Wednesday, November 26, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



  *”జరిగేవి జరిగిపోతుంటాయి”*

                ➖➖➖✍️


```

ఒక దొంగ దొంగతనానికి పోతూ దేవుడికి ఈవిధంగా దండం పెడుతున్నాడు- “ఓ దేవుడా నేను దొంగతనానికి పోతున్నాను… పోలీసులకి దొరకకుండా నేను దొంగతనం చేసి రావాలని దీవించు స్వామి” అని.


దొంగతనం చేస్తూ దొంగ పోలీసులకి పట్టుబడిపోయాడు.


మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఈవిధంగా ప్రార్దించాడు... “ఓ దేవుడా పోలీసులకి దొరికితే దొరికాను కాని లాఠీ దెబ్బలు పడకుండా నీవే కాపాడాలి!”


లాఠీతో పోలీసులు చావ బాదారు దొంగని..!


మళ్ళీ దొంగ ఈవిధంగా మనసులో దేవుడిని ప్రాధేయపడుతున్నాడు... “పోనీలే పోలీసులు కొడితే కొట్టారు, శిక్షపడకుండా చేయి”మనీ!


కాని దొంగకి శిక్ష పడింది….ఆరు నెలల జైలు శిక్ష ..!


మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఇలా కోరుతున్నాడు..”ఓ దేవుడా శిక్ష వేస్తే వేసావు కాని జరిమానా విధించకుండా చేయి… అసలే డబ్బులు లేవు… వుంటే దొంగతనం ఎందుకు చేస్తాను…” అని దుఃఖంతో దేవుడిని వేడుకున్నాడు. 


జడ్జి దొంగకు పదివేల రూపాయల జరిమాన కూడా విధించాడు….!!


మరి దేవుడ్ని ఇన్ని సార్లు ప్రార్ధించినా జరిగేవి జరిగిపోతున్నాయి. ఒకదాని తరువాత ఒకటి. 


ఈ మాత్రం దానికి భగవంతుడిని అడుగడుగునా వేడుకున్నా జరిగేది ఎవరూ తప్పించలేరు.


దాదాపు అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవం వుంటుంది. మనకు అనుకూలంగా అన్నీ కోరుకుంటాము…కాని విధి దాని ధర్మం అది పాటిస్తుంది.


చేసేది మంచి పని అయివుంటే మంచి ఫలితం వచ్చి వుండేది! 


చేసేది దొంగతనం! ఒకరు కష్టపడి సంపాదించిన ధనము,బంగారము అయాచితంగా తస్కరించడం! ఇదేమి ధర్మకార్యం కాదు! వస్తువుల్ని,ధనాన్ని పోగుట్టుకొని ఏడ్చేవారి హృదయ వ్యధ వుంటుంది కదా...!


అందుకే మనం చేస్తున్న పనిని బట్టి మనకు న్యాయం లభిస్తుంది.


దేవుడికి అన్నీ తెలుసు. తెలియనిది ఏదీ లేదు… దేనికి ఏ కర్మఫలితం ఇవ్వాలో తెలుసు…!


మనం ఓపికతో ప్రార్ధిస్తాము …సరే అది నిజమే!! కాని ప్రార్ధన వెనుక ఏమి జరిగింది అనేది భగవంతుడు కి తెలుసు….!!


చీమకు ఆహారం కూడా వేసే భగవంతుడు కి మనం చేసే పని తెలియకుండా పోదు…!


భగవంతుని పై భారం వేసి చేసే ప్రతి పనికి కర్మఫలితం వుండదు. కాని మనం ఆపనిని స్వార్ధంతో కాకుండా నిష్కామంగా… ఫలితం ఆశించకుండా చేయాలి! ఫలితం అశించావో మరి దాని కర్మ ఫలితం అనుభవించాలి!


అలా కర్మఫలితం ఆశించకుండా పనులు భగవంతుడికి అర్పిస్తూ చేస్తుంటే అదే యోగి అంటే..! దాని కోసం హిమాలయాలకి వెళ్ళనవసరం లేదు….ఋషివలే తపస్సు అవసరం లేదు! మనం ధర్మపనులు చేస్తూ ఫలితం ఆశించకుంటే చాలు…!!✍️```


ఇదే భగవద్గీత సారము…!!


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment