🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
ఓం నమః శివాయ సిద్ధం నమః.
గురువు గారికి మరియు తోటి సాధకులకు నమస్కారం.
పాతాళ లోకము.
ఈ లోకము స్వర్గము కన్నా అధికంగాశోభితమై ఉంటుంది.
సప్త రూపములచె విరాజమానముగా ఉన్నది.
సప్తరూపములు అనగా అతల,వితల, సుతల,
తలాతల, మహాతల, రసాతల, పాతాళము.
అనేక రకములైన భోగ సాధనములు చేత పూర్ణ మై ఉన్నది.
సుందరమైన నాగ కన్యలు అనేక రకములుగా గానము చేస్తూ ఉంటారు.
నాగ చైతన్య లో హరి చందనాది సుగంధ లేపనము లచే యుక్తముగా ఉంటారు.
చంద్రుని వంటి ముఖము తో మణి కాంతుల చే విరాజమానముగా ఉంటారు.
స్వర్గలోకంలో కూడా ఆ నాగ కన్యుల తో సమానమగు సౌందర్యము గల స్త్రీలు ఒక్కరైనా ఉండరు. అనేక విధములైన ఐశ్వర్యములు గలవారై అసురులు,నాగులు నివాసము చేయుచున్నారు. అందుకే పాతాళ నివాస కులను భోగి అని పిలుస్తారు.
ఈ లోకంలో వారికి దర్శనము కలగదు. సూర్యుని యొక్క కిరణములు ప్రకాశము పాతాళ లోకము నాకు ప్రసరించదు. స్వయం ప్రకాశమైన తేజోవంతమైన వారి మణుల ప్రకాశముచే వారు సంచరిస్తూ ఉంటారు. ఈ లోకవాసులు సూర్యుడిని చూడలేరు వీరికి "అసూర్యంపశ్య" అని పేరు. రాజశ్రీ లకు ఎప్పుడో ఒకసారి సూర్య దర్శనం అగును.
ఈ లోకము పొందవలెనన్న జీవులు సంపూర్ణ పుణ్యకర్మ సంచయము చేతనే సాధ్యమగును.
నాగులను ధరించిన దేవతలు:
1. వాసుకి నాగము: శ్రీ మహా దేవుని కంఠ భూషణ మైనది వాసుకి నాగము.
2. శేషనాగము: శ్రీ విష్ణు భగవానుని శయ్య రూపమైనది శేషనాగ ము.
3.తక్షక నాగము : సూర్య భగవానుని రధమునందు స్థితమైనది తక్షక నాగము.
4. కర్మోటక నాగము : నలమహారాజుకు మిత్రమైనది కర్మోటక నాగము.
5. విషాదరులాగు నాగులు : పద్మ, మహాపద్మా, సశ లఖ కూలిలా ఎలా పత్రము అను పేర్లు విష నాగులు మహాదేవదేవి మరి తదితరులు దేవతల యొక్క కుండలాది భూషణములు.
స్త్రీలు, పుత్రులు, బంధువులు సహితముగా పాతాళ లోకమున నివసించుచున్నారు.
విప్రచితి, బలి, అసురులు కూడ పాతాళలుకమున నివసించుచున్నారు.
నారదుడు మరి తదితర మునీశ్వరులు పాతాళ లోకము ను దర్శించి ఆ లోకముల యొక్క ప్రభావములను వాతావరణమును జీవన విధానమును ఇంద్రుని సభ యందు వర్ణించి బహిర్గతం చేశారు.
శ్రేష్టమైన జన్మలు:
1. వృక్షము కంటే - కీటకము శ్రేష్టమైనది.
2. కీటకము కంటే - సర్పము శ్రేష్టమైనది.
3. సర్పము కంటే - పశువు శ్రేష్టమైనది.
4. పశువు కంటే - అశ్వము శ్రేష్టమైనది.
5.అశ్వము కంటే - గోవు శ్రేష్టమైనది.
6. గోవు కంటే - మనుష్య ప్రాణము శ్రేష్టమైనది.
మరికొన్ని లోకములు తర్వాత తెలుసుకుందా.
లోకంలో 84లక్షల యోని బేధాలు ఉన్నాయి. అవి నాలుగు రకములుగా ప్రకటితమగు చున్నాయి.
1. అండజము:
అండము అనగా గ్రుడ్డు నుండి పుట్టే ప్రాణులు. ఇటువంటివి 24 లక్షలు గలవు. ఉదాహరణకు పక్షిజాతులు మొదలగునవి.
2. ఉద్బీజములు :
నేల పై నీటి వనరులతో మొలకెత్తినవి. 24 లక్షలు ఉన్నాయి ఉదాహరణకు వృక్ష జాతులు.
3. జరాయుజములు :
గర్భకోశము నందలి మావి అనగా గర్భసంచి నుండి జన్మించేవి,మనుష్యజాతి జంతు జాతి మొదలగునవి.
4. స్వేదజములు :
ఏకకణజీవులు సూక్ష్మ క్రిమ. కీటకాలు.
లక్షల కొలది గల జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది, శ్రేష్టమైనది, దుర్లభమైనది, ఉత్కృష్టమైనది.
కొందరిలో గత జన్మ కూడా మనుష్య జన్మ అయి ఉండవచ్చు. కారణం వారు చేసుకున్న పుణ్య విశేషములె. జన్మ పుణ్య కర్మల ఫలితంగా మరుజన్మ లభిస్తుంది. మానవజన్మ లభించింది అంటే దానికి కారణం పుణ్యఫలమే. ఈ రహస్యములను తెలుసుకొననివాడు మూర్ఖుడు.
మరుజన్మలో ఉత్తమ జన్మ లభించుటకు, ఈ జన్మ యందు పుణ్యంసముపార్జన చేసుకొనవలెను. పాపకర్మలు ఆ శుభకర్మలు, దృష్ట కర్మలు చేసినచో మరుజన్మలో నరకలోక ప్రాప్తి కలుగుతుంది.
శ్రేష్టమైనది మానవజన్మ :
సమస్త జీవ జంతు జలాల కంటే మానవ జన్మ గొప్పది అనడానికి కారణాలు :
విశాలమైన బుద్ధి వికాసము.
మెదడు స్వతంత్రంగా పని చేయునట్లు కల్పించబడినది.
ఇతర పశు పక్షాదుల కంటే ఎక్కువ ఆలోచన శక్తి.
జీవజాలానికి అసంకల్పితంగా, పరిమితంగా పనిచేసే మెదడు ఇవ్వబడినది.
చూడడానికి కళ్ళు,వినడానికి చెవులు, రుచికి నాలుక,వాసనలు గ్రహించడానికి ముక్కు,చర్మాన్ని సమకూర్చబడినది.
జ్ఞాన సహిత శరీరం వలన విషయవాంఛసుఖాలు అధికంగా అనుభవించే నేర్పు మానవులకు ప్రసాదించ బడినది.
ఆహారం,నిద్ర భయం, మైధునాలు అవి అందరికీ సమానమైన జ్ఞాన విషయంలో మానవ జన్మకు అధికంగా ఇవ్వబడినవి.
ఏ దృక్పధము నుండి చూసినా మనుష్య జన్మ శ్రేష్టమైనది.
మానవులలో అన్ని జాతులకు జ్ఞానం మాత్రం సమానంగా ఉండదు. వారి బుద్ధి వికాసం భిన్నముగా ఉంటుంది. మానవులు చాలా ఎక్కువగా జ్ఞానవంతులు.
నమస్కారములతో.
స్వాత్మా రామ
No comments:
Post a Comment