. 🙏 శుభాభినందనలు 🙏
ఈ ఆత్మ శక్తి, విశ్వచేతన శక్తి,....వాక్చక్తి వలన కానీ వేదాధ్యయనం వల్ల కానీ లభించదు.
. *ఆ విశ్వచేతన శక్తి * ఆ ఆత్మ శక్తి ఎవనిపట్ల సంప్రీతం అవుతుందో ఆ మానవునికి తనను తానుగా సాక్షాత్కరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహము, త్రికరణశుద్ధి, సత్య సందీప్త హృదయము కలవానికి, నిరంతర సాధన ద్వారా తనను తాను పరిశుద్ధం చేసుకునే వానికి , ఎలాంటి ఆత్మవంచనకు తావులేకుండా తనను తాను వున్నత మానవునిగా తీర్చిదిద్దుకోగలిగిన వానికి మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
సర్వ భూతములలో నిగూఢమై ఉండే ఈ ఆత్మ ఇంద్రియ దృష్టికి ప్రకాశింపదు. శబ్ద, స్పర్శ,రూప,రసగంధాలకతీతమై, అవ్యయమై,నిత్యమై,అనాదియై, అనంతమై, ప్రకృతికి కూడా అతీతమై ఉండే ఆత్మను ఎవడు సాక్షాత్కరించుకుంటాడో వాడు మృత్యుంజయుడౌతాడు.కానీ ఇది ఎంత కష్టమైనదో అంత తేలికైనది కూడా.రెండు వైపులా పదునుగల కత్తి అంచు మీద నడక అంత కష్టమైనది.సూర్యోదయాన్ని చూడాలంటే పడమరవైపు చూడకూడదు. అసమయానికి తూర్పువైపు తిరగాలి.తూర్పువైపు తిరగడం ఎంత తెలీకో అంత తేలికైనది. కనుక నడుంకట్టి ముందుకు అడుగులు వేయండి.వివేకానంద మాటలలో.......లెండి....మేల్కొనండి.....జిజ్ఞాసులు కండి.....జ్ఞానులు కండి.....గమ్యం లభించేవరకు అలుపెరగక సాగండి.ఆత్మ సామ్రాజ్య సింహాసనాభిషిక్తులు కండి.
. 🙏 శుభాకాంక్షలతో 🙏
.
No comments:
Post a Comment