మానవ సంబంధాలు అన్ని ట్రాష్ |#trending #society #motivation #motivational #viral #relationship
https://youtube.com/shorts/ze1HKdOcB8g?si=FC9qLiJawvndPTJO
హాయ్ అండి మానవ సంబంధాలన్నీ వేటి మీద ఆధారపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మానవ సంబంధాల్లో ఆత్మీయత అనుబంధం ఇవన్నీ ఉట్టి నాటకమే అండి మానవ సంబంధాలు అన్నవి వారి అవసరం మీద ఆధారపడి ఉంటాయి. ఒకరికొకరు నాటకం ఆడుకుంటూ బతుకుతారు అంటే ఒకరికొకరు మోసం చేసుకుంటారు ఒకే ఇంట్లో ఉండి ఎవరి అవసరాలకి వాళ్ళని యూస్ చేసుకుంటూ ఉంటారు. మీరు గమనించండి ఎవరి ఇంట్లో వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసుకోండి ఎందుకు అంటే ఈ రోజు ఇదేం కొత్తఏం కాదు ఇదివరకు చాలా ప్యూరిటీ ఉండేది నిదానంగా కాలక్రమేన అది తగ్గుతూ వచ్చింది అన్నమాట అందుకనే చూసారా తల్లిదండ్రులు అవసరం అయ్యాక పిల్లలు వాళ్ళని వదిలించుకోవడానికి చూస్తారు వృద్ధాశ్రమాలు ఎక్కడ ఉన్నాయో చూస్తారు ఏమని అంటే మేము అవసరానికి నెల నెల డబ్బు పంపుతున్నాం వాళ్ళ అవసరాలు చూస్తున్నాం కావాలంటే ఒక పని మనిషిని పెట్టాం అంతకీ చేయలేకపోతే వృద్ధాశ్రమాలకి పంపుతున్నాం కదా అక్కడ సేఫ్ గా ఉన్నారుగా మా మీద వాళ్లే బాగా చూస్తున్నారుగా అని చెప్పి అదే కరెక్టు అని ఒక వింతగా మాట్లాడుతూ అందులోనే నిజం ఉంది అని అందరిని నమ్మిస్తున్నారు. వాళ్ళ ద్వారా మిగతా తల్లిదండ్రులను కూడా వదిలించుకుందాం అనే ప్రయత్నం అన్నమాట ఇది ఒక తల్లిదండ్రులు బిడ్డలే కాదండి ఏ రిలేషన్ అయినా అంతే భార్య భర్త తల్లిదండ్రులు ఇంకా బయట రిలేషన్ అయితే మరీ ఘోరం అన్నీ ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి మానవ సంబంధాలు అన్నవి వారి అవసరం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఒకరినొకరు ఉపయోగించుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటారు. చివరికి ఆఖరి రోజుల్లో చూస్తే అంతా మోసమే అని అప్పుడు అర్థంవుతుంది మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు
No comments:
Post a Comment