➡️ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు⬅️
ఈరోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా కేవలం బాహ్య ప్రపంచపు ఆడంబరాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని అనారోగ్యంగా చేసుకొని అనేక రోగాల బారిన పడుతున్నాం..
*మరి మనం ఏం చేయాలి*?
➡️ మన ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి.
➡️ ఒంటరిగా అస్సలు ఉండకూడదు.
➡️ నలుగురితో కలిసి నాలుగు మాటలు నవ్వులు,ముచ్చట్లు,
➡️ మంచి విషయాలు పంచుకోవడం కు మించిన ఆరోగ్యం ఏది లేదు
➡️ ఎదుటి వారి గురించి నెగిటివ్ థింకింగ్ మనకు ప్రధాన శత్రువు.
➡️ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ఆరోగ్య రహస్యం.
➡️ హాయిగా నవ్వుకోవాలి
మనసార నవ్వుకోవాలి
అన్నింటికి ఆరోగ్యం అదే.
➡️ దోస్తులతో కూర్చున్నప్పుడు హాయిగా నవ్వుకునే ముచ్చట్లు పెట్టాలి.
➡️ వాళ్ల గురించి వీళ్ళ గురించి నెగిటివ్ ఆలోచనలు మెదడుకు ఒత్తిడి కలిగిస్తాయి.
➡️ మీ గ్యాంగ్ లో ఎప్పుడు నెగిటివ్ మాట్లాడే వారు ఉంటే వారికి దూరంగా ఉండాలి.
➡️ ప్రశాంతత ఉన్నచోట కూర్చుని మనసారా నవ్వుకునే... మంచి విషయాలు మాట్లాడుకునే మిత్రుల వద్ద ఉండాలి.( సజ్జన సంగత్యం చేయాలి).
➡️ ప్రతి రోజు క్రమం తప్పకుండ వ్యాయామం,ధ్యానం తప్పక చేయాలి.
➡️ అలాగే శారీరక శ్రమ మనలో నూతన ఉత్సాహన్ని నింపుతుంది కాబట్టి ప్రతిరోజు నడవాలి,నడకను మించిన ఆరోగ్యం ఏదీ లేదు.
ఉదయం మరియు రాత్రి మన వయసును బట్టి కనీసం
కొంత దూరం అయిన నడవాలి.
➡️ ఆరోగ్య సమస్య ఏదైనా ఏర్పడినప్పుడు
మొదట్లోనే జాగ్రత్తపడాలి.సొంత వైద్యం చేసుకుంటూ కాలయాపన చేయొద్దు.
➡️ మసాల ఫుడ్....ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది
➡️ నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. (కొంచెం కొంచెం రోజుకు 5 లీటర్లు కనీసం)
➡️ పండ్లు ... పండ్ల రసాలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది.
➡️ టీ,కాఫీలకు బదులు పండ్ల రసాలు చాలావరకు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
శరీరంలోని అనారోగ్యాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాయి.
➡️ బి.పి , షుగర్ లు ఉన్నంత మాత్రానా హైరానా పడవద్దు...చక్కటి డైట్ మైంటైన్ చేస్తూ పోతే అవి కూడా మన నుండి పారిపోతాయి.
➡️ డబ్బు గురించి కానీ మరి ఏదైనా సమస్య గురించి గానీ విపరీతమైన ఒత్తిడితో ఆలోచించవద్దు.
➡️ అన్ని రోగాలకు మూలం మానసిక ఒత్తిడి. ప్రశాంతంగా లేకపోవడం.
కాబట్టి ఉన్న కొన్ని రోజులు ఆనందంగా ఆరోగ్యంగా గడపాలంటే .. ఒత్తిడికి దూరంగా ఉండేలా మొదలు లైఫ్ ను ప్లాన్ చేసుకోవాలి.
➡️ ఎంత డబ్బు సంపాదించిన...ఆరోగ్యం దెబ్బ తిన్న తరువాత ఆ డబ్బు మనల్ని శారీరకంగా ఒక్కోసారి కాపాడిన మానసికంగా కాపాడలేదు.
➡️ ఉన్నదానితో ఉన్న దాంట్లో.... సంతృప్తిగా ఆనందంగా ఆహ్లాదంగా నలుగురితో గడుపుతూ సరదాగా నవ్వుతూ ఉండడం కు మించిన ఆరోగ్యం ఏదీ లేదు.
➡️ నేను ...నాది అన్న భావన వీడి...మనం మనది ...అనుకుంటే ఏ రోగం నీ దగ్గరికి రాదు. స్వార్థం కు మించిన పెద్ద రోగం ఏది లేదు.
➡️ శాఖాహారం...బెస్ట్.
కూరగాయలు మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి.
🔺🔺 ఫైనల్ గా 🔺🔺🔺
*నడవండి..ధ్యానం చేయండి. సరి అయినా ఆలోచనలు చేయండి..మంచి ఆలోచనలు పంచుకోండి...
నెగిటివ్ థింకింగ్ లకు దూరంగా ఉండండి*
ఒంటరిగా అస్సలు ఉండకండి
నలుగురిలో కలవండి. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఆరోగ్యంగా గడపండి ఆనందంగా గడపండి.
ధన్యవాదాలు.....
అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ....
No comments:
Post a Comment