Tuesday, September 17, 2024

 మీ పాప, నాకు నొప్పి ఉంది అని మీకు చెబితే, మా పాపకు నొప్పి ఉందనే ఆలోచన మీ లోపల జ్ఞాపకంగా ఉండిపోతే, ఆ నొప్పి మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానిని మీరు పరిమితమైన శక్తిగానే భావించి దానిని బంధించి ఉంచారు కనుక. అందువలన మా పాపకున్న నొప్పి విశ్వమంతా వ్యాపించాలి అని అనుకోండి. అలాగే వాడు చెడ్డవాడు వీడు మంచివాడు అనే జ్ఞాపకాలు మీలో ఉంటే, ఆ గుణాలు మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక నా లోపల ఉన్న జ్ఞాపకాలు, నాకు సంబంధించి ఇతరుల లోపల ఉన్న జ్ఞాపకాలు, అలాగే ఈ సృష్టిలో ఉన్న మీకు సంబంధం లేని జ్ఞాపకాలన్నీ కూడా అనంతంలో కలిసిపోవాలి అని భావించండి. ఎందుకంటే సూక్ష్మస్థాయిలో ఈ సృష్టిలో ఉన్నవన్నీ, ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి (Interdependent) కాబట్టి. ఇలా మీరు చేసినప్పుడే, మీతో సహా అందరినీ, అలాగే విశ్వంలో ఉన్న అన్నింటినీ దివ్యంగా అనుభూతి చెందగలుగుతారు. 

No comments:

Post a Comment