Monday, November 24, 2025

 తొలిపొద్దు కిరణంలా,
 జీవితానికి నాంది వారే,
నిశ్శబ్దపు చీకటిలో ప్రేమ
 గాఢత వారే...

నిద్ర నీడల మధ్య మృదువైన మేల్కొలుపు
 వారే...

గదిమూలల్లో వెలిగే జ్ఞాన
 దీపం వారే...

చీకటి భ్రమల్లో మనం
 తప్పిపోతున్న వేళ...
వెలుతురు ప్రవాహమై
 దారి చూపింది వారే....

మనసు అంధకారంలో
 అల్లాడుతున్నప్పుడు..
స్వచ్ఛమైన అంతరాత్మ ప్రతిబింబం వారే....

జననం – మరణం 
చక్ర భ్రమణంలో...
ఆశీస్సుల వానై దాహం
 తీర్చింది వారే...

బాధల అంచుల్లో
 ఆనందపు మొగ్గ దాచే..
నిత్యం మనకొరకు... జీవించే దేవతలు వారే...


'తనవాడా 
 పరాయివాడా' 
విభేదం లేని ప్రేమ..

హృదయాన్ని సహస్రపద్మమై వికసింపజేస్తుంది.
కన్నులలో కనిపించే ప్రతి
 బింబం...
మన భవిష్యత్తుకు
 శుభప్రకాశం...

ప్రపంచం కొత్తదై,
 శోభాయమానమై
 కనిపించడానికి....
వారి త్యాగమే శాశ్వతపు
 ఆధారం...

 ఆ కాంతి చేరని
 మనసు....
ఎన్నటికీ చీకటిలోనే
 తప్పిపోయినట్టే..

తల్లిదండ్రుల అమృత
 హృదయం...
మన జీవితానికి ఎన్నటికీ
 ఆగని వెలుతురు.
Bureddy blooms.

No comments:

Post a Comment