Thursday, November 20, 2025

 💐13శ్రీలింగమహాపురాణం💐

🌼యోగ సిద్ది అవరోధాలు  పంచ తత్త్వాల యోగ సిద్ది శక్తులు🌼

    #పదమూడవ భాగం#

సాధకుడు పట్టుదలతో ధృడ నిశ్చయంతో యోగాభ్యాసం చేయగలిగితే అవరోధాలు తొలగిపోతాయి.  కానీ యోగ సిద్ది రూపములో మరికొన్నిఅవ రోధాలుఏర్పడతాయి.ఈసిద్ధులు ఆరు విధాలుగా ఉంటాయి. 1) ప్రతిభ 2)శ్రవణము 3)వార్త 4)దర్శనము 5)ఆస్వాదము 6) వేదన. ఈ సిద్దుల ప్రభావం తగ్గించుకుంటూ వాటిని వదలివేయగలిగితే మంచి పరిణామం సిద్దిస్తుంది.

మస్తిష్కం ద్వారా గ్రహించే లేక అర్థం చేసుకునే శక్తిని ప్రతిభ అంటారు. మస్తిష్కానికి గల యుక్తాయుక్త జ్ఞాన శక్తిని బుద్ధి అంటారు.  ప్రతి సమయంలో, స్థానములో సూక్ష్మమైన లేక నిగూఢంగా ఉన్న, దూరంగా గానీ లేక దగ్గరగా గానీ ఉన్న భూత భవిష్యత్తు కాల జ్ఞానాన్ని ప్రతిభ అంటారు.

వినినంత మాత్రానే ఏ శ్రమ లేకుండా అన్నింటిని గ్రహించు శక్తిని శ్రవణము అంటారు. ఎట్టి సంపర్కం లేకుండా వాస్తవాన్ని గ్రహించే స్పర్శజ్ఞానము వేదన అనబడుతుంది. ఎటువంటి శ్రమ లేకుండా దివ్య రూపాన్ని దర్శింప కలుగుటను  దర్శనము అనబడుతుంది. ఎట్టి ప్రయాసపడకుండా దివ్య రసమును గ్రహించు శక్తి ఆస్వాదము అవుతుంది. 
దివ్య గ్రంధములను, సూక్ష్మతత్త్వములను గ్రహించగలిగే బుద్ధి యొక్క శక్తిని వార్త అంటారు.

యోగులైనవారు బ్రహ్మాండములకు గల అన్ని లోకముల గురిచిన జ్ఞానము పొందగలరు. ఈ విశ్వంలో గల చతుష్షష్టి అనగా అరవైనాలుగు గుణాలు జీవుని శరీరములో నివసిస్తున్నాయి. వీటిలో ఔపసర్గిక గుణాలను యోగి త్యాగము చేయాలి. అలాగే పైశాచిక క్షేత్రంలో పృథ్వీ సంబంధ గుణాలను, రాక్షస క్షేత్రంలోజలసంబంధగుణాలనుయక్ష క్షేత్రంలో అగ్ని సంబంధ గుణాలను, గంధర్వ క్షేత్రంలో శ్వాస సంబంధ గుణాలను, ఇంద్ర క్షేత్రంలో వ్యోమ సంబంధ గుణాలను, చంద్ర క్షేత్రంలో మనస్సు సంబంధ గుణాలను, ప్రజాపతి క్షేత్రంలో అహంకార గుణాలను, బ్రహ్మ క్షేత్రంలో బుద్ధి సంబంధ గుణాలను పరిత్యజించాలి.

పృథ్వీ క్షేత్రంలో ఎనిమిది, జల క్షేత్రంలో పదహారు, ఆగ్ని క్షేత్రంలో ఇరవైనాలుగు, వాయు క్షేత్రంలో ముప్పై రెండు, ఆకాశ క్షేత్రంలో నలభై గుణాలు ఉన్నాయి. ఈ ఐదింటి సూక్ష్మ తత్త్వాలైన గంధ రస వర్ణ స్పర్శ శ్రవణములు ఎనిమిది రకాలుగా ఉద్భవిస్తున్నాయి.

చంద్ర క్షేత్రంలో నలభై ఎనిమిది, ప్రజాపతి క్షేత్రంలో యాభైఆరు, బ్రహ్మ క్షేత్రంలో అరవైనాలుగు గుణాలు ఉన్నాయి. యోగులు యోగము ద్వారా అన్ని క్షేత్రములలో గల ఈ అడ్డంకులను తెలుసుకుని వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది.  
ఇక యోగ సిద్దులను గురించి చెబుతాను. 

భూమికి సంబంధించిన పార్ధివ యోగ సిద్దులు ఎనిమిది విధములుగా ఉంటాయి. 1)స్థూలత  2)హ్రస్వత (తేలికతనం) 3) బాల్యము 4)యౌవనము 5)వృద్ధాప్యము 6)ఇచ్ఛానుసారం రూపధారణ 7) పృథ్వీ తత్త్వము లేకుండా నాలుగు తత్త్వముల శరీరధారణ చేయుట 8)నిరంతరం సుగంధము ధరించి ఉండుట

జల (అవ్య) సంబంధమైన యోగ సిద్దులు షోడశములు అంటే పదహారు ఉంటాయి.  పైన చెప్పిన పృథ్వికి సంబంధించిన ఎనిమిది సిద్దులతో పాటు 9)కోరుకున్నంత కాలము నీటిలో ఉండుట 10)ఇచ్ఛానుసారం నీటి నుంచి బయటకు రాగలుగుట 11)సముద్రమంత నీరు కూడా ఎట్టి కష్టము లేకుండా త్రాగగలుగుట 12) కోరిన చోట నీటిని ఉద్భవింప చేయుట 13) తినదలచుకన్న వస్తువుని రుచికరముగా మార్చుకొనుట 14) అగ్ని వాయు ఆకాశమనే మూడు తత్త్వములను మాత్రమే శరీరధారణ చేయుట 15) చేతుల్లోనే అనంత జలరాశిని ధరించుట 16) గాయాలు, కోతలు లేని శరీరధారణ చేయుట అనేవి జలతత్త్వానికి సంబంధించిన పదహారు సిద్దులు 

తైజస (అగ్ని) సంబంధ యౌగిక సిద్దులు ఇరవై నాలుగు. పృథ్వీ, జల సిద్దులు పదహారు సిద్దులతో పాటు అగ్ని సిద్దులు ఎనిమిది.

17) శరీరము నుంచి అగ్నిని ఉత్పత్తి చేయు శక్తి 18) అగ్ని వలన ఉత్పన్నమయ్యే వేడిని తట్టుకునే  శక్తి 
19) ప్రపంచమంతా కాలిపోయినా కోరిన వస్తువు కాలిపోకుండా ఉంచగలిగే శక్తి 20) నీటిలో అగ్నిని ఉంచగలిగే శక్తి 21) అగ్నిని అరిచేతులలో ధరించగలిగే శక్తి 22)తలచినంత మాత్రాన అగ్నిని పుట్టించ గలిగే శక్తి 
23) మొత్తం కాలి పోయిన తరువాత బూడిద నుంచి తిరిగి వస్తువుని పునఃసృష్టి చేయగలిగే శక్తి  24) పంచ తత్త్వాలలో వాయువు, ఆకాశం వదలి మిగిలిన మూడు తత్త్వాల  శరీర ధారణ చేయగలిగే శక్తి.

మిగిలిన వాయు ఆకాశ తత్త్వాల యోగ సిద్దుల శక్తులు

తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment