*_🌹'ఈరోజు ఒక మంచిమాట '🌹_*
*_అయ్యో.. నేను ఒంటరిని అయ్యానే.. అనే బాధతో క్షణక్షణం కుమిలిపోతున్నావా...?_*
*_నా వారు అనేవారు నాతో లేరని బాధపడుతున్నావా...?_*
*_ఈ సమాజం నన్ను వదిలేసిందే...అనే దిగులుతో మూలకు కూర్చున్నావా...?_*
*_ఓ..దేవుడా నాకెందుకు ఈ శిక్ష అని రోదిస్తున్నావా...?_*
*_మిత్రమా.. అంతా నాటకం ఇదొక బూటకం..._*
*_ఒంటరిగా ఉన్నావంటే, నీవంత అదృష్టం ఎవరికి లేదని అర్థం..._*
*_ఎందుకంటే,ఎవరికి రాని ఒంటరితనం నీకే లభించింది సంతోషించు...ఒంటరిగా ఉండడం అంటే... "ఏకాంతంగా" ఉండడం అని అర్థం._*
*_గొప్ప గొప్ప వారు ఏకాంతాన్ని కోరుకుంటారు. కానీ వారికి ఆ ఏకాంతం లభించడం చాలా కష్టం. వారు ఎన్నో వ్యవహారల్లొ తలమూనాకలై ఉంటారు కదా!_*
*_జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు.!
నిజానికి ఆ ఒంటరితనం నీకు
జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది....!
ఒంటరితనం మరియు అవాంఛనీయ భావన చాలా భయంకరమైన పేదరికం._*
*_"జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం
కష్టంగా ఉండొచ్చు. కానీ, నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది.”_*
*_ఓటమి, ఒంటరితనం ఈరెండు జీవితం లో చాల నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే
ఇంకోటి ఎవరిని నమ్మాలో
ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది._*
*_నిజం చెప్పాలంటే ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం అనేది, ఒంటరిగా ఉండడం ద్వారానే సాధ్యమవుతుంది. అయినా నీతో నీవు ఉండడానికే నీకు బోర్ కొడితే,నీ ప్రక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది..?_*
*_అదే నువ్వు ఆత్మ సాన్నిధ్యంలో ఒంటరిగా ఉండగలిగితే,రోజు నీతో నువ్వు గడపడం ఇష్టపడితే, నీ సొంత ఆలోచనలను, భావాలను గమనిస్తూ గడిపినప్పుడు నిశ్శబ్దం అంటే ఏంటో నీకు తెలుస్తుంది._*
*_నీ మనసు ప్రాపాంచికమైన ఆలోచనలతో చిక్కుకొని ఉంటుంది కాబట్టి,రోజు ఏదో ఒక సమయంలో కొద్ది నిమిషాల పాటు ఒక్కడివే కూర్చుని హృదయపు లోతుల్లోకి వెళ్ళిపో అప్పుడిక ఒంటరిగా ఉండాల్సిన ఒంటరితనాన్ని అనుభవించవు._*
*_ఎవరు చెప్పారు నీవు ఒంటరివి అని..? అది నువ్వు సృష్టించుకున్న ఒక వలయం. నిన్ను ఎవరు ప్రేమించడం లేదని ఆలోచన నీకు వస్తే, నువ్వు కచ్చితంగా ప్రేమను పొందుతున్నావని అర్థం._*
*_భూమి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే,నిన్ను స్థిరంగా నిలిపి ఉంచుతుంది. భూమి అంటే గురుత్వాకర్షణ శక్తి దాని ప్రేమా..._*
*_గాలి నిన్ను ప్రేమిస్తుంది కనుక నీవు నిద్ర పోతున్న సరే నీ ఊపిరితిత్తులలోకి వస్తూ పోతుంది._*
*_దైవం నిన్ను అత్యధికంగా ప్రగాఢంగా ప్రేమిస్తుంది. ఈ చిన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడవు కావు అనే భావనస్పూర్తిస్తుంది._*
*_ఒంటరితనం అనేది ఒక రకమైన అనుభూతి. అది మీ చుట్టూ ఉన్న వారు మీకు క్రియేట్ చేసిన ఓ భావోద్వేగం. అది మిమ్ములను కృంగదీస్తుంది._*
*_మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు ప్రతికూల ఆలోచనలు వెంటాడుతూ.. కొన్ని సమయాల్లో అవి ప్రమాదకరంగా కూడామారుతాయి. మనకు తెలియకుండా ఇవి మన జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తుంది, అంతేకాకుండా మీకు మనుషుల మీద విరక్తి కలిగిస్తాయి కాబట్టి,.._*
*_మీ సంతోషాన్ని మీరే వెతుక్కోండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడు ఆలోచించకండి. పరిస్థితుల పట్ల సానుకూల దృక్పత్వాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించండి అప్పుడు మీరు రోజంతా ఉల్లాసంగా ఉంటారు.☝🏾_*
No comments:
Post a Comment