Monday, September 23, 2024

🌹గుడ్ మార్నింగ్ 🌹అంతరంగాన్ని చెత్తతో నింపకూడదు. కోపతాపాలు,అత్యాశలు, ఈర్ష్యఅసూయలు, నిరంతరం చెడు లేక భయ ఆలోచనలు -  ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి వ్యతిరేకముగా లేదా చెడుగా ఆలోచించటం - సొంత కుటుంబ సభ్యులతో సహా, ఎవరి గూర్చి అయినా అసలు లోపల చెడు ఉంచుకోవద్దు.

నిజముగానే బయటి మనుషులు లేక పరిస్థితులు మనను ఇబ్బంది పెట్టవచ్చు. అయినా మన లోపల ఎప్పుడు ప్రశాంతత, సంతోషము లేక తృప్తి ఉండేలా ప్రయత్నించండి........................

ఇదేమిటి పక్కవారు బాధపెడుతుంటే, పరిస్థితులు ఇబ్బంది పెడుతుంటే, ఎలా?  లోపల - బాధ, వ్యతిరేకత లేకుండా ఎలా ఉండగలము అనిపించవచ్చు.

రోజు మన ఇల్లు శుభ్రపరచుకుంటున్నా మరల దుమ్ము, దూళితో , అనేక రకాలుగా అది అశుభ్రతకు గురి అవుతూనే ఉంటుంది. అలాగే మన శరీరము మొత్తము లోపల, బయట రోజు అశుభ్రతకు గురి అవుతూనే ఉంటుంది. రోజు శుభ్రపరచుకుంటూనే ఉంటాము..................

బట్టలు, వంటగిన్నెలు, వాహనాలు ఇలా ఉపయోగించుకునే అన్నీ శుభ్రపరచుకోక తప్పదు................

ఈ విషయము అందరికి తెలుసు......

 శుభ్రపరచుకుంటూ జీవిస్తున్నారు కూడా....

ఇలాగే మనము జీవిస్తున్నప్పుడు కూడా సొంత కుటుంబ సభ్యులతో సహా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తారు. అందులో మంచి ఉంటుంది - చెడు ఉంటుంది.

మంచి బ్రతకటానికి సహాయపడుతున్నది.

చెడు బాధను, ఇబ్బందిని కలిగిస్తున్నది. అయితే ఇది ఇలాగే వుంటుంది అని గుర్తించాలి. మనకు భిన్నమైన స్వతంత్ర ఇచ్ఛ కలిగిన అనేకమంది మనుషుల మధ్యనే జీవితం సాగుతుంది. వారి అనేక రకాల ప్రవర్తనలు మనకు ఆ సమయములో- ఆ విషయములో ఇబ్బంది కలిగించవచ్చు. అది ఎదుటి వారికి సంబంధించినది. దాని వలన మన అంతరంగాన్ని ఆ జ్ఞాపకాలతో, ఆ వ్యతిరేకతలతో పాడు చేసుకోవటం ఎంత అవివేకమో ఆలోచించండి.ఈ అవివేకముతో తిరిగి మరల మనము చెడు చేస్తూ - నిరంతరం ఇలా చెడును పెంచుకుంటూ - ఆ చెడుతో అంతరంగములో అశుభ్రతను పెంచుకుంటూ పొతే నష్టపోతున్నది ఎవరు? - మనమే........................

అవే మనకు కలిగే అనేక వ్యతిరేక, భయ, వత్తిడుల భావాలు... లోపల అశుభ్రతకు ఇవి గుర్తులు....

వాడకములో వస్తువులు, వాహనాలు, వస్త్రాలు, ఇళ్ళు, ఇలా అన్నిటికి నిత్య శుభ్రత ఎలా అవసరమో.....

ఇలాగే జీవించటములో అంతరంగ శుభ్రత అవసరము......................

మనుషులు ఇలాగే వుంటారు. పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఎప్పుడు అన్నీ, అందరూ మనకు అనుకూలముగా ఉండటం - ఈ సృష్టిలో ఎవరికి సంపూర్ణముగా కుదరదు.

కుదరని, వీలుకాని, వీలులేని విషయాన్ని పట్టుకొని, అంతరంగాన్ని పాడుచేసుకొనే బదులు........................

ఈ సత్యాన్ని అర్ధం చేసుకొని, అంగీకరించి, ఆ జ్ఞానముతో ఎప్పటికప్పుడు చెడు లేక వ్యతిరేక విషయాలను వదలివేయటము ద్వారా అంతరంగాన్ని నిత్య పరిశుభ్రతతో ఉంచుకోవచ్చు.

ఇది మనకే మేలు. లోపల చెత్త, చెడు లేనప్పుడు శాంతిగా, హాయిగా ఉంటుంది.

ఇదే నిజమైన నిత్య ఆధ్యాత్మిక సాధన. అంతరంగ శుభ్రత కొరకే ఆధ్యాత్మికము - దేముడు..........

కోరికలు తీర్చుకోటానికి కాదు. తప్పులు చేసి రక్షించమని వేడుకోటానికి కాదు. ఒకవేళ అవును అని నమ్ముతుంటే, మన ఆధ్యాత్మికము,భక్తి అదే అయితే........... అంతరంగములో ఇంకా మురికిని పెంచుకుంటున్నట్లే........

ఆలోచించి చూడండి. ఆధ్యాత్మికము అంటే వ్యక్తి లోపలి విషయము. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే లోపలి శుభ్రత గూర్చిన జ్ఞానము మాత్రమే.🌹god bless you. 🌹

Source link - http://youtube.com/post/UgkxWz2Oa8pUMdNR_hsii9aTiBuPWTvpaC9q?si=5cxXkNO5IJTg49x5

No comments:

Post a Comment