🌹గుడ్ మార్నింగ్ 🌹కదిలే ఆలోచనలను గమనిస్తూ - వాటితో మనం కదలకుండా - భావాలను కూడా ఆలోచనలతో మిళితమై కలయిసిపోయి ముందుకు పోనీయకుండా ఆపుతూ - జస్ట్ లోపల మనను మనం గమనించుకుంటూ ఉంటే - ఒకటి --- మనం అనవసరపు ఆలోచనలు - ఊహలు ఎన్ని చేస్తున్నామో తెలుస్తుంది. ఇవి అనవసరాలు అన్నప్పుడు - ఇవి ఇప్పుడు ఆలోచించ నక్కర్లేదు అని మనకు మనమే చెప్పుకుంటూ - అప్పుడు అవసరంకాని వాటిని ముందుకు సాగనివ్వకుండా ఆపవచ్చు. ఆలోచనలు - భావాలు మొత్తముగా మనసు కంట్రోల్ అనేది......... గమనించుకుంటూ - మనతో మనం ఇవి నాకు వద్దు అని అనవసరాలను చెప్పుకుంటూ - ఇది ఒక సాధనలా చేస్తూ ఉంటే వస్తుంది.
దుఃఖము, సుఖము అన్ని భావ రూపాలే. సుఖాలు, మంచి ఇష్టాలు కావాలని కోరుకుంటూ - ప్రయత్నిస్తూ, మనకు మనం చెప్పుకుంటున్నాము.
ఇదే విధానములో కష్టాలు, బాధలు వ్యతిరేక ఆలోచనలు, భావాలు - లోపల పుట్టగానే వద్దని చెప్పుకుంటే - కొంత కాలానికి మనసు అదే నేర్చుకుంటుంది. ఇక్కడ అద్భుతాలు, మహిమలు ఏమి లేవు జరగవు. మనను మనమే తయారుచేసుకుంటున్నాము. కోరుకునేవి కొన్ని - వద్దనుకునేవి కొన్ని - చెడులు కొన్ని - వీటిని సరైన విధముగా సరిచేసుకొని మొత్తము మంచిగా జీవించవచ్చు అని చెప్పేదే ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన చదువు.ప్రయత్నించండి. ఇది చాలా తేలిక. నన్ను గమనించుకోవటము - అనవసరాలు, చెడులు గుర్తించి - నాతో నేను వద్దని చెప్పుకోవటమే. చెత్త ఏరివేసి మంచిని మాత్రమే ఉంచుకునే నిత్య సాధన. అంతరంగ శుభ్రత.తప్పక మీపై మీరు అదుపు సాధించగలరు.🌹god bless you.🌹
No comments:
Post a Comment