Sunday, August 11, 2024

విద్యార్ధుల బ్యాగుల్లో గంజాయి,*

 .

*విద్యార్ధుల బ్యాగుల్లో గంజాయి,*

 లక్షల్లో డబ్బులు
విజయవాడ స్కూల్స్ లో షాకింగ్ విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతోంది.

 అందులోను ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 

మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్ధుల బ్యాగ్లలో డ్రగ్స్ తో పాటు లక్షల రూపాయల నగదు పట్టుబడిన ఘటన ఆసక్తికరంగా మారింది. 

గత వారం విజయవాడలో ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కొంతమంది స్టూడెంట్స్ టాయిలెట్స్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించేసరికి అంతా షాక్ కు తిన్నారు.

అనుమానం వచ్చి 9,10వ తరగతి విద్యార్ధుల స్కూల్ బ్యాగ్ లను తనిఖీ చేయడంతో కొంతమంది బ్యాగుల్లో ఎలక్ట్రానిక్ సిగార్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాలు దొరికాయి. 

సదరు విద్యార్ధుల పేరేంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. మత్తు పదార్ధాలు సేవిస్తున్న విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 

ఈ క్రమంలో విధ్యార్ధులకు సంబందించి ఎన్నో ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదే స్కూల్ కు చెందిన ఓ స్టూడెంట్ ఆన్ లైన్ గేమ్స్ లో పది లక్షల రుపాయలు గెలిచాడట. 

ఆ డబ్బును తన దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది కలుగుతుందని, సుమారు ఆరేడు లక్షలు స్నేహితులకు ఇచ్చాడు. 

అంత డబ్బు ఇళ్లకు తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పడంతో వారు స్కూల్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేశారు. 

దీనిపై స్కూల్లో విచారణ చేయగా సదరు స్టూడెంట్ మొబైల్ ఫోన్ లో ఆన్లైన్లో పలురకాల బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నట్టు గుర్తించారు.

ఇలా ఆన్ లైన్ లో సంపాదించిన డబ్బులను ఫ్రెండ్స్ కు ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 

సదరు విద్యార్ధిపై సైతం స్కూల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇక 9వ తరగతి చదివే కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో బర్త్ డే పార్టీ జరుపుకున్నారు. 

14ఏళ్లలోపు విధ్యార్ధులు మాత్రమే ఉన్న వారికి చెన్నై కోల్కత్తా నేషనల్ హైవేపై ఉన్న ఓ స్టార్ హోటల్లో పార్టీ చేసుకోడానికి అనుమతించారు. ఈ పార్టీలో కొంతమంది స్టూడెంట్స్ మధ్యం సేవించినట్టు తెలుస్తోంది.

హోటల్ లో పుట్టిన రోజు పార్టీ విషయం ఆలస్యంగా తెలిసిన పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేశారు. 

పాఠశాలలో టాయిలెట్ ప్రదేశాలు మినహా, ప్రతి ప్రాంతం కవర్ అయ్యేలా సీసీ కెమెరాల ఏర్పాటు చేసినా విద్యార్ధులు గాడి తప్పుతున్నారని స్కూల్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఇంటి దగ్గర పేరెంట్స్ పర్యవేక్షణా లోపంతోనే ఈ సమస్య వస్తోందని అంటున్నారు. పిల్లలు ఏంచేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment