చనిపోయిన తాతముత్తాతలు దేవతలు ఎలా అవుతారు?
==================
ఇటీవల అరకొర జ్ఞానంతో కొందరు చెప్పేది విని, తాతముత్తాతల తరతరాల ఫోటోలు తీసేస్తున్నారు. ఫలితంగా ఇల్లు పిశాచాల మయం అవుతోంది.
‘‘చనిపోయిన వారు దేవతలు ఎలా అవుతారు?" అని చాలామందికి సందేహం ఉంది. దీనికి సమాధానం వరాహపురాణం చెబుతోంది.
అందరికీ తెలిసిన సత్యం తండ్రి, తాత, ముత్తాతలను పితృదేవతలుగా ఆరాధిస్తామని. అయితే, వీరు దేవతలు అయిన సంగతి మాత్రం చాలామందికి తెలియదు. ఆ వివరాలు వరాహపురాణంలో ఇలా ఉన్నాయి.
పితృదేవతలు పరమాత్మనుంచీ ఉద్భవించారు. వారు తండ్రి, తాత, ముత్తాతలుగా ప్రతీ జీవికీ చెందుతారు. వరాహావతారంలో విష్ణుమూర్తి భూదేవికి చెప్పినదాని ప్రకారం వీరికి పితృ-ఆరాధనలో లభించే పిండాలు, నీరు చెందుతాయని వరమిచ్చారు. పితృదేవతలలో తండ్రి-దేవతకు అధిదేవత బ్రహ్మదేవుడు. వీరు బ్రహ్మ-శరీరం నుండి పుట్టారు. తాత-దేవతకు అధిదేవత విష్ణువు. వీరు విష్ణువు-గాత్రం నుండి పుట్టారు. ముత్తాతదేవతకు అధిదేవత మహారుద్రుడు. వీరు రుద్రుని నుండి పుట్టారని, మహారుద్రుడు చెప్పాడు.
ఈ విధంగా పుట్టిన ముగ్గురు దేవతలూ అప్పటి నుంచీ నేటి ప్రతీ జీవికీ తన తండ్రి, తాత, ముత్తాతలుగా వంశవృక్షంలో చెందుతారు. పరమాత్మనుంచీ సంభవించిన వీరు ఈ విధంగా దేవతలు అయి, ప్రతీ జీవికీ అక్షయ్యపుణ్యఫలాలు ఇవ్వడానికి ఉన్నారు. వీరిని అర్చించిన వారికి సకల ధన,కనక,వస్తు,వాహనాది సౌఖ్యాలూ కలిగిస్తారు.
వీరు ఉద్భవించినప్పటి నుంచీ మన తండ్రి వరకూ వీరి పరంపర కొనసాగుతోంది. ఇది కొనసాగే విధం అందరూ తెలుసుకోవాలి.
మనతండ్రి తనతండ్రికీ (మనతాతకు), తనతాతకు (మనముత్తాతకు), తనముత్తాతకు (మనతండ్రి ముత్తాతకు) మాత్రమే పిండప్రదానం చేస్తాడు. ఇలా పిండప్రదానాలు చేసిన మనతండ్రి మరణించిన తరువాత, ఆయన కుమారునిగా మనం తండ్రిని ఆ ముగ్గురు స్థానాల్లో చేరుస్తాము. ఇలా చేర్చేటప్పుడు తండ్రి ముత్తాతను ఆదిత్యులలో కలిపి మనతండ్రి, మనతాత, మనముత్తాతలను ముగ్గురు దేవతలుగా→ బ్రహ్మ, విష్ణు, రుద్ర అంశలుగా అర్చిస్తాము.
ఇది చాలా కీలకమైనది. ఇదే సపిండీకరణంలో జరిగేది. ఇలా తండ్రిని ముగ్గురు దేవతలలో కలపడంతో అప్పటివరకూ (పదోరోజువరకూ) ఉన్న ప్రేతరూపం ఆయనకు పోయి దేవతా(వశు)రూపం వస్తుంది. పితృదేవత స్థానం పొందుతారు. ఇదే శాస్త్రం.
ఇక్కడ గమనించవలసిన అతిముఖ్యవిషయం ఉంది↓
ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఈ గొలుసు తెగిపోతుంది. ఇది చాలామందికి తెలియదు.
పుట్టిన ప్రతీ వ్యక్తీ సహజమరణంతోనే తనువు చాలించాలి. అలా మరణించినప్పుడు మాత్రమే వారికి పితృదేవతా స్థానం వస్తుంది. అలా కాకుండా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారికి పితృదేవతా స్థానం రాదు. వారు ప్రేతాత్మగానే మిగిలిపోతారు. అంతేకాక ఆత్మచేసుకున్నవారు పితృదేవతల్లో చేరరు కనుక తరువాత తరాల్లో వారు, వారికి ముందు తరాల తాతలు కూడా పిండోదకాలకు దూరం అవుతారు. దీంతో ఆ వంశం మొత్తం నరకంలో పడుతుంది. ఇంత ఘోరమైన నరకం కేవలం ఒకరు వంశంలో ఆత్మహత్య చేసుకోవడంవలన జరుగుతుంది.
హైందవ ధర్మశాస్త్రాలలో ఆత్మహత్యలకు మహానీచమైన శాపాలున్నాయి. వారు ప్రేతాత్మలుగా మిగిలి పిండోదకాలు లేకుండా అలమటించాల్సిందే. అంతేకాదు, సహజంగా మరణించినవారి పిండాలను గయాక్షేత్రంలో (బీహార్లో ఉంది) సాక్షాత్తూ విష్ణుమూర్తి పాదాలమీద ఉంచుతారు. కానీ, ఆత్మహత్య చేసుకున్న వారిపిండాలను కూపశ్రాద్ధం అంటూ చేసి బావిలో పారేస్తారు. ఇంత భయంకరమైన శిక్ష ఆత్మహత్య చేసుకున్నవారికి ఉంటుంది. కనుకనే అక్కడి పండితులు పిండప్రదానం ముందు వంశీయుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? అని ముందుగా ప్రశ్నిస్తారు.
కనుక, సహజమరణం పొందినవారంతా బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూప దేవతలుగా అర్చనలు అందుకుంటే, ఆత్మహత్యలు చేసుకున్నవారు ప్రేతాత్మలుగా మారి పిండోదకాలు లేకుంటా అలమటిస్తారు.
కనుకనే, ఇది తెలిసి ఎవరూ ఆత్మహత్య చేసుకునేవారు కాదు. తాము మాత్రమే కాకుండా, తమవల్ల గొలుసు తెగిపోయి పైనున్న తండ్రి తాత ముత్తాతలు కూడా నరకాల్లో పడతారు కనుక ఎన్నికష్టాలు వచ్చినా అనుభవించేవారు. కానీ, నేడు చిన్నచిన్న కారణాలకు, ప్రేమకారణాలు, రాజకీయకారణాలకు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యతరం తయారవుతోంది.
వీరంతా ప్రేతాత్మలుగా మారి నరకాలు చవిచూస్తారు. అలా కాకుండా సహజమరణం పొందినవారు దేవతలుగా మారి, పితృలోకంలో ఉంటారు. వీరు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఆదిత్య రూపులుగా వర్థిల్లి, తమవంశాల వారిని సంరక్షిస్తారు.
అయితే, ఆత్మహత్యలు చేసుకునే ఇటువంటి వారివల్ల మొత్తం తరాలు నరకంలో పడుతున్నాయి. కనుక, కొంత కరుణ కలిగి, పిశాచిత్వాన్ని తగ్గించడానికి నాగబలి అనే ప్రాయశ్చిత్తాన్ని చేస్తారు. దీనివల్ల పూర్వీకులకు లబ్ధి జరుగుతుంది. కానీ, ఆత్మహత్య చేసుకున్నవారి పిండాలు మాత్రం గయలో బావిలోనే వేస్తారు.
కనుక, పితృదేవతలను ‘‘ఆ రోజుల్లో’’ అర్చిస్తే బ్రహ్మవిష్ణుమహేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్టే అని వరాహపురాణం చెబుతోంది.
అంతేకాక, పిండాలలో తండ్రి-పిండాన్ని కుమారుడు (కర్త) తినవచ్చని, సంతానం కావలసిన కోడలు మధ్యపిండాన్ని తినాలని, మూడోపిండాన్ని జలచరాలకు ఇవ్వాలని వరాహపురాణం కంఠోక్తిగా చెబుతోంది.
గురుదేవుల ఆదేశాల ప్రకారం పితృదేవతాపక్షోత్సవాల ప్రచారం చేస్తున్నాము. పితృదోషాలున్న వారికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేయదలచాము.
★ఎవరికైతే పితరుల శాపాలున్నాయో వారు సప్త మోక్షక్షేత్రాలకు వెళ్ళలేరు. పెద్దలకు పిండప్రదానాదులు చేయలేరు. తిలతర్పణాలు చేయలేరు. కనీసం ఈ వ్యాసాలు కూడా చదువలేరని గరుడపురాణం స్పష్టంగా చెబుతోంది. అందుచేత, మహాపురాణాల నుంచి సేకరించిన ఈ సమాచారాలు ప్రచారం చేయమని, వీటిని చదివినా, చూసినా, ప్రచారం చేసినా, ఇతరులకు ఫర్వార్డు చేసినా వారికి పితృశాపాలు తొలగుతాయి. ఈ కారణంచేత మహాపురాణాల నుంచీ పితరుల మాహాత్మ్యం తెలిపే సమాచారాలు ప్రతీరోజు అక్టోబర్ 3 వరకూ ప్రచురిస్తాము.
★మీరంతా వీటిని శ్రద్ధగా చదివి, పెద్దలు సంతోషించే విధంగా, మహాపురాణాది వేదవేదాంతవిద్యలు తమకు అందించడం జరుగుతోంది.
శ్రీక్రోధి నామ సంవత్సరంలో మహావిశేషాలున్నాయి. మహాపర్వదినమైన గజచ్ఛాయయోగంలో పిండప్రదానం చేస్తే, పెద్దలు మహానందభరితులు అవుతారు. ప్రతీ ఏడాదీ ఒక గజచ్ఛాయ వస్తేచాలు మహద్భాగ్యం అనుకుంటారు. ఎదురుచూస్తారు. అయితే ఈసారి రెండు గజచ్ఛాయలు వస్తున్నాయి. మొదటిది సెప్టెంబర్ 30న వస్తే, అక్టోబర్ 2న అమావాస్యనాడు అమాగజచ్ఛాయ వస్తోంది. ఇంతకుమించిన మహత్తరమైనరోజు మరలామరలా రావడం కష్టం. ఈ ఏడాది పితరులకు ఇష్టమైన మఘా నక్షత్రం రెండు రోజులు ఉంటోంది. ముందుగా సెప్టెంబర్ 29న ప్రవేశించి 30వ తారీఖున మనకు గజచ్ఛాయా యోగాన్ని ప్రసాదిస్తోంది. పితరులకు అత్యంత ఇష్టమైన భరణి రెండురోజులు ఉంటోంది. అయితే మధ్యాహ్నం సెప్టెంబర్ 21న ఉంటోంది కనుక అందరూ భరణీ అర్చనను చేసుకోవాలి. ఆ రోజు ఎవరికైనా కుదరకపోతే మరునాడు కూడా చేసుకోవచ్చు. అయితే అది ప్రశస్తమైనది కాదు. కానీ, సూర్యోదయాత్తు 6.17 వరకూ ఉంది కనుక మంచిదే.
సెప్టెంబర్ 18 నుండి మొదలు:
================
ప్రతిపత్తిథి మహాలయపక్షాలు ప్రారంభమయ్యే రోజు.
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పౌర్ణమి 18వ తేదీని ఉదయమే వెళిపోయి, కృష్ణపక్ష పాడ్యమి వచ్చేసింది కనుక, మధ్యాహ్నకాలం ముఖ్యమైంది కనుక, 18 నుంచీ మహాలయాలు మొదలు అవుతాయి.
చేయగలిగినవారు ప్రతిరోజూ తిలతర్పణాది హిరణ్యశ్రాద్ధాదులు చేయాలి. ఇలా చేయలేనివారు తమ తల్లితండ్రులు ఏ తిథినపోయారో ఆతిథులు వచ్చిరోజున కూడా పిండప్రదానాదులు చేసుకోవచ్చు. అయితే శాస్త్రం ప్రతిరోజూ చేయాలనే చెబుతోంది. ఇలా చేయలేము కనుక, ప్రతిరోజూ గోసేవ చేసుకోవాలి. ముఖ్యంగా అకాలమృత్యువులు పొందినవారు, కరోనాది కాలంలో శాస్త్రీయంగా కర్మాదులు లేనివారు తప్పక పితృదేవతారాధన చేసుకోవాలి. ఎవరి ఇంటిలో తాగుబోతులు, తిరుగుబోతులు, విద్యావ్యాపారఉద్యోగాలు లేవో, పిల్లలు నిష్ప్రయోజకలయ్యారో, సంతానం కలుగడంలేదో, వివాహాలు కలుగడంలేదో, అప్పుల బాధతో అవస్థల పాలవుతున్నారో వారంతా ఈ పితృదేవతలను ప్రీతి చేసుకోవడానికి కులమతలింగభేదం లేకుండా పితృదేవతారాధన చేసుకోవాలి.
సేకరణ:🙏🪷🪷🪷
No comments:
Post a Comment