Wednesday, November 5, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 

 ఒక భక్తురాలు ఆశ్రమానికి క్రొత్తగా వచ్చింది. మహర్షిని దర్శించి కొంచెము ధైర్యం చేసి మహర్షితో ఇలా సంభాషించింది ......
       
                   భక్తురాలు : 
    భగవాన్! నాకు ఒకే ఒక కోరిక ఉన్నది. అడుగవచ్చునా! 
          
                  మహర్షి : 
        ఏమి? ఏమి కావాలి? 

                 భక్తురాలు : 
            మోక్షము కావాలి.

                  మహర్షి : 
             ఓహో! అట్లనా!!!

                 భక్తురాలు  : 
       అవును భగావాన్! ఇక నాకు ఆశయూ లేదు. మోక్షము ఒక్కటి ఇచ్చిన చాలును. 

                 మహర్షి : 
          నవ్వుచూ , సరే! సరే! మంచిది.

                భక్తురాలు : 
       ఎప్పుడో ఇస్తానని చెప్పక ఇప్పుడే ఇవ్వాలి భగవాన్! ఇస్తారా! పోయి వస్తాను. నాకు రైలుకు టైము అయినది. ఊ! ఇస్తారు కదూ!
 
                  మహర్షి :  
          ఊ! ఊ! సరిపోయింది.

    ఆ భక్తురాలు సన్నిధి దాటివెళ్ళిన వెంటనే ఆపుకోలేని నవ్వుతో మహర్షి అక్కడున్న వారిని చూచి ఇలా సెలవిచ్చారు ......
    
      మోక్షము ఒక్కటి ఇస్తే చాలట! వేరే ఏది వద్దట. అది ఏమైనా కట్టి ఇచ్చుటకు మూటా ముల్లా!! ఏ ఆశయూ లేదట. మోక్షము మాత్రము ఆశకాదు కాబోలు? మనసులో ఉన్న ఆశాపాశములను తీసివేసిన ఉన్నది మోక్షమే కదా! దాన్ని ఎవరు ఎవరికి ఇవ్వగలరు? దానికోసం సాధన చేయాలి. అంతే.

No comments:

Post a Comment