Sunday, September 1, 2024

****బ్రతకడం వేరు, జీవించడం వేరు.

 *🌹    బ్రతకడం వేరు, జీవించడం వేరు.    🌹*

             *బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది.*

               *మన మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది... అడ్డదారిలో సాధించేది అవమానాలతో అంతమవుతుంది...*

              *నీతి తప్పిన వ్యవహారం ఏది ఆత్మగౌరవాన్ని ఇవ్వదు...*

                 *బంగారాన్ని ఎన్ని ముక్కలు చేసినా దాని విలువ తగ్గదు. అలాగే మంచితనంతో సంపాదించుకున్న గౌరవం కూడా ఎప్పటికి తరిగిపోదు.*

              *ఇల్లు చిన్నదైనా, మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా, కొండంత ప్రేమ ఉండాలి.*

             *డబ్భులో పేద వాడివి అయినా, గుణములో శ్రీమంతులుగా ఉండాలి.*

             *వదలి పోయే అందం శాశ్వతం కాదు. వాంఛతో రగిలే బంధం శాశ్వతం కాదు, నిజం చెప్పాలంటే అది జీవితం కానే కాదు.*

             *కాలం ఎన్ని గాయాలు  చేసినా... గాడితప్పకు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు వస్తూవుంటాయి.*

           *అలాగే నీవెంతా నీతిగా బ్రతికిన కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతూవుంటాయి.*

               *ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడబడడం కాదు, నిలబడడం నేర్చుకోవాలి.*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

No comments:

Post a Comment