Wednesday, September 18, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
ఓం నమః శివాయ సిద్ధం నమః.
 గురువు గారికి వారికి మరియు తోటి సాధకులకు నమస్కారము.

 మౌనం మూడు రకములు.
 1. కాయక మౌనం:
  దేహము స్థిరం అవుతుంది. శరీరంలో ఏ భాగము కూడా అనవసరంగా కదలకుండా ఉండేటట్లు అలవాటు చేసుకుంటే కాయక మౌనం సిద్ధిస్తుంది అంటారు.
2. వాజమనం :
 నోరు అనవసరముగా మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఇది గొప్ప వారి లక్షణం. మౌనం తపస్సు లోనే చేయాలి. వాక్కు ని సంపూర్ణంగా నిరోధించాలి.
 3. మానసిక మౌనం:
  కాయక మౌనం, వాజ్ మనం ఈ రెండు సాధ్యం అయితే మానసిక మౌనంతేలికగా సాధ్యం అవుతుంది.ఎందుకనగా మానవుడు
  ప్రత్యా హారాన్ని జయించి అన్నిటికీ సాక్షి భూతుడు గా ఎప్పుడూ ఉంటాడో అప్పుడు చిత్తము మౌనం కలుగుతుంది. ఇదే మానసిక మౌనం.


 దేహధారి జీవులు:

 బ్రహ్మలోకం నుండి పాతాళలోకము వరకు అనేకమంది శరీరములను ధరించి ఉన్నారు.

1. బ్రహ్మలోకము : బ్రహ్మ లోకమునందు తన భార్య తోటి స్థితుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు.

2. స్వర్గలోకము: దేవ రాజేంద్రుడు అష్ట దిక్పాలకులు స్వర్గము నందు సుఖముగా జీవిస్తున్నారు.

 3. పాతాళ లోకము: వాసుకి, తక్షక నాగులు పాతాళ లోకము నందు స్థితులై ఉన్నారు.

4. భూలోకము: మనుషులు, పక్షులు క్రీములు జీవులు జంతువులు భూలోకమునందు స్థితులై ఉన్నారు.

 ఈ లోకములో జీవులు స్త్రీ, పుత్ర,విషయ పదార్థముల యందు ఆసక్తి కలిగి ఉంటారు.
 వాటిని అనుభవిస్తూ పరమ సుఖ దుఃఖములను పొందుతూ ఉంటారు. జీవులు అన్నీ బ్రహ్మ వరకు సర్వ జీవుల యందూ సుఖ దుఃఖములను ప్రతీతి మగుచున్నవి.
 ప్రతి జీవులు జనన మరణ సుఖదుఃఖములు సాధనములు పాంచ భౌతిక శరీరము లో మొదలగు సమస్త లక్షణములు సమానముగా ఉంటాయి. దేహ దారులకు శరీర సంబంధించేదుఃఖ ప్రాప్తి కూడా సమానంగా ఉంటుంది. సకల లోకములు కల్పితమైన వి. ఈ లోకములో శరీరములు,పదార్థంలు, ఆత్మ కన్నా భిన్నంగాఉంటాయి.

 నరక, మనుష్య,దేవత లోకములు.

 నూతన శరీరమునకు సమానమైన సజాతి సంబంధమైనదా లేదా భిన్న జాతిఅయినదా అన్న దానికి నియమాలు లేవు.

1. నరక శరీరము:
   దుష్కర్మలు, పాపకర్మల వలన నరకము వచ్చును. పాపకర్మల యొక్క దుఃఖములను అనుభవించవలసి ఉంటుంది. అట్టివాడు
    నరకవాసి.
  2. మనుష్య శరీరము:

  పూర్వజన్మ దుష్కర్మలు, పాప రూపమగు మిశ్రిత కర్మ ఉదయించిన ఎడల నరకము అందలి స్థూల శరీరమును వదిలి భూలోకములోని మనుష్య శరీరమును ధరించవలసి ఉంటుంది.
  
3. దేవతా శరీరము :

 నరకములో నివసించు జీవునకు పూర్వ పుణ్య కర్మ ఎప్పుడు ఉదయించునో అప్పుడు ఆ నరకము అందలి స్థూల శరీరమును వదిలి స్వర్గమున దేవత శరీరమును పొందును.

4. తిరిగి మనుష్య శరీరము:

 స్వర్గము నందు నివసించు కర్మ దేవతలకు ఎప్పుడు పూర్వ పుణ్య పాపముల మిశ్రిత ము ఉదయించును అప్పుడు వారు సర్గము నందలి దేవత శరీరమును పరిత్యజించి భూలోకమున మనుష్య శరీరమును పొందుదురు.

5. మరలానరక శరీరము:

 దేవత, మనుష్య శరీర పరిత్యాగ కాలమున ఎప్పుడైతే పూర్వ పాప కర్మ ఉదయించునో అప్పుడు దేవత, మనుష్య శరీరమును వదిలి నరక శరీరమును పొందవలసి ఉంటుంది.
 స్థూల శరీరమును పరిత్యాగము చేసినప్పుడు పుణ్య కర్మము లేదా పాప కర్మము నిల్వ ఏది కలదో దాని ప్రకారము మరొక జాతి శరీరము ప్రాప్తించును.
 జీవనకు గత జన్మ యందలి పూర్వ శరీర లక్షణం గల సమాన జాతి గల శరీరమే ప్రాప్తించును సృష్టి విధానము లేదు.
 నమస్కారములతో.

     ✍️శశి.

No comments:

Post a Comment