటితో కడగడం ఉప్పులో ఉంచడం కూడా మంచిది. లేదా రేకి, ప్రాణిక్ హీలింగ్ తెలిసిన వారి చేత, శ్రీ విద్యోపాసకుల చేత, గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తుల చేత....శక్తిభూతం చేయించండి.అనుమానం వద్దు. ఇక ఉపయోగించండి.  
                                                      
🪷⚛️✡️🕉️🪷

No comments:

Post a Comment