*ప్రకృతిలోని శక్తి!*
తిథి ప్రకారం సముద్రపు అలలో మార్పు గమనించవచ్చు! ప్రకృతిలో తిథి ప్రకారం మార్పు జరుగుతుంది అనడానికి ఇది నిదర్శనం! ఈ మార్పు ప్రతి ప్రాణిపైన ప్రభావం చూపుతుంది. దీని ఆధారంగా కొన్ని ఆహార నియమాలు, ఉపాసకులు కొన్ని పూజా విధానాలు వల్ల ప్రకృతిలోని శక్తిని పొందుతూ ఉంటారు. ‘రోజుకో దేవుడా తిధికో దేవుడా? హిందూ మతంలో ఇంత మంది దేవుళ్ళా?’అనే మూర్ఖులకి ఈ విషయం అర్ధం కాదు.. అన్ని రూపాలు అమ్మవారి స్వరూపాలే ఆమె ఒక్కో తిథి రోజు ఒక్కో రూపంలో దర్శనం ఇస్తుంది.. ఎలా అయితే ప్రకృతిలో మార్పులు జరుగుతుందో దానికి తగిన విధంగా ఉపాసన ఉంటుంది. ఆ ఉపాసన యొక్క అధి దేవత రూపాన్ని కొలిచే విధానంలో ఆ యొక్క విశ్వప్రాణశక్తితో జీవాత్మ ఉపాసనతో మమేకం అవుతూ కుండలినీ జాగృతి చేసి ఆ శక్తిని తనలో నింపుకోగలుగుతారు. దానికి తగిన ఉచ్ఛారణ బీజం యంత్రం ఉపాసనా విధానం వల్ల కాస్మిక్ పవర్ కి అనుసంధానం గా మానవ దేహం మారిపోతుంది. ఆ స్థితిలో ప్రకృతి, జీవుడు ఒక్కటై పోతారు. ప్రకృతి ఉపాసకుల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. మరణం వారు కోరిన సమయంలోనే వస్తుంది. వారినే మృత్యుంజయులు అంటారు. అంటే మృత్యువుని తన ఆధీనంలో ఉంచుకున్న వారు అని అర్థం. ధ్యానంలో సమాధి స్థితిలో గరళంలో అమృతాన్ని ఆహారంగా పొందే స్థితికి చేరుకుంటారు. నవరంద్రాలు బంధించి చర్మ చక్షువులతో గాలిని పీలుస్తూ నిరాహారులై తపో శక్తితో కొన్ని సంవత్సరాలు ధ్యానంలోనే జీవించగలరు. ఇటువంటి వారు ఉన్నారా అంటే మహావతార్ బాబా ఉన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు.. అంతటి శక్తిని ప్రకృతి అందిస్తుంది. ఈ ప్రకృతి లోని కాస్మిక్ పవర్ సృష్టి క్రమం ఆగకుండా చేస్తుంది. అంతటి శక్తిని ప్రకృతి ఇస్తుంది. ఆ శక్తిని positive గా పొందితే మనిషి ఋషి అవుతాడు. మహానుభావుడు అవుతాడు. అద్భుతాలు సృష్టించే మహనీయుడు అవుతాడు. అతనే దైవం అవుతాడు. మనిషిని దైవం గా మార్చే ప్రకృతికి హాని కలిగించి నెగటివ్ పవర్ ని పెంచి కరోనా పోసిటివి తెచ్చుకుని బతుకు జీవుడా అనుకుంటూ అలమటిస్తున్నారు.
అన్ని రోజులూ దేవుడు సృష్టించిందే కదా అందులో మంచి-చెడు అనేది ఉంటుందా? తల్లి లాంటి ప్రకృతి పగ బడుతుందా? అని అడుగుతుంటారు.. వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుంది. ఆ చీకటిలో కంటికి కనిపించని ఎన్నో శక్తులు దాగి ఉంటాయి. చెడును ఆహ్వానించి, కాలుష్యం అభివృద్ధి చేసి, ఇలా అవుతుందా? అంటే అది అమాయకత్వం.
అగ్ని తో దీపం పెట్టవచ్చు, హోమం చేయవచ్చు, కుంపటి పెట్టవచ్చు, కొంప తగలబెట్టుకోవచ్చు. అది వాడుకోవడం, దాని పరిణామాలు, చేసుకున్న వారి ప్రారబ్ధం. అగ్ని ఇలా చేస్తుందా? దీపం మటుకే పెట్టుకోవచ్చు అనుకున్నానే, అంటే కొంప కాల్చుకోండి అని కూడా ఏ దేవతా చెప్పలేదు కదా. ప్రకృతివి నీవే వికృతి నీవే అని శక్తిని పూజిస్తున్నాము. కానీ అర్థం చేసుకుని ప్రవర్తించుటలేదు జాగర్త పడలేదు. దానికి శిక్ష అందరూ అనుభవించాలా అంటే... అవును ఒక వ్యక్తి తప్పు చేస్తే దాని ప్రభావం ఆ కుటుంబ మొత్తం పైన ఉంటుంది.. శరీరంలో ఒక భాగం జబ్బు చేస్తే దాని బాధ శరీరం అంతా అనుభవించాల్సి వస్తుంది.
మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే మన వంతుగా మనమం జాగర్తగా ఉండాలి. ఆహారపుఅలవాట్లు మార్చుకోవాలి! మనకు, మనవల్ల ఇంకొకరికి ఇబ్బంది లేకుండా ఉండాలి.. ఈ రోజు ఉన్న వారు రేపు ఉండటం లేదు. అందరితో స్నేహంగా ఉండాలి. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. ఎవరిపైనా కోపం, పగ లేకుండా క్షమించాలి! సమాజం అంతా మృత్యువుతో పోరాడుతోంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. మీకు సహాయం చేసిన వారిని, మీతో కష్ట సుఖాలు పంచుకున్న వారిని, గుర్తించండి, ప్రశంసించండి! ఎటువంటి పరిస్థితిలోనైనా దైర్యంగా ఉండండి. ఒక సినిమా చూస్తూ ఎవరికి వారు హీరో పాత్రలోనే ఉహించుకుంటారు కానీ కమెడియన్ గా విలన్ గా ఊహించుకోరు. ఇప్పుడు నిజంగా సమాజంలో మీరు హీరోలుగా నిలిచిపోయే సమయం వచ్చింది. కరోనాతో-మృత్యువుతో పోరాడి గెలవాలి! దానికి ఎవరికి వారు బాధ్యతగా ఉండాలి.
అలాగే అమ్మవారిని మహిషాసురమర్ధిని స్ట్రోత్రాన్ని ప్రతి రోజూ పారాయణ చేయండి! ప్రకృతి స్వరూపమైన ఆ తల్లిని శాంతించి కాపాడమని వేడుకుందాము.. ప్రకృతి ఒడిలో ప్రతి ప్రాణి క్షేమంగా ఉండాలనే తల్లి కోరుకుంటుంది. అమృతాన్ని విషవాయువుగా మార్చుకుని ఊపిరి అందని స్థితిలోకి వచ్చింది మనమే! దానికి తగిన జాగర్తలు ఇప్పుడైనా పాటించాలి.
No comments:
Post a Comment