🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(273వ రోజు):--
స్వామి తేజోమయానందను వారసునిగా నిర్ణయించడం నిజంగా సరైన పనే. చెయ్యదలుచుకున్న దేదైనా తప్పకుండా జరిగేలా చూచే తత్వం ఆయనది. హిందీ మాట్లాడే వారి కోసం ఒక ఆశ్రమం నిర్మించా లనే ఆలోచన ఆయనకు స్వయం ప్రేరణగా వచ్చినదే. అదే సిద్దబరి ఆశ్రమంగా రూపొందింది. సన్యాస దీక్ష తీసుకొని స్వామిగా మారిన తర్వాత బొంబాయి లోని సాందీపని సాధనాలయంలో ఆచార్యునిగా పని చేశారు. అంతేకాక, చాలా సంవత్స రాల కృషితో కాలిఫోర్నియా లోని శాన్ హోసేలో మిషన్ కార్యాలయాన్ని స్థాపించారు. అందు చేతనే ఆయనకు విదేశాల్లోని మిషన్ కార్యక్రమాల గురించి బాగాతెలుసు.
కేంద్ర చిన్మయమిషన్ నిధి (CCMT) కి ముఖ్యాధికారైన శ్రీ నారాయణ్ భాటియా మిషన్ కేంద్రా లన్నిటికీ వ్రాసిన జాబులో స్వామి తేజోమయానంద CCMT అధ్యక్షులు గానూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్మయమిషన్ కేంద్రాలన్నిటికీ ఆధ్యాత్మిక ఆచార్యుని గానూ నియమితు లయ్యారని తెలియజేశారు. అంతేకాక, స్వామి పురుషోత్తమానంద ను పరిపాలక మండలిలో సభ్యునిగా నియమిం చారు. స్వామి తేజోమయానంద లేనపుడు ఆయన అధ్యక్షునిగా వ్యవహరిస్తారు.
1993 సెప్టెంబర్ 23 న స్వామి తేజోమయానంద శోకసముద్రంలో మునిగిఉన్న మిషన్ సభ్యుల నుద్దే శిస్తూ జాబు వ్రాశారు.
స్వామి తేజోమయానంద మిషన్ సభ్యుల నుద్దేశిస్తూ వ్రాసిన జాబు :
------------------------------
పరమపూజ్య గురుదేవులు మహాసమాధి పొందటం ద్వారా తన జీవితానికి పరిపూర్ణత చేకూర్చు కున్నారు. కాని ఆయనతో సాంగత్య మున్నవారి జీవితాలు ఆయన లేనపుడు అదేవిధంగా ఉండలేవు. ఆయన మన జీవితాలను - వాటి కొక లక్ష్యాన్నీ, దిశనూ నిర్దేశించటం ద్వారా - ఎంత గాఢంగా ప్రభావితం చేశారో గ్రహించడానికి మనకు మరి కొంతకాలం పడుతుంది. ఆయనతో సాంగత్యం నిజంగా మనకు లభిం చిన వరమేనని చెప్పాలి.
పూజ్య గురుదేవులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలు జగ ద్విదితమే ; వాటిని ఇక్కడ మళ్ళీ వర్ణించ నవసరం లేదు. మనకు ముఖ్యంగా తెలియాల్సిన దేమంటే, మనందరమూ మన శక్తి సామర్థ్యా లను బట్టి సంఘసేవ చేయటానికి ఆయన చేసిన కృషి చాలా కార్య రంగాలను సిద్ధంచేసింది. భగవంతు ని సేవగా చేపట్టే అట్టి పని ద్వారానే మన అంతరంగాలను పరిశుద్ధం చేసుకోగలం. మనం లక్ష్యంగా పెట్టు కున్న పనులు చేస్తున్నపుడు మనం ఈ విషయం గుర్తుంచుకోవాలి.
పూజ్య గురుదేవుల వంటి వ్యక్తి ఈ ప్రపంచంలో శతాబ్దానికొకరు జన్మిస్తారేమో ! ఆయనలాంటి వారెవరూ లేరు ; భవిష్యత్తులో ఉండబోరు కూడా. సంస్థలో ఆయన స్థానాన్ని మనమెవ్వరం భర్తీ చెయ్య లేం. ఐనప్పటికీ, మనమందరం ఆయనకు అంకితమైన భక్తులం, సేవకులం కాగలం. ఆవిధంగా ఆయన మనందరనూ చూచి గర్వ పడేలా, ఆయన తన ముందుచూపు తో లక్ష్యంగా పెట్టుకున్న సేవా కార్య క్రమాలను ముందుకు సాగించగలం. మనలోమనకు వివిధ విషయాల్లో అభిప్రాయ భేదాలుండటం సహజమే ; కాని, అవి మనమధ్య విభేదాలకు కారణం కాకూడదు. మన సహోదరులైన, సహోదరీ మణులైన భక్తులు ఏదైనా ఒక విషయంపై వ్యక్తం చేసిన అభిప్రాయం మనకు సబబు కాదని పించవచ్చు. అంతమాత్రం చేత, వారికి పూజ్య గురుదేవులపై గల భక్తి విశ్వాసాలను మనం శంకించనవ సరం లేదు. వారికి మీకంటే ఎక్కువ భక్తి ఉన్నట్లు భావించండి. ఈ వైఖరి వల్ల చిన్మయ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐకమత్యం పెంపొందు తాయి. ప్రేమ కుటుంబానికి శాంతినీ, ఆనందాన్నీ ఇస్తుంది.
మనమందరం కలిసి పనిచేద్దాం కలిసి సాధిద్దాం ; అందరి సంక్షేమ మూ, భగవంతుని కరుణ, పూజ్య గురుదేవుల ఆశీర్వాదం మనకు సదా తోడుగా ఉండుగాక !
భగవంతుని సేవలో,
స్వామి తేజోమయానంద.
--**--
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment