🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకం 60
స్వభావాద్యస్య నైవార్తిః లోకవద్వ్యవహారిణః | మహాహ్రద ఇవాక్షోభ్యో గతక్లేశస్సు శోభతే ||
స్వభానుగుణంగా జీవిత కార్యకలాపాలలో పాల్గొంటున్నా సామాన్యుని వలె విచారానికి బాధకు లోనుకాదు. విశాల సరోవరం వలె నిశ్చల శాంత గంభీరుడై ప్రకాశిస్తాడు----జ్ఞాని.
మన మనస్సరోవరాలు భావనాతరంగాలతో కల్లోలితమయి ఉంటాయి. ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలు చెప్పవచ్చును. బాహ్యప్రపంచ విషయాలు ఇంద్రియాలద్వారా మనస్సుచేరి కోరికలతో ఉద్రేకపరుస్తాయి.బాహ్యంగా విషయాలు ఎదురుగా లేనప్పటికి మన స్సే తన గతజ్ఞాపకాలతో భవిష్యత్తులో అనుభవించా లనే కోరికతో కల్లోలాన్ని సృష్టించగలదు. మనోబుద్ధుల నధిగమించి, అహంకార వర్ణుతుడయి, ఆత్మానుభవస్థితుడయిన జ్ఞాని మనస్సును బాహ్యవిషయాలు చేరినా వ్యామోహపరచలేవు. కోరికలులేని అతని మనస్సు స్వయంగా కల్లోలాన్ని సృష్టించనూ లేదు. అతని మానససరస్సు సదా శాంతంగా నిశ్చలంగా ఉంటుంది.
అట్టి మహాత్ముడు సర్వదా సర్వత్ర ఆత్మనే వీక్షిస్తూ ఆత్మారాముడై ఉంటాడు. అతని శాంత మనస్సు, గుర్తించగల సర్వభావాలను చైతన్యమయిన తన వ్యక్తరూపాలుగా తెలుసుకుంటూ అనుభవిస్తూ ఉంటుంది. ఈ సార్వత్రిక నిత్యానుభవంతో జీవిస్తూ సర్వకర్మలనూ తన వ్యక్తరూపంగా గుర్తిస్తూ శాంతంగా నిర్వర్తించగలుగుతాడు. దేనినీ కోరడు, దేనినీ అనుభవించడు, మానస సరోవర మును కల్లోలితం చేసే అహంకారం అసలే ఉండదు. ఆత్మచైతన్యం అంత ంగంలో నిండి బాహ్యంగా ఉపాధులద్వారా వ్యక్తమవుతూ నిశ్చల శాంత భీరంగా ప్రకాశిస్తూ ఉంటుంది.🙏🙏🙏
No comments:
Post a Comment