🚩🚩 #ఎందరో_మహానుభావులు.. #వీణ_కుప్పయ్య.🚩🚩
- #రచన : #తనికెళ్ళ_భరణి
.
#శ్రీ_త్యాగరాజస్వామి వారికి చాలా శిష్య గణం ఉంది...
అందులో #వీణ_కుప్పయ్యర్ ఒకడు.
అయితే ఆ వీణ కుప్పయ్యర్ - ఈ వీణ కుప్పయ్యా ఒకరు కాదు
ఈయన వీణా....ఈయన కథా....ఈయన కమామీఘూ వేరు...
శ్రీరంగ పట్టణాన్ని సుల్తానులు ఏల్తున్న రోజుల్లో...
కర్ణాటక సంగీతానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు...
ప్రాధాన్యత ఏమిటీ...విసుక్కునేవారు...అలాగ సంగీతానికి ఎప్పుడైతే ప్రాముఖ్యం పోయిందో....వీణకుప్పయ్య శ్రీరంగ పట్టణం నించి బిచాణా ఎత్తేసీ!....
తంజావూరు ప్రయాణం కట్టాడు.
-తంజావూరు చోళ సామ్రాజ్యం!!
మాంచి పాడి పంటలతోటీ -
సమస్త వైభోగముతో....వెలిగిపోతోంది
సంగీత - సాగిత్యాలకి నీరాజనాలు పడ్తున్నది!!
చోళ రాజ్యమే రాజ్యం - కావేరి నదె - నది - అన్నది అవైయ్యార్..!
తంజావూరుని కంటికి రెప్పలా కాపాడ్తున్నవాడు!!
బృహదీశ్వరుడు!....
బృహత్ - ఈశ్వరుడు (అంటే పెద్ద ఈశ్వరుడు అని అర్థం)
అంచేత....బృహదీశ్వరాలయాన్ని - పెరియకోయిల్ (అంటే పెద్ద గుడీ అని అర్థం) అంటారు.
నిజంగా ఎంత పెద్ద ఈశ్వరుడనీ...
లింగం ఎత్తు పదమూడు అడుగులు...
అభిషేకం చెయ్యాలంటే నిచ్చెనెక్కాల్సిందే!.....
ఆ భారీలింగాన్ని....నర్మదా నదినించి ఆరోజుల్లో ఎలాతెచ్చారో!
ఆ లింగాన్ని అరడుగుల పానవట్టం మిద ఎక్కించిన - ’ఇంజనీర్’కి కూడా...అక్కడో చిన్నగుడి కట్టారు.
అదీ వాళ్ళ సంస్కారం!....
తలిదండ్రుల్తో - అన్నదమ్ముల్తో తంజావూరొచ్చిన వీన కుప్పయ్య మెదట బృహదీశ్వరాలయని కెళ్ళి.
రుద్రాభిషేకం చేసుకునీ -
ప్రభువుల ఆస్థానంలోకి అడుగుపెట్టాడు.
సరే యాచక: యాచకన్య శత్రు:
అన్నట్టు - తంజావూరు ఆస్థానంలో ఉండే సంగీత విద్వాంసులు వీణకుప్పయ్యని ఆస్థానంలోకి
రానివ్వకుండా శతవిధాల ప్రయత్నించారు!!
శ్రీనాథణ్ణి....రాజదర్శనం చేయడానికి అడ్డుపడ్డ డిండిమభట్టుకి మల్లే...
అయితే భగవదనుగ్రహం కలగాలిగానీ దర్శనం ఎంతసేపూ!...
మరో దిక్కులేని వీణకుప్పయ్య....
బృహదీశ్వరాలయంలో మకాంపెట్టీ...
ఉషొదయాన్నే బృహదీశ్వరుడికి రాగార్చన...స్వరాభిషేకం చేస్తున్నాడు!
వీణలోంచి....నమకచమకాలు....గమక సహితంగా వొలుకుతున్నాయ్...
అవి సోమవారం - దర్శనం చేసుకోవడానికొచ్చిన రాజుగారి చెవిన పడ్డాయ్...
ఒళ్ళు పులకించింది!....పరమేశ్వరుడి నెత్తిమీదనించి ఓ మందారం రాలి!....కిందపడింది! - ఏరుకునీ నెత్తినెట్టుకోపోతున్నట్టు...
శివుడి అజ్ఞ అయింది!...
రాజు శిరసావహించాడు....
మర్నాడే....ఆస్థానంలో....కుప్పయ్య వీణావాదన - ప్రదర్శన....
ఆస్థాన సంగీర విద్వాంసులు....విషం గక్కడానికి సిద్దంగా!....
పామరులంతా అమృతం గ్రోలడానికి సంసిద్ధంగ ఉన్నారు!.....
అంబ నవాంబ్య్జోజ్వల కరాంబుజ....అయిన సరస్వతీ దేవిని ప్రార్థించాడు.
వరవీణా మృదుపాణి...చిరునవ్వుతో ఆశీర్వదించింది.
వీణకుప్పయ్య వీణ మోగింది...
వీణ - కుప్పయ్య చేతి గిలకపోయింది!....
వీణ - కుప్పయ్య చేతి చిలకైపోయింది!....
కుప్పయ్య సీతారాముడల్లే....వీణ - శివధనువు...
కుప్పయ్య బాలకృఘ్ణడైతే....వీణ - గోవర్థనం...
నారదుడు వొంగిచూస్తున్నాడు....
తుంబురుడు తొందిచూస్తున్నాడు....
మహతో - కళావతీ బిత్తరపోతున్నాయ్...
కచ్చపి - కరువుదీర నవ్వుకుంది!! - కడుపునిండిపోయింది శారదాదేవికి.
సంగీత విద్వాంసుల మొహాలు అల్లనేరేడు పళ్ళయిపోయాయ్! నల్లగా....
రసికుల వదనాలు పొద్దుతిరుగు పూలైపోయాయ్!! పచ్చగా...
కరతాళ ధ్వనులలో ఆస్థానం దద్దరిల్లిపోయింది!
వీణకుప్పయ్య కళ్ళలోంచి రెండు కన్నీటి బిందువులు వీణ తీగలమీద....ఊయలలూగాయ్....
రాజావారు పులకించిపోయరు!!
"పుంభావసరస్వతీ ........నీకిదే మా ఆహ్వానం....
మీరు మా ఆస్థాన విద్వాంసులైతే...మా జన్మ ధన్యం...
మిమ్మల్ని గౌరవించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి"
ఎంతో వినయంగా అడిగాడు మహారాజు....శిరసువొంచి.
మెల్లగా తలెత్తీ....సరే అన్నట్టు ఊపాడు....వీణకుప్పయ్య...
ఆస్థాన విద్వాంసుల తలలు శాశ్వతంగా వాలిపోయాయ్!!
వెంటనే దానశాసనం రాయించారు ప్రభువులు....
కపిస్థలం - అనేచోట ఎనభై ఎకరాల సుక్షేత్రమైన భూమి!!
నెలకి అరవై ’పొన్నాలు’ (పొన్న - అంటే తమిళంలో బంగారం బహుశ బంగారు నాణాలై ఉండొచ్చు)
వెండివీణ!!
No comments:
Post a Comment