*💪🏻ధైర్యం చెప్పండి*
🦚🌻🌹💎🔰🌈
*🍁ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు పరుగులు పెట్టి అడుకుంటున్నారు.*
*ఒకడు పదేళ్ల వాడు.*
*ఇంకొకడు ఆరేళ్ల వాడు.*
*చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.*
*పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.*
*ముందు పెద్ద బావి ఉంది.*
*పెద్దోడు చూసుకోలేదు.*
*అందులో పడిపోయాడు.*
*వాడికి ఈత రాదు.*
*బావి చాలా లోతు.*
*చుట్టుపక్కల ఎవరూ లేరు.*
*అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.*
*చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.*
*"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.*
*నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.*
*చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.*
*"అన్నా ... భయపడకు..!*
*జాగ్రత్తగా పట్టుకో..!*
*పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.*
*తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.*
🦚🌻🌹💎🔰🌈
*ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.*
*ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.*
*ఊళ్లో ఎవరూ నమ్మలేదు.*
*ఆరేళ్ల వాడేమిటి..!?*
*పదేళ్ల వాడిని లాగడమేమిటి ..!?*
*అందునా బావి నుంచి లాగడమేమిటి ..!?*
*అసాధ్యం..!*
*వాడు చేయలేడు అని అన్నారు.*
*ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.*
*సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.*
*ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.*
*"మీరు నమ్ముతారా అని అడిగారు*
*"నమ్ముతాను" అన్నాడు.*
*"ఎలా?"*
*"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."*
*"అదెలా సాధ్యం...*
*అంత చిన్నోడు ఎలా చేయగలడు?"*
"*తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు.*
*"ఒరేయ్..! నీకంత బలం లేదురా,*
*నువ్వు చేయలేవురా,*
*అది నీవల్ల సాధ్యం కాదురా.*
*అని చెప్పేవారెవరూ కూడా...*
*ఆ పరిసరాల్లో లేరు, కాబట్టి వాడు చేయగలిగాడు."*
"*నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు.* "
*ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.*
*"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పెద్దమనిషి.*
*మనం ఎదుటివారికి ధైర్యం చెప్పకపోయినా పర్లేదండి . అంతేకానీ నిరుత్సాహ పరచడం , భయపెట్టడం చెయ్యకూడదు* .
🌹🌻🦚💎🔰🌈
No comments:
Post a Comment