*ఒకసారి నారదుడు విష్ణువును అడిగాడు " మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు ?" అప్పుడు విష్ణువు చెప్పాడు - "నారదా, నా కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టం."*
*ఇలా చెబుతూ, విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టారు. ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి, అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు. సాధు వేషంలో ఉన్న విష్ణువు అన్నాడు - "స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది. మాకు భోజనం పెట్టించండి "*
*ధనికుడు కోపంగా, "ఎద్దుల్లాగున్నారు, పని చేసుకుని తినండి" అని వాకిలి వేసేశాడు. నారదుడు అన్నాడు - "చూడండి ప్రభూ! ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి. ఇప్పుడే అతన్ని శపించండి."*
*నారదుని మాటలు విన్న దేవుడు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు.*
*దీని తర్వాత, విష్ణువు నారదున్ని ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది, అందులో ఆవు తప్ప మరేమీ లేదు. భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది. సాధువులిద్దరినీ ఒక ఆసనంలో కూర్చోబెట్టి, వారికి తాగడానికి పాలు తెచ్చి - "ప్రభూ! నా దగ్గర ఇంకేమీ లేదు, దయచేసి దీనిని సేవించండి." అన్నది.*
*విష్ణువు ఎంతో ప్రేమతో దానిని అంగీకరించాడు. అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు - "ప్రభూ! ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు, ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది మరియు అతిథులను కూడా ఆదరిస్తుంది. దయచేసి ఆమెకు మంచి సంపదను ఇవ్వండి."*
*కాసేపు ఆలోచించిన తరువాత, విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు.*
*అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు - "ప్రభూ మీరు ఏమి చేసారు?"*
*విష్ణువు అన్నాడు - "ఈ వృద్ధురాలు మహా భక్తురాలు. కానీ ఆమెకు ఆమె ఆవు మీద మోహం ఉన్నది. ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది. చనిపోతుండగా, ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది. దీనివలన ఆమె మరుజన్మలో ఆ అవుకు దూడ అయి జన్మిస్తుంది. కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది. కానీ ఆ ధనికుడు అజ్ఞాని. ఆతను తన దనం మీద ఉన్న అపరిమిత మొహం వల్ల మరు జన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు. ప్రకృతి నియమం ఏమిటంటే, మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో. అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది"*
*కాబట్టి మీ ఆలోచనలను భగవంతునిపై ఎక్కువగా ఉంచండి...*
*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే.*
🙏🕉️🙏 🙏🙇♂️🙏 🙏🕉️🙏
No comments:
Post a Comment