Pasupula Pullarao..8919291603...
పేదవారు/ధనికులు,ఆరోగ్యం/అనారోగ్యం, ఆనందం/ఆందోళన, మంచి/చెడు మొదలగు ద్వంద ఫలితాలకు మూల కారణం మంచి/చెడు కర్మల ఫలితమే... చెడు కర్మలు సరైన సాధన ద్వారా దగ్ధం చేసుకున్న వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మ జ్ఞానం మొదలగు పాజిటివ్ ఫలితాలు పాజిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా పొందవచ్చు.. చెడు కర్మలు ఎవరికి వారు సరైన సాధన ద్వారా మాత్రమే దగ్ధం చేసు కోవాలి... ఈ విషయంలో సృష్టి కర్త కూడా నిమిత్త మాత్రుడే... పత్రిజీ గురువు గారు ధ్యానం అనే బ్రహ్మాస్త్రాన్ని సాధకులకు అందించారు... అందుకే సాధకులు అందరూ సరైన సాధన కు ప్రాముఖ్యత ఇవ్వాలి... అపుడే సరైన సాధన ఫలితాలు పొందడం జరుగుతుంది... కొత్త సాధకులు అందరూ కొద్దిగా అర్దం చేసుకోండి మరి కొద్దిగా ఆలోచించండి... బ్రహ్మ ముహూర్తంలో సాధన చక్కగా కుదురుతుంది...
సాధన చేయగా చేయగా శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది... అపుడు మాత్రమే విశ్వమయ ప్రాణశక్తి శరీరంలోకి ప్రవేశించి నాడీమండం శుద్ధి అవుతుంది... శుద్ధి ద్వారా జన్మ జన్మల కర్మలు దగ్దం కావడం మొదలు అవుతుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం జరగడం జరుగుతుంది.
అమృతం తాగిన దేవతలకు కూడా ధన్వంతరి అనే దేవ వైద్యుడు ఉన్నారు.
No comments:
Post a Comment