🙏 *రమణోదయం* 🙏
*"ఈ దేహమే నేను" అనే అహంభావమే సకల సంసార దుఃఖాలకు మూలం. కనుక "దేహమే నేను" అనే ఈ మిథ్యాభావాన్ని పోగొట్టాలి. అందుకు ఆత్మవిచారణ ఒకటే సరియైన సాధన. ఇక ఏ ఇతర సాధన అయినా వృధా శ్రమయే అవుతుంది. అందువల్ల వాటిని అనుసరించవద్దు.*
నిశ్శబ్దమే భగవాన్ సన్నిధి.
మౌనమే భగవాన్ స్వరూపం.
అన్ని విద్యలలోకీ ఆత్మవిద్య అత్యంత సులభమైనది
ఎందుచేత? ఇతర విద్యలకు తెలుసుకునేవాడు,
తెలుసుకోబడేది, తెలుసుకోడం అనే మూడింటి
అవసరమున్నది..ఆత్మ విద్యకు అట్టిదేమి అక్కర్లేదు
తాను తానై ఉండడమే కావలసినది.
తనకంటే ప్రత్యక్ష విషయం తనకు ఏముంటుంది?
కనుక, అది అత్యంత సులభం.
'నేను ఎవరిని?' అని విచారణ చేసుకోడం మాత్రమే
ఇచ్చట అవసరం!
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.846)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌷🌹🌷🌹🌷🌹🌷
No comments:
Post a Comment