Tuesday, November 4, 2025

 కన్నవారి హితోక్తులు
----------------------------------------------------
అతి నిద్ర హానికరము
కలుగజేయు దారిద్ర్యము
చురుదనము బహుమానము
కల్గియుంటే భాగ్యము

సోమరితనమే నష్టము
ఉండాలోయ్! బహు దూరము
మనుషుల్లో చేరితే
కుటుంబాలు నాశనము

తలపించును యములోకము
ఉంటే దానవత్వము
మొదట్లోనే తరిమెస్తే
జీవితమే సుఖాంతము

అలవడితే దుర్గుణాలు
కకావికలము బ్రతుకులు
గాయపడితే మనసులు
అగును రైలు పట్టాలు
-బాలబంధు గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580

No comments:

Post a Comment