రామాయణమ్.. 45
...
దశరధుడు బ్రతిమాలుతున్న కొద్దీ బెట్టు చేయడం ఎక్కువ అయ్యింది కైకకు ! .ఆవిడ ఆయనకు ప్రియసతి ! ఆవిడ మనసుకు కొంచెం కష్టం కలిగినా సహించి భరించలేడు ఆ రాజు ! .
.
మెల్లగా ఆవిడ కేశాలు తన చేతిలోకి తీసుకుని కైకా! నీ కన్నా రాముడికన్నా! ప్రియమైన వారు ఎవరున్నారు నాకు ఈ లోకంలో ! .
.
నా రాముడి మీద ఒట్టు వేసి చెపుతున్నాను నీ కేమి కావాలో చెప్పు ,క్షణంలో తీరుస్తాను !.
.
నామీద నీకు ఎంత అధికారమున్నదో నీకు తెలుసు ,నేను చేసిన పుణ్యము మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను నీ కోరిక చెల్లిస్తాను!.
.
ఇన్ని రకాలుగా హామీలు తీసుకున్నతరువాత కైక తన మనసులో గల కోరిక వెల్లడించడానికి ఉద్యుక్తురాలయ్యింది !.
.
హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువులాగ ఆవిడ నోట మాట బయల్పడింది !.
.
పంచభూతాలు ,సూర్యచంద్రుల ,గంధర్వులు ,దేవతలు అందరూ కూడా నీవు పెట్టిన ఒట్లు విన్నారు ! మహారాజా నీవు నాకు మునుపు ఇచ్చిన రెండు వరములు ఇప్పుడు కోరుకో దలచుకొన్నాను . ...వాటిని సత్యసంధుడవైన నీవు ఇప్పుడు చెల్లించవలెను లేని పక్షమున నా ప్రాణములు విడువ గలదానను అని పలికింది ....అవి..
.
దశరధుడు కామముతో కప్పబడిన మనస్సుకలవాడై ,పాశములో చిక్కిన లేడిలాగ అయిపోయాడు.
.
రాముని అభిషిక్తుని చేయుటకు నీవు సకల సంభారములు సమకూర్చుకున్నావు కదా ! వాటితో రాముని బదులుగా భరతుని అభిషేకించు !
.
రెండవ వరము....రాముడు పదునాల్గు సంవత్సరములు నారచీరలు ,మృగాజినము ,జటలు ధరించి దండకారణ్యములోముని వృత్తి నవలంబించుచూ నివసించవలె.
.
ఏ శత్రుబాధలేని రాజ్యము భరతునకు లభించుగాక!.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
.
No comments:
Post a Comment