🕉️🙏🕉️
*🕉️🙏ఆత్మ.. సర్వాంతర్యామి.🕉️🙏*
*🕉️🙏దాన్ని కేవలం జ్ఞాన చక్షువుతో చూడగలగడం తప్ప, ఇతరత్రాకాదు. ఆత్మ అంతరాలయం. అందులోని జీవుడు పరమాత్మను ఆహ్వానించి ప్రతిష్ఠించి, నిత్య సేవలతో ప్రేమ పూజారిగా ఆయనను ఆరాధించాలి.*🕉️🙏
*🕉️🙏జ్ఞానమనే జ్యోతి వెలుగులో ఆయనను మనసారా వీక్షించాలి. ఉపాసించాలి. అభిషేకించాలి. ఆత్మ లేకపోతే ఇంద్రియాలు పని చేయడం మానేస్తాయి. మనసు ఆలోచించలేదు. అన్నింటికీ ఆధారం ఆత్మ. ఆత్మతత్వం బోధపడినవారు సర్వ దుఃఖాల నుండి విముక్తి పొంది ఆనందానుభవం పొందుతారు. అలాంటివారికి అలౌకికానందం కరతలామలకం అవుతుంది.*🕉️🙏
*🕉️🙏ఆత్మ సనాతనం. అది శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది.*🕉️🙏
*🕉️🙏ఆత్మజ్ఞానమంటే.. ప్రజ్ఞ, ప్రకర్ష, అతిశయాలకు ఆలవాలమైన విజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం పొందడానికి ఆ భగవంతుడినే ఆలంబనగా చేసుకోవాలి.🕉️🙏*
*🕉️🙏అవ్యక్తమైన పరమాత్మ మన ఆరాధన నిమిత్తం తనను తాను ఐదు విధాలుగా మార్చుకున్నాడని ఆగమ శాస్ర్తాలు చెబుతున్నాయి. అవి పరం, వ్యూహం, విభవం, అంతర్యామి, అర్చామూర్తులు.🕉️🙏*
*🕉️🙏వీటిలో యోగసాధనతో, తపస్సుతో, భక్తితో సాధించగలిగేది అంతర్యామి రూపం.🕉️🙏*
*🕉️🙏ప్రతీజీవి హృదయంలో పరమాత్మ కొలువై ఉన్నందువల్లనే దేహమే దేవాలయమని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.*🕉️🙏
*🕉️🙏ఆత్మజ్ఞానం పొందడానికి, మోక్షప్రాప్తికి గృహస్థాశ్రమం ఆటంకం కాదు. సంసారంలో ఉంటూనే ధర్మబద్ధమైన కామ ప్రవృత్తితో జీవించేవాడు ఆత్మజ్ఞానిగా గుర్తింపు పొందుతాడని, ఏది ధర్మ విరుద్ధమో ఏది ధర్మ బద్ధమో గ్రహిస్తే, ధర్మ బద్ధమైన కామం మూడో పురుషార్థంగా గౌరవం పొందుతుందని, ధర్మ విరుద్ధమైన కామం అరిషడ్వర్గంలో చేరుతుందని బోధపడుతుంది.*🕉️🙏
*🕉️🙏హృదయ శుద్ధి లేకుండా, విషయ లోలత్వం విడనాకుండా, ఐహిక వాంఛలపట్ల ఆపేక్ష చంపుకోకుండా, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించకుండా, ఆత్మజ్ఞానం లేకుండా దైవాన్ని ధ్యానించడం వల్ల ఒనగూడే ప్రయోజనం శూన్యం.*🕉️🙏
*🕉️🙏పరమాత్మనామాన్ని జపించే సాధకులకు మనోనైర్మల్యం లేకపోతే ఎలాంటి ఫలితమూ ఉండదు. అలాంటి వారికి బ్రహ్మానూభూతికలగడం అసాధ్యం. వారి ఆత్మోపాసన.. భాండ శుద్ధిలేని పాత్రలో వండిన పదార్థం వలె వ్యర్థం.*🕉️🙏
*🕉️🙏యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తులో ‘‘అహం బ్రహ్మస్మి’’ అనే వాక్యం ఉంది. అనగా, నేనే పరబ్రహ్మను’’ అని దాని అర్థం. బ్రహ్మమనేది ఎక్కడో కానరాని లోకాల్లో లేదని.. అది ఎంత దూరమో అంత దగ్గర అని, మనలోనే ఉన్నదని తెలిపే వేదసారమీ ఒక్క వాక్యం.*🕉️🙏
*🕉️🙏నేను నేను కాను. సర్వాత్ముడను. నిత్యముక్తుడను. పురుషార్థాలు నావి కావు. నేను చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మననే అమృత తుల్యమైన భావన అది. ఆ భావనతో పరమాత్మనర్చిస్తే ప్రతి మనిషీ పరబహ్మమే ఔతాడు.*🕉️🙏
🕉️🙏🕉️
No comments:
Post a Comment