Thursday, November 20, 2025

 🌄 జ్ఞానప్రసూనాల

1.జగత్తులో ఉన్నాను' అనే అనుభవం ఉన్నదా?
లేక
జగత్తును చూచేవానిగా ఉన్న అనుభవం ఉన్నదా?
ముందు తేల్చుకో.
మొదటి అనుభవంలో నీవుంటే నీవు జీవుడవు.
రెండవ అనుభవంలో నీవుంటే
నీవు దేవుడవు.
రెండవ అనుభవంలో నీవున్నందుకు గుర్తేమంటే -నీకు మరణభయం ఉండదు.

2.గురు ఋణాన్ని ఇప్పటి వఱకు
ఎవరూ తీర్చుకున్నది లేదు. ఇక ఎవరూ తీర్చుకోలేరు కూడా .ఇది సత్యం.

3.కనురెప్పకు, కనుగ్రుడ్డుకు మధ్య ఉన్న దూరం ఎంతో తనకు, దైవానికి మధ్య ఉన్న దూరం కూడా అంతే.

4.సినిమా తెరపై అన్ని పాత్రలు డైలాగులు, వివిధ శబ్దాలు అన్నీ
ఒకే స్పీకర్ నుండి వస్తున్నట్లుగా
ప్రపంచంలోని ప్రతి శబ్దమూ ఒకే కేంద్రము నుండి వస్తున్నది.
ఆ కేంద్ర స్థానమే దైవం.
ప్రతి శబ్దమూ
ప్రతి కదలికా ప్రతి ఉనికీ దైవము వలననే; దైవమే.

5.ప్రపంచాన్ని నిజం అనుకున్నప్పుడు దుఃఖం ఉంటుంది. ప్రపంచం అనేది ఓ పెద్ద సినిమా అని అనుకున్నప్పుడు మజా ఉంటుంది.
ఈ మజాకు అలవాటు పడితే ఇక ఏ సినిమా చూడవు.

6.తెర మీద దృశ్యమే తెర కనబడడానికి ఆటంకం. జగదృశ్యమే జగత్కర్త కనబడడానికి ఆటంకం. తెర లేకుండా సినిమా లేదు ఈశ్వరుడు లేకుండా ప్రపంచం లేదు.

7.తల్లి కేవలం శిశువునే కాదు, శిశువుకు సంబంధించిన యావత్తు జీవితాన్ని ప్రసవిస్తుంది.

8.సాటి మనిషికి ఇబ్బంది కలిగించకుండా జీవించండి చాలు ఇంతకు మించి ధర్మానుష్ఠానం ఏమీ లేదు.

9.ఒక కుండను ఒక చోట నుండి మరొక చోటుకి తీసుకెళ్లవచ్చు.

కానీ అందులోని ఆకాశాన్ని ఒక చోట నుండి మరొక చోటుకి తీసుకుపోవడం కాదు కదా! సకల వస్తువులు ఆకాశంలోనే ఉన్నట్లు సకల సృష్టి భగవంతునిలోనే ఉన్నది. భగవంతునికి సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రపంచం ఉండదు.

10.ప్రాణుల్లో ప్రాణం ఉండటం కాదు. ప్రాణంలో ప్రాణులున్నాయి.

11.ఏడాది పాటు చదివిన చదువు ఏమాత్రం అన్నది గంటలో జరిగే పరీక్షల్లో తేలినట్లు జీవితకాలం చేసిన స్మరణ ఏమాత్రం అన్నది చివరి శ్వాసలో తేలుతుంది

No comments:

Post a Comment