Tuesday, September 3, 2024

మనంచూసే తిరుమల ప్రాచీనత:- కలియుగం కు చెందిన ఆధారాలు:--

 🔔  *తిరుమల వైభవం* 🔔

మనంచూసే తిరుమల ప్రాచీనత:-

కలియుగం కు చెందిన ఆధారాలు:-- 

పరీక్షిత్తు మహారాజు మరణాన్ని ఆపలేకపోయిన కాశ్యప మహాముని పాపనాశనం తీర్థం లో స్నానమాచరించి పరిహారం పొందుట.

అనగా కలియుగ ప్రారంభ సమయానికే తిరుమల ఉన్నట్లు అర్థమౌతుంది.

ద్వాపరయుగం ఆధారాలు :- 

పాప పరిహారార్ధం పాండవులు తిరుమల లోని పాండవ తీర్థం లో స్నానామాచరించుట.

భరద్వాజ మహర్షి & అర్జున సంవాదం లో సువర్ణముఖీ నది ప్రాశస్త్యం గురించి , అగస్త్య ముని గురించి చెప్పుట.

దీని వివరణ స్కందపురాణం వైష్ణవ ఖండం లో కలదు.

దీని వలన ద్వాపరయుగం నాటికే వెంకటాచలం కలదని అర్ధమవుతుంది.

త్రేతాయుగం కు చెందిన ఆధారాలు :- 

రావణుని బారి నుండి రక్షింపమని మునులు, ఋషులు వెంకటాచాలమునకు వెళ్ళుట. శ్రీనివాసుడు అభయమిచ్చుట.

దశరథుడు పుత్రసంతానం కొరకు వెతుకుచు వెంకటాచాలమును చేరగా వశిష్ఠుడు చే పుత్రకామేష్టి యాగం జరుపమని శ్రీనివాసుడు ఆదేశించుట.

అంజనాద్రి పై పుత్ర సంతానం కొరకు తపస్సు చేయుచున్న అంజనాదేవి కి ఆంజనేయుడు ఉద్భవించుట.

పై వివరణ ల వలన త్రేతాయుగం నాటికే వెంకటాచలం కలదని అర్థమవుచున్నది.

కృతయుగానికి చెందిన ఆధారాలు :- 

కృతయుగం ప్రారంభం లో దృఢమతి అనే వ్యక్తి పాపనాశనం లో పునీతుడగుట

భద్రమతి అనే బ్రాహ్మణుని దారిద్య్రం పాపనాశనం లో తొలగింపబడుట.

దీని వలన కృతయుగం నాటికే వెంకటాచలం కలదని అర్థమవుచున్నది.

 (వెంకటాచల) ఆవిర్భావం :-

పూర్వం సృష్టి ప్రారంభం లో శ్వేత వరాహ కల్పం లో వరాహస్వామి  భూమిని సముద్రం నుండి పైకి తెచ్చి సృష్టిని ఆరంభింప చేశాడని
తదనంతరం వెంకటాచలం పైన ఇప్పటి స్వామి వారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడని వరాహ పురాణం చెప్తుంది.

దానికి నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్న పుష్కరిణి కి పశ్చిమాన కల వరాహస్వామి ఆలయం.

ఈ సంఘటన సృష్టి ఆరంభం లో సుమారు 200 కోట్ల సంవత్సరాల కాలం క్రితం జరిగింది. 

దానికి ఋజువే నేటి సహజ సిధ్ధ శిలాతోరణం  (natural rock arch) 
కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణం వయస్సు 200 బిలియన్ సంవత్సరాలు గా తేల్చారు.

 శ్రీనివాసుడు తిరుమల పై కలియుగాంతం వరకు ఉండడానికి వరాహస్వామి అనుమతి ఇచ్చినందున ప్రథమ దర్శన భాగ్యాన్ని శ్రీనివాసుడు వరాహ స్వామి వారికి కల్పించారని వెంకటాచల మహత్యం లో తెలుపబడింది. దానికి నిదర్శనమే నేటి వరాహ స్వామి సన్నిధి లో కల ప్రథమ దర్శన అనుమతిపత్రం. (అయితే అది కుబేరయంత్రం అని , భైరవయంత్రం అనికూడా చెప్తారు. )

ఆ తర్వాత వైవస్వత మన్వంతరం లోని 28 వ మహాయుగం లోని మొదటి కృతయుగం లో శ్రీ మహా విష్ణువు వేంకటేశ్వరుని గా పుష్కరిణికి దక్షిణాన అవతరించాడని

కొన్ని వేల సంవత్సరాలు రహస్యం గా యోగముద్ర లో ఉన్నారని ఆతర్వాత అగస్త్య ముని తపోఫలం గా పుష్కరిణి కి సమీపం లో దక్షిణాన చింతచెట్టు & సంపెంగ చెట్టు.

దీనిని పట్టి  కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీనివాసుడు కృతయుగానికి చెందిన వాడని,తిరుమల గా పిలవబడుచున్న వెంకటాచలం శ్వేత వరాహ కల్పం లో సృష్టి ఆరంభ కాలం లో సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని,
శ్రీనివాసుని కంటే ముందుగా శ్వేత వరాహకల్పం లో ఆదివరాహ స్వామి వెంకటాచలం పై వెలిశాడని 
అర్థమవుతున్నది


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment