Thursday, November 20, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(277వ రోజు):--
చిన్మయ ఉవాచ :-
                      -అధ్యాపకులు -
    చిన్నతనంలోనే మన మతధర్మపు  సాంప్రదాయకమైన విలువలను మనసులో నాటడానికీ, విద్యార్థుల ను సమాజానికి ప్రయోజన కారులు గా మలచడానికీ మన విద్యాలయాలు ప్రారంభించ బడ్డాయి. సమాజవాద మంటే నినాదాలు చెయ్యడం, వాహనాలు తగుల బెట్టడం కాదు. ఎవరినో తిడుతూనో, పొగడుతూనో కూర్చుంటే బీదతనం తొలగిపోదు. నిస్సత్తువను సత్తువ ఒక్కటే తొలగించ గలదు. మన యువతకు సాంప్రదాయ సిద్దమైన విలువల ద్వారానే దారి చూపాలి. 
        అటువంటి విలువలతో జీవించ డం నిశ్చలమైన, సమర్థవంత మైన మనసు కలవారికే సాధ్యపడుతుంది. మన యువకులకు ఆ విలువలను బోధించ డమే మన లక్ష్యం కావాలి. మనం ఆ ఉన్నతా దర్శాలను దృష్టి లో ఉంచుకొని విద్య నేర్పాలను కొంటున్నాం. మనం సఫల మైతే ఎవరూ మెచ్చుకోక పోవచ్చు ; కాని, మన విధిని సక్రమంగా నిర్వర్తించా మనే మానసిక తృప్తి మనందరకూ దక్కాలి. మనల్ని జనులు విసిగించ డమో, పరీక్షించడమో, లేదా నవ్వి పారేయడమో చేస్తూనే ఉంటారు. దాని నంతటినీ సహించే మనశ్శక్తిని మనం సంపాదించాలి, నిరుత్సాహ పడకుండా ముందుకు సాగాలి. పాఠ శాలల్లో బోధన విషయమై ప్రత్యేక మైన శిక్షణ ఏదీ నేను పొందలేదు. అందుకే, ఈ భావాలను ఆధారం చేసుకొని మన విద్యాలయాలకు ఒక మంచి పథకం తయారుచేసే బాధ్యతను ఉపాధ్యాయు లైన మీరందరి మీదా మోపుతున్నాను. 
         ప్రార్థన గీతాల నాలపించడం, కథలు చెప్పడం వంటి మన సంస్థ ల్లో వాడే పద్ధతులు మాత్రమే కాక, ఉపాధ్యాయులూ తల్లిదండ్రులూ తరుచూ సమావేశమై, సంయుక్తం గా ఈ లక్ష్యం కోసం పనిచేయాలని నా ఉద్దేశం. తల్లులు తరగతి గదుల వరండాల్లో నడుస్తూ తరగతుల్లో ఏమి జరుగుతోందో గమనించడాన్ని ఉపాధ్యాయులు ప్రోత్సహించ వచ్చు పాఠశాల ఇంటికి పెరడులా, గృహనికి అనుబంధంగా ఉండాలి.
      అటువంటి అన్యోన్యమైన వాతా వరణం వ్యక్తిత్వ వికాసానికి చాలా దోహదం చేస్తుంది. పిల్లలలో తాము తక్కువ వారమనే న్యూనతా భావం చోటు చేసుకోకుండా, దుర్విమర్శలు చేయకుండా ఉండటానికి మీరు ప్రయత్నించాలి. దానికి బదులు, వారిలో ఉండే మంచి లక్షణాలనే, వాళ్ళు సాధించిన చిన్నచిన్న విష యాలనే పెద్దవిగా చేసి చూపండి. ఆ విధంగా వారి ప్రేమనూ, గౌరవాన్నీ మీరు చూరగొంటారు. చిన్నతనంలో మనసులో నాటుకొన్న భావాలు తర్వాత తప్పకుండా బయటకు వస్తాయి. 
             మన ఘనమైన ప్రాచీన సంస్కృతికి దాని గతించిన ఔన్నత్యాన్ని మళ్ళీ తీసుకు రావాలంటే, ఈ బృహత్కార్యాన్ని మీరు నిర్వర్తించక తప్పదు. ఈ ఆశయంలో కొంత నెరవేర్చ గలిగినా, మీరు ధన్యులే ననుకోవాలి. పాఠశాల లో మీరు బోధించే లౌకిక విషయాలతో పాటు ఈ ఉదాత్తమైన భావాలను కూడా మనసుకు హత్తు కునేలా బోధిస్తే, మీ స్థాయి తప్పకుండా పెరుగుతుంది ; సత్సాంప్ర దాయంతో సేవచేసిన వాని పరిపూర్ణతతో మీరు ప్రకాశిస్తారు. 
                          --**--
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
 🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment