Tuesday, September 3, 2024

మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే* *సూత్రాలు సంక్షిప్తంగా*

 *ఆరోగ్యం ఆనందం సంపద*

🩺🏃‍♀️🧎‍♀️💰💎⚓🛵🚘🏘️✈️
*మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే*
*సూత్రాలు సంక్షిప్తంగా*

1.మీకు ఉపశమనం దేనివల్ల కలుగుతుందో తెలుసుకోండి. సుప్తచేతనకి అందించిన సరైన నిర్దేశాలు మీ మనసుకీ, శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని.
నమ్మండి
. 2. సుప్తచేతనకి మీ ఆసక్తినీ, కోరికలనీ ఒక పద్దతి ప్రకారం తెలియజేసే ' కార్యక్రమాన్ని చేపట్టండి.

3. మీరు కోరుకున్న ఫలితాలని ఊహించి, వాటి వాస్తవాన్ని అనుభూతి చెందండి.
దీన్ని విడవకుండా చెయ్యండి; మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది.

4. నమ్మకం అంటే ఏమిటో నిర్ణయించుకోండి. అది మీ మనసులోని ఒకఆలోచనేననీ, మీరు అనుకునేదే మీరు సృష్టిస్తారనీ తెలుసుకోండి.

5. రోగం, నష్టం, హాని కలిగించే వస్తువులని నమ్మటం మూర్ఖత్వం. సంపూర్ణమైన ఆరోగ్యం, సమృద్ధి, శాంతి, సంపద, దేవుడి మార్గదర్శకత్వం మీద నమ్మకం ఉంచండి.

6. మీరు అలవాటు ప్రకారం ఏ గొప్ప, ఉదాత్తమైన ఆలోచనలు చేస్తారో, అవే గొప్ప పనులుగా రూపు దాలుస్తాయి.

7. మీ జీవితంలో ప్రార్థన ద్వారా ఉపశమనశక్తిని అమలు చెయ్యండి. కచ్చితమైన ప్రణాళిక, ఆలోచన, లేదా మానసిక చిత్రాన్ని ఎంచుకోండి. దానితో మానసికమైన, భావనాత్మకమైన సామరస్యాన్ని ఏర్పరచుకోండి. మీ మానసిక ధోరణి పట్ల మీకు నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే, మీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది.

8. నిజంగా మీకు ఉపశమన శక్తిని పొందాలని ఉంటే, దాన్ని మీరు నమ్మకంద్వారా పొందవచ్చని ఎప్పుడూ గుర్తుంచుకోండి. దాని అర్థం మీ చేతనసుప్తచేతన పనిచేస్తున్నాయని మీకు తెలుస్తుందన్నమాట. అర్ధం చేసుకోవటం, నుంచే నమ్మకం పుడుతుంది.

9. గుడ్డినమ్మకం అంటే శాస్త్రీయపద్ధతిలో ఏమీ అర్థం చేసుకోకుండానే ఒక వ్యక్తి. చికిత్స ద్వారా ఫలితాలని పొందటం. వాళ్లకి ఆ చికిత్స వెనుక ఉన్న శాస్త్రీయమైన శక్తుల గురించీ, ప్రభావాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు.

10. రోగంతో బాధపడుతున్న మీ ఆత్మీయులకోసం ప్రార్థించటం నేర్చుకోండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఆరోగ్యం గురించీ, జీవశక్తి గురించీ, పరిపూర్ణత గురించీ మీ మనసు చేసే ఆలోచనలు, విశ్వజనీనమైన ఆత్మాశ్రయ మనసుతో కలిసి మీ ఆత్మీయుల మనసులో భావాల రూపంలో బైటపడతాయి.

*డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి*

💎⚓💎⚓💎⚓💎⚓💎⚓💎

No comments:

Post a Comment