Tuesday, September 24, 2024

 🌹గుడ్ మార్నింగ్ 🌹మనిషి జీవితం మనుషుల మధ్య, మనుషులపై ఆధారపడి, మనుషుల సహాయసహకారాలతో, కుటుంబ సభ్యులుగా సొంతవారిగా వుండే మనుషుల ప్రేమలతో మాత్రమే సాగుతుంది. అంటే మొత్తముగా మానవ జీవితం ఏదో ఒక రకముగా సాటి మనుషులపై ఆధారపడి సాగుతుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇదే విధముగా జీవితం ఉంటుంది.........
ఈ సంభంధబాంధవ్యాలు అన్నీ అందరి దగ్గర సరిగా ఉంటేనే మనుషుల మధ్య సఖ్యత కుదిరి,ఒకరికి ఒకరు సహకరించుకుంటూ - ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ హాయిగా జీవిస్తారు. అయితే ఈ విధమైన సఖ్యత మనుషుల మధ్య వుండాలంటే మనిషిలో అంగీకార స్వభావము ఉండాలి. మనిషిని, ఆ మనిషి అభిప్రాయాలను, ఆ మనిషి ద్వారా ఏర్పడే పరిస్థితులను, ఆ మనిషికి సంబంధించిన విషయాలను, అంగీకరించే స్వభావము ఉండాలి. అంగీకారము లేనిచోట విభేదాలు, విరోధాలు, విద్వేషాలు, వాటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందరూ నా లాంటివారే అన్న నిజము గ్రహించిన వారే ఎదుటివారిని అంగీకరించగలరు. స్వార్ధపరులు అంగీకరించలేరు. అలాగే మొత్తం మానవ సమూహము ఎక్కడ ఎవరితో కలసినా - అది కేవలము ఇచ్చి పుచ్చుకోవడము అనే అవసరతలపై ఆధారపడి ఉంది. ఈ ఆధారత సృష్టి చేసిన ఏర్పాటు. ఈ ఏర్పాటును సరిగా అర్ధం చేసుకొని - ఏదైనా సరే - ధనము, ప్రేమ, అభిమానము, సహాయము, పని లేక ప్రతి ఫలము ఇలా ఏవైనా - మనము పుచ్చుకున్న వాటికి లేదా మన జీవితము కొరకు ఎదుటి వారిని వాడుకున్న దానికి - ఎదుటివారికి అవసరమైనది వాడుకున్నంత ఇచ్చామా లేదా అన్నది గమనించుకుంటూ -- పచ్చుకున్నంత ఇస్తే ఆ సంభంధం బాగానే ఉంటుంది......................... పుచ్చుకున్నదానికంటే తక్కువ ఇస్తుంటే ఆ సంభంధం దెబ్బతింటుంది............... పుచ్చుకున్న దానికంటే ఎక్కువ ఇస్తే అది నిస్వార్థమై మంచిగా మారి సంబంధాలను దృఢముగా ఉంచుతుంది.............. ఇది పరిశీలించుకుంటే ఎందుకు సంభంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయో - ఆశాంతికి, అనేక అనర్ధాలకు కారణం అర్ధమవుతుంది............... ఇవి పరిశీలించుకొని కారణాలు ఎదుటివారి మీద నెట్టకండి................. ఆధ్యాత్మికతలో ఏది చెప్పబడినా అది కేవలం మన అంతరంగానికి మాత్రమే. ఇచ్చి పుచ్చుకునే లెక్కలు ఎదుటివారివి మనము చెప్పలేము.పుచ్చుకున్న వారికి ఎవరి హృదయం వారికి చెబుతుంది. ఇలా అర్ధం కాని మందమతులకు, ఎదుటివారి గూర్చి నిరంతరం ఆలోచిస్తూ తాము చాలా మంచివారము అనుకునే అభాగ్యులకు ఆధ్యాత్మికత చెప్పిన సాధన give and forgive.............. ఇవ్వు - వారు నీకు సరిపోను తిరిగి ఇవ్వలేదు అనుకుంటే - వారిని క్షమించు అంటే ఆ విషయము మర్చిపోవటము నేర్చుకో అని చెప్పారు.ఎందుకంటే ఆ లెక్కలు నిర్ధారించి తేల్చలేము.కారణం ఎవరి లెక్కలు వారే ఊహించుకుంటూ వుంటారు కనుక........................ ఇలా నిరంతరం మనను మనం గమనించుకుంటూ ఉంటే సర్వ సమస్యలు, వాటికి కారణాలు - వాటికి పరిష్కారాలు అన్నీ మనకు తెలుస్తాయి.......... ఇదే ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన,స్వీయ అంతరంగ చదువు....🌹god bless you🌹

No comments:

Post a Comment