Wednesday, September 4, 2024

""దైవీ సంపద""*

 *       *""దైవీ సంపద""*
               ➖➖➖

*ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో, వారు మరుజన్మలో దైవీసంపదలతో పుడతారు. వారికి క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాలు ఉంటాయి.*

1. భయం లేకపోవడం.
2. సత్వగుణం కలిగి ఉండటం,  
   మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.
3. జ్ఞానమును సంపాదించడం.
4. విద్యాదానము, జ్ఞానదానము    
   భూదానము అన్నదానము  
   మొదలగు దానములు శక్తికొద్దీ 
   చేయడం.
5. ఇంద్రియనిగ్రహం.
6. జ్ఞాన యజ్ఞము చేయడం.
7. పురాణములు శాస్త్రములు 
   చదవడం.
8. ప్రతిపనీ ఒక తపస్సులాగా 
   చేయడం.
9. మంచి ప్రవర్తన.
10. అహింస వ్రతమునుపాటించడం.
11. సత్యము పలకడం.
12. కోపము విడిచిపెట్టడం.
13. దుర్గుణములను త్యాగము 
   చేయడం
14. ప్రశాంతంగా ఉండటం.
15. ఇతరులను విమర్శించకుండా 
   ఉండటం.
16. భూతదయ కలిగిఉండటం.
17. ఇంద్రియలోలత్వం స్త్రీలోలత్వము 
   లేకుండా ఉండటం.
18. మృదువుగా మాట్లాడటం.
19. చెడ్డ పనులు చేసినపుడు 
   సిగ్గుపడటం.
20. చిత్తచాంచల్యము వదిలిపెట్టడం.
21. ముఖంలో,మనస్సులో తేజస్సు 
   కలిగి ఉండటం.
22. ఓర్పుకలిగి ఉండటం.
23. అన్నివేళలలో ధైర్యంగా ఉండటం.
24. శరీరము మనస్సు శుచిగా 
   ఉంచుకోవడం.
25. ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.
26. స్వాభిమానము వదిలిపెట్టడం.

ఈ గుణములను దైవీ సంపదగా పరిగణించారు.

       *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
             🌷🙏🌷

 *🙏లోకా సమస్తా సుఖినోభవన్తు !🙏*

No comments:

Post a Comment