Thursday, November 20, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(275వ రోజు):--
       దేశానికీ, సమాజానికీ, కుటుంబా నికీ, మనం అందించే సేవలూ, ఎవరికీ తెలియనంత నిగూఢంగా మనం చేసే త్యాగాలూ, మనస్ఫూ ర్తిగా మనం చూపే దయ - ఇవన్నీ మన చుట్టూ ఉన్నవారిని ప్రోత్స హించడానికీ, చేయి నందించడం ద్వారా వారు లేవటానికి సహకరిం చడానికీ ఉద్దేశించబడ్డాయి. ఈ సేవ యే మన ఆధ్యాత్మిక సాధన. మానవ సేవ ద్వారా మాధవుని సేవిస్తాం మనం. జీవితంలో మనం చేసే ప్రతి పనీ సర్వాంతర్యామి యైన సదాశివుని పూజలో భాగమే.
          మన లక్ష్యపు కార్యరంగం హిందువులకు కాని, భారతదేశానికి కాని పరిమిత మైనది కాదు. సమస్త మానవజాతీ, అన్ని దేశాలూ, సమాజాలూ, జాతులూ మన కార్య రంగమే. మన శ్రద్ధా భక్తులు మానవ జాతికే ; మానవుడే మన పూజా క్షేత్రం. మానవత్వంపై నిశ్చలమైన, అచంచలమైన విశ్వాసం ద్వారా మన అంతరంగంలో ఆధ్యాత్మిక వికాసం కలిగించు కోవటమే మనం కోరుకునేది. అది కాక ఇంకేదో జరుగు తుందని మనం అనుకోవటం లేదు ; ఇంకేదో కావాలని మనం కోరుకోవటం లేదు. మన మతం "సృజనాత్మక మైన మంచితనం" అని మన నమ్మిక. చిన్మయమిషన్ సభ్యులందరూ భగవంతుని సేవకు లే ; సాటి మానవులను ఆయన నిర్దేశించిన విధంగా సేవిస్తారు వారు శ్రద్ధగా చేసే తమ కర్మలన్నిటినీ ఎప్పుడూ భగవంతునికే అంకితం చేస్తూ. ఈ నూతనమైన మహా లక్ష్యంతో హిందూ సంస్కృతికి పున రుజ్జీవనం, అభ్యున్నతి కలుగు తుంది ; పుష్పించి, ఫలిస్తుంది. 
                            ---
         స్వామీజీకి బాలలంటే చాలా ప్రేమ. భారతదేశపు ఉజ్జ్వలమైన భవిష్యత్తుకు బాలలే ఆశాకిరణంగా తోచా రాయనకు. "పిల్లల హృదయ ఫలకం అతి శుభ్రంగా ఉంటుంది. దానిమీద ఎంత చక్కని చిత్రాలనైనా చిత్రించవచ్చు" అనేవారు. పిల్లలతో మాట్లాడటానికి దొరికిన అవకాశా న్నెప్పుడూ జారవిడుచు కోలేదాయన, అది తన కార్యక్రమం లో లేకపోయినా సరే. 
        పిన్న వయసులోనే తమ దేశపు మతాన్నీ, సంస్కృతినీ నేర్పటానికీ, వారిలోని సహజమైన ప్రతిభను వెలికి తీయటానికీ 1950 ల నుంచీ చిన్మయమిషన్ కేంద్రాలన్నిటిలో బాలవిహార్ బృందాలను నెలకొల్ప టం ప్రారంభించారు. వారం వారం జరిగే సమావేశాల్లో భజనగీతాలు పాడటం, భారతదేశపు మహాత్ముల గాథలు చెప్పడం, నైతికమైన, ఆధ్యా త్మిక మైన ఇతివృత్తాలున్న నాటిక లలో పాల్గొనటం మొదలైన వాటికి పిల్లలను ప్రోత్సహిస్తారు. తమ దైనిక జీవనాన్ని సుసంపన్నం చేసుకో టానికి ఉపకరించే భావాలను వారి కందించటానికి 1959 లో బాలల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను ప్రచు రించడం మొదలుపెట్టారు. 1960 ల మొదటి సంవత్సరాల్లో పిల్లలకోసం అన్ని రాష్ట్రాల్లోనూ శిబిరాలు నిర్వ హించడం మొదలైంది. తనకు ఎన్ని పనులున్నా ఎలాగో వీలుచేసుకొని, స్వామి చిన్మయానంద ఈ శిబిరాల్లో మాట్లాడటానికీ, పోటీల్లో బహుమతి ప్రదానం చేయటానికీ వచ్చేవారు.
                      —***—
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment