స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ని పొందడమే కష్టం. రక్తం పంచుకున్న తోబుట్టువులు.. జీవితాంతం తోడు ఉంటారో లేదోగానీ.. స్నేహితులు మాత్రం మన నీడలా మనవెంటే ఉంటారు. చిన్న ఆపద వచ్చినా ఆదుకుంటారు. నేనున్నానని ధైర్యం నింపుతారు. అందుకే.. వారిని ఏడాదిలో ఒక్కసారైనా స్మరించుకోవడం మన ధర్మం. అందుకే, ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్షిప్ డే’గా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజునే స్నేహితుల దినోత్సవంగా ఎంపిక చేయడానికి.. అమెరికాలో జరిగిన ఓ విషాద ఘటనే కారణమని చెబుతారు.
1935 సంవత్సరంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేని అతడి స్నేహితుడు.. ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వారి స్నేహానికి గుర్తుగా అమెరికన్ కాంగ్రెస్ ఆగస్టు తొలి ఆదివారాన్ని ‘ఫ్రెండ్ షిప్ డే’గా ప్రకటించిందని చెబుతారు. అయితే, ఈ ఘటనకు ముందు నుంచే ‘ఫ్రెండ్షిప్ డే’ ఉండేదని పలువురు వాదిస్తున్నారు. 1930లో ‘హాల్మార్క్’ సంస్థ తమ గ్రీటింగ్ కార్డులను విక్రయించాలనే ఉద్దేశంతో ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్షిప్ డే’గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతిపాదించారని, అప్పటి నుంచి ఈ ట్రెండ్ నడుస్తోందని చెబుతున్నారు. అయితే, ఐక్యరాజ్య సమితి మాత్రం.. జులై 30వ తేదీని ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’గా ప్రకటించింది. కానీ, మన దేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్నేస్నేహితులదినోత్సవంగాజరుపుకుంటున్నారు. అందరికీపేరుపేరునా
*స్నేహితుల దినోత్సవ* శుభాకాంక్షలు
🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝
మీ ద్వారపూడి అప్పారావు 💐💐🍫🍫🚩🚩💪🏻💪🏻
No comments:
Post a Comment