Friday, August 2, 2024

****అంశం: భయమే నీ శత్రువు శీర్షిక: "" భయానికి అభయమిస్తూ....""

 అంశం:  భయమే నీ శత్రువు
శీర్షిక:
    "" భయానికి అభయమిస్తూ....""

 చిన్నప్పుడు పిల్లలు అన్నం తినక పోతే
భుచోడికి  పట్టిస్తామని
లేని భూచోడిని సృష్టించి
లేని పోని భయాల్ని.కల్పిస్తూ
భయానికి  అభయమిస్తూ
భయాన్ని నిర్భయంగా పెంచి పోషిస్తున్నాం
బాల్యం నుంచే భయానికి బంధీలను గావిస్తున్నాం!
ఆ భయం ఇంతై వటుడింతై అన్నట్లుగా
వయస్సుతో పాటు పెరిగి
మనస్సుల్లో వెళ్లునుకుంటుంది
భయం భయంగానే జీవితాన్ని గడిపేలా చేస్తుంది
పరోక్షంగా పిల్లలకు శత్రువుని తయారు చేస్తుంది!
నిప్పు జోలికెళ్తే కాలుతుందం ని
నీటి జోలికెళ్లకు మునుగుతావని
చీకట్లోకి వెళ్లకు దెయ్యంఉంటుందని
ఒంటరిగా వెళ్లకు దొంగలుంటారని
ఇలా నీరు, నిప్పు, చీకటి, దెయ్యం లాంటి
కృత్రిమ భయాలను కల్పించి
పసివారి స్వచ్ఛ హృదయఫలకాలపై
భయాన్నినభయాంకరంగా ముద్రించి
భయానక శత్రు వాతావరణంలో పెరిగేలా చేస్తూ
పిరికితనాన్ని నూరిపోస్తున్నాం!
జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక
విజయాలను సాదించలేక
అపజయులై మిగుల్తున్నారు
పిరికిపందలుగా నే మిగుల్తున్నారు!
కృత్రిమ భయాన్ని కల్పించక
భయనక పరిస్థితుల్ని  సైతం ఎదుర్కునేలా
ధైర్యాన్ని నూరిపోద్దాం
నిజ జీవితంలో విజేతలయ్యేలా  
తీర్చిదిద్దుదాం!
...........................................
ఆళ్ల   నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
 చరవాని సంఖ్య: 7416638823
........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.

No comments:

Post a Comment