Thursday, November 20, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

                    భక్తురాలు : 
  భగవాన్! నాకు ఒక మంత్రం ఉపదేశం అయింది. దాన్ని జపిస్తే అనుకోని ఫలితాలు వస్తాయని కొందరు భయపెడుతున్నారు? ఇంతకూ అది ప్రణవం. మీ సలహా వేడుతున్నాను. దాన్ని జపించేదా? నాకు దానిలో చాలా నమ్మకముంది!

                 మహర్షి : 
ఖచ్చితంగా చెయ్యవచ్చు. దాన్ని విశ్వాసంతో జపించాలి.

              భక్తురాలు :
  ప్రణవం మాత్రం చాలునా? లేదా దయచేసి వేరే ఏదైనా సలహా ఇస్తారా!

               మహర్షి :
  మంత్ర జపం ఉద్దేశం ఏమిటంటే ఆ జపం తనలోనే, తన ప్రయత్నం లేకుండానే జరుగుతోందని తెలిసుకోవడానికే. వాక్కు రూపంగా వచ్చే జపం మానసిక జపమై, ఆ మానసిక జపం చివరకు నిత్యసిద్ధంగా అనుభవం అవుతుంది. ఆ మంత్రం వ్యక్తి యథార్థ స్వభావమే. ఆత్మసాక్షాత్కార స్థితి కూడ అదే.

              భక్తురాలు : 
ఆ విధమైన జపం వలన, సమాధిస్థితి ఆనందాన్ని కూడ అందుకోగలమా?

                మహర్షి : 
 జపం మానసికమై చివరకు ఆత్మగా సాక్షాత్కరిస్తుంది. సమాధి అంటే అదే.

                 భక్తురాలు :
  కృపతో నన్ను అనుగ్రహించండి. నా సాధనకు బలాన్ని చేకూర్చగలరు.

    మహర్షి అనుగ్రహ దృష్టిని వారి మీద సారించారు.

No comments:

Post a Comment