Thursday, November 20, 2025

 *- గురువారం - అమావాస్యా_*

*_శ్లో𝕝𝕝 అమా సోమే తథా భౌమే గురువారే యదా భవేత్।_*
*_తత్తీర్థం పుష్కరం నామ సూర్యపర్వ శతాధికం॥_*

*తా𝕝𝕝 సోమవారం,* *మంగళవారం, గురువారాలలో ఏరోజు అమావాస్య వచ్చినా,               ఆ రోజున జరిగే స్నానం* *[‘పుష్కర-తీర్థస్నానం’అన్నట్లుగా] ఫలప్రదం.*
*అది సాధారణ సూర్యపర్వం {విషువ-అయనసంధి} కన్నా శతాధిక పుణ్యాన్ని అందిస్తుంది.*
 *కార్తిక అమావాస్య విశిష్టత*

*కార్తిక అమావాస్య నాడు పంచ పల్లవాలతో(రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి) అభ్యంగన స్నానమాచరించాలి. దీనిని పంచత్వక్ ఉదక స్నానం అని అం టారు. అశ్వయుజ, కార్తిక అమావాస్యల నాడు స్వాతి నక్షత్రం కలిసి ఉండే అవకా శం ఉంది కావున ఆశ్వయుజ అమావాస్య నాడు చేసే అన్ని విధులు కార్తిక అమావాస్య నాడు కూడా ఆచరించాలి. స్వాతి నక్షత్రం పాడ్యమి లేదా విదియ నాడు ఉన్నా అభ్యంగన స్నానమాచరించాలి. దారిద్ర్యాన్ని తొలగించుటకు లక్ష్మీపూజ చేయాలి.*
*స్వాతిసితేరవా విందుః యది స్వాతి గతో భవేత్ పంచత్వ గుదకస్నాయీ కృతాభ్యంగ విధిరః నీరాజితో మహాలక్ష్మీమ్ అర్చయన్ శ్రియమశ్నుతే*
*అనగా సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా లేదా చంద్రుడు స్వాతి నక్ష త్రంలో ఉండగా పంచత్వక్ ఉదకములతో అభ్యంగన స్నానమాచరించి లక్ష్మీ నారాయణులకు నీరాజనమిస్తే సంపదలు పొందుతారు. ఆశ్వయుజ కార్తిక ములే కాక ప్రతి అమావాస్య, సంక్రమణం నాడు అభ్యంగన స్నానం ఆచరించి రోజంతా ఉపవసించి శక్తి మేర దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఈయవలెను. ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో, ఇంటిలో, దేవతా వృక్షాల వద్ద, కూడళ్ళలో దీపాలు వెలిగించి బ్రాహ్మణులను, పెద్దలను పూజించి భోజనం చేయాలి.*

*హేమాద్రి పురాణానుసారం సూర్యుడు తులా రాశిలో ఉన్న ప్పడు ప్రదోషసమయాన దివిటీలతో, ఆకాశదీపాలతో పితృదేవ తలకు దారి చూపాలి. అలాగే ఆశ్వయుజ, కార్తిక అమావాస్యల నాడు రాత్రి నిద్రించరాదు. ఆ రోజు అర్థరాత్రి లక్ష్మీదేవి పురవీధులలో ఆకాశమార్గమున సంచరిస్తూ ఉంటుంది కావున ఇంటి వాకిలి లో, ఇంట్లో ముగ్గులు, తోరణములు, దీపాలతో అలంక రించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ స్తోత్రాలు, పూజ లు చేయాలి. ఈవిధంగా చేయని వారింటికి లక్ష్మీదేవి చేరదని పురాణ వచనం. అమావాస్య అపర రాత్రి దాటిన పిదప అనగా బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిపత్ స్పర్శతో జను లు డప్పులతో అలక్ష్మి (దారిద్య్రం)ని తరిమి వేయాలి...*

No comments:

Post a Comment