Thursday, November 20, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(278వ రోజు):--
       1975 మే లో చిన్మయమిషన్ బెంగుళూరులో యజ్ఞం నిర్వహించి నపుడు, దానితో పాటు ఒక వారం రోజులు యువతీ యువకులకు శిబిరం నిర్వహించారు. ఆ సందర్భం లోనే చిన్మయ యువకేంద్రం (CHYK) స్థాపించ బడింది. పది సంవత్సరాల్లో సుమారు 30,000 సభ్యులతో 30 కేంద్రాలు - ముఖ్యంగా మద్రాసు, బెంగుళూరు, బొంబాయి వంటి పెద్ద నగరాల్లో - ఏర్పడ్డాయి. 
         ఈ దేశపు యువకులు 'పనికి మాలిన వారు' కారనీ, 'పనికి వాడని వారు' మాత్రమే ననీ స్వామీజీ విశ్వ సించారు. వాళ్ళు శ్రద్ధ 'లేని' వారు కాదు ; (మనం) శ్రద్ధ 'తక్కువ' చూపిన వారు. దేశపు అదృష్టం ఎప్పటి కైనా యువత చేతుల్లోనే ఉంటుంది. చిన్మయ యువకేంద్రాల ద్వారా వారికి తమ గమ్యమేమిటో స్పష్టంగా తెలియజేసి, సరైన విలువ లను పెంపొందించు కోవటానికి అవసర మైన సాధనలను నేర్పి, తద్వారా వారు తమ వ్యక్తిత్వాలను సరైన రీతిలో మలుచుకొని తమ అంత శ్శక్తులను ప్రయోజన కరమైన రీతిలో వినియోగించేలా చెయ్యాలను కొన్నారాయన.
చిన్మయ ఉవాచ :-
                     --యువత--
       మీరు చిన్నపిల్లలు కారు ; కాని, పెద్దవాళ్లలా జీవన సంఘర్షణలో మునిగి పోలేదు కూడా. ఈ దశలో మీరు చరిత్ర సృష్టించ గలరు. మన దేశ ప్రగతిలో విప్లవాత్మక మైన మార్పు లన్నీ యువకులు చేసినవే. కొత్త పనులు చేపట్టడానికి గతచరిత్ర, గతంలో జరిగిన పొరపాట్లు, గతం తెచ్చిన మార్పులు మీకు తెలియాలి. మీకు సరైన జ్ఞానం, సరైన విచక్షణ, మంచి పథకాలను యోచించే సామర్థ్యం ఉండాలి. 
          ఇప్పుడు అధికారంలో ఉన్న తోడు దొంగల, పందికొక్కుల ముసలి మూక ఏ మార్పూ రానివ్వదు, ఏ కొత్త పనీ చేపట్టదు. ఇపుడున్న వ్యవస్థ పాత పద్ధతులనే కొనసాగిస్తుంది. ఏ రంగంలో నైనా సరే - అది మతమైనా, విద్య యైనా, శాస్త్ర మైనా, రాజకీయమైనా - వారి ఆసక్తి అంతా ఉన్నది ఉన్నట్లు ఉంచడమే. దీనివల్ల పురోగమనం కుంటుపడి, ఆ స్థానంలో స్తబ్దత చోటుచేసు కుంటుంది. యువకులు పాతపద్దతు లకు బానిసలై కొత్త అవకాశాలను సృష్టించక పోతే, వారికి నిష్ఫలత, దానిద్వారా వచ్చే నిరాశ తప్పవు. వీటినుంచి తప్పించు కోవటం కోసం తమ భౌతిక, మానసిక, బౌద్ధిక శక్తు లన్నింటినీ - పొగత్రాగటం, మద్య పానం, మత్తు మందులు, మీరు సంగీతం అని పిలిచే కర్ణ కఠోరమైన శబ్దాలు - వీటన్నిటిలో వ్యర్థంచేస్తారు 
          దీన్నుంచి బయటపడే దారే దైనా ఉందా ? సంస్కృతి, నైతిక విలువలు, చరిత్ర - వీటిని ఒక క్రమ బద్దమైన రీతిలో నేర్పే కార్యక్రమంలో మీరంతా పాల్గొనటమే దీనికి సమా ధానం. పత్రికలు చదవటం చాలదు. వాటి నుంచి విషయ జ్ఞానం రాదు. విషయాలను ప్రచారానికి అనువుగా మార్చి ప్రచురిస్తారు వాటిలో. ఏది సరైనదో మీ స్వంత ఆలోచనతో తేల్చు కోవాలి. మీరు నమ్మిన దానిని ఆచరణలో పెట్టే ధైర్యం మీకుండాలి. ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకున్న తీరు, మీ దేశ భక్తి, సమాజంపై మీ కున్న ప్రేమ, ప్రభుత్వంతో కాకపోయి నా మీ దేశంతో మీకున్న గాఢమైన అనుబంధం - ఇవే ఆధారంగా మీ ఆశయాలు, మీ పథకాలు మీ అంత రంగం నుంచే వెలువడాలి. అటు వంటి ఒక్క నాయకుడున్నా గొప్ప మార్పు తీసుకు రాగలడు. మీ యౌవ నోత్సాహం, వివేకం తప్పుదారి పట్ట కుండా చూచుకోవాలి. 
                          ---
       బ్రహ్మచారులకు సాందీపని లోనూ, హిమాలయ సాందీపని లోనూ ఇచ్చే శిక్షణ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని ముందుకు సాగిస్తుంది. విద్యార్ధి బృందాలకు మొదట స్వామీజీ బోధించారు. తర్వాత ఎందరో అనుభవ శాలురు బోధన కొనసాగించారు. దీనివల్ల విద్యార్థులు శ్రద్ధా భక్తులు బోధించే ఆచార్యులపై కంటే బోధించే విషయాల పైనే ఎక్కువగా నిలప టానికి సాధ్యమైంది ; గురువుపై ఆధార పడటం కాక, స్వతంత్రంగా లక్ష్య సాధనకు ఉపక్రమించ డానికి ఇది దోహదం చేస్తుంది. పట్టణా ల్లోనూ, నగరాల్లోనూ విధులు నిర్వ ర్తించడానికి పంపినపుడు, స్వతంత్రంగా చేయగలమనే ఆత్మ విశ్వాసం వారిలో ఉండాలి. ఐనప్పటికీ, వారంతా స్వామీజీ కుటుంబంలో సభ్యులే. తన పర్య టనల్లో ఎదురైనప్పుడల్లా స్వామీజీ వారికి తగిన సలహాల నిచ్చేవారు. 
                      ---
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
 🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ 🌺

No comments:

Post a Comment