Thursday, November 20, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

     మహర్షి వేకువజామున మూడు గంటలకు  తాను కూర్చున్న సోఫాలోంచి లేచి కొద్దిగా తేలిక పడిన తర్వాత కూరలు తరిగేవారు. 

   తరువాత వంట గదిలోకి వెళ్ళి ఆనాటి వంటకు కావలసిన పదార్థాలు తయారు చేసేవారు. సరైన పద్ధతిలో ఒకే వేగంతో దంచేవారు. కొన్నిసార్లు ఉప్మా తానే చేసేవారు. అది ఎంతో రుచిగా ఉండేది కూడా.

   ఎండాకాలం వంటింట్లో ఎంతో ఉక్కగా ఉండేది. ఎవరైనా మహర్షికి తాటాకు విసనకర్రతో విసిరితే “నీకే చెమట పడుతొంది; మొదట నువ్వు
విసురుకో!” అని సెలవిచ్చేవారు. 

    కూరలు తరిగినప్పుడు ముక్కలన్నీ ఒకే పరిమాణంలో ఉండేవి. ఒక్కో కూరకు ఒక్కో విధమైన తయారీ విధానం సెలవిచ్చేవారు. ఏదీ వృథా చేసేవారు కాదు. కూరలో ప్రతి అణువు వంటలో ఏదో విధంగా ఉపయోగించేవారు మహర్షి.

No comments:

Post a Comment