Thursday, November 27, 2025

ఇది అలవాటు చేసుకున్న వాడు ఏం పలికితే అది సత్యం అవుతుంది | Chaganti Koteswara Rao Speech

ఇది అలవాటు చేసుకున్న వాడు ఏం పలికితే అది సత్యం అవుతుంది | Chaganti Koteswara Rao Speech

https://youtu.be/CXmmKbIGUw0?si=G5egvPmbPFUuqQq7


Default Title
https://www.youtube.com/watch?v=CXmmKbIGUw0

Transcript:
(00:00) టెలిఫోన్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి నేను అమెరికాకి రష్యాకి ఫోన్ చేసి మా బంధువులతో మాట్లాడి ఎవరుని చూడలేదు కదా అనుకుంటే వాళ్ళ వ్యవస్థ వాళ్లకు ఉంది వాళ్ళన్నీ గుప్తంగా రాసుకొని బిల్లు పంపిస్తారు నేను ఎప్పుడు మాట్లాడానండి అని దబాయిస్తే ఏ రోజున ఏ ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు నువ్వు మాట్లాడావో లెక్క కూడా చూపిస్తారు.
(00:21)  మనం పెట్టుకున్న వ్యవస్థలోనే నేను పెట్టుకున్న టెలిఫోన్ లోనే నేను ఎవరితో ఎన్ని నిమిషాలు మాట్లాడుతాను మాట్లాడుతున్నానో లెక్క కట్టగలిగినటువంటి యంత్రములు ఉంటే ఈశ్వరుడు ఇంత గొప్ప మనుష్య జన్మ ఇచ్చి స్వరపేటిక ఇచ్చి నేను దేనికి వాడుతున్నానో కనిపెట్టలేనంత అమాయకుడు కాడు ఆయన లెక్కలోకి తీసుకోడు ఎందుకురా నీకు స్వరపేటిక ఎవరిని ఉద్ధరించావ్ ఎవరు సంతోషించడానికి మాట్లాడావు ఎందుకు నీకు ఆ స్వరపేటిక అది లేని జన్మలోకి పో ఏమైపోతుంది జీవితం అందుకే వాక్ వాక్కు మీద నియమం అత్యంత ప్రధానం వాక్కులో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఎవరు ఏది మాట్లాడినా మనసుని వాక్కుని సమన్వయం చేసి
(00:59) మాట్లాడడం అలవాటు చేసుకుంటాడో అటువంటి వాడు ఏది మాట్లాడతాడో అది సత్యం అవుతుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను అన్న మాట సత్యాన్ని పలకడం ఒకెత్తు ఆయన మాట్లాడినది సత్యం అవ్వడం ఒకఎత్తు ఆయన మాట్లాడినది సత్యమైనది ఆయన యోగి అని గుర్తు అనేన ఇజ్జతే ఇతి యోగః అని పతంజలి యోగభాష్యం అన్నిగా కనపడేవి ఒకటిగా మారిపోతే యోగి యోగము అని పిలుస్తారు యోగి నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి మనసులో ఒకటి వాక్కు చేత ఒకటి ఉండవు మనసులో ఏముందో అదే వాక్ రూపంలో వస్తుంది.
(01:44)  అలా మాట్లాడిన కారణం చేత ఆయన వాక్కుకి ఒక శక్తి వస్తుంది. ఏమిటి ఆ శక్తి అంటే ఆయన నోటి వెంట ఏది అన్నాడో అది సత్యం అవుతుంది ఎలా అంటే ఈశ్వరుడు దాన్ని సత్యం చేస్తాడు. అందుకే భక్తుల జోలికి వెళ్ళవద్దు అనడానికి కారణం ఏమిటంటే మన మనసుకి ఖేదం కలిగింది అనుకోండి ఒక మాట అన్నారు అనుకోండి అది నిజం అవుతుంది లంక ఎందుకు కాలిపోయిందో తెలుసా రావణుడు ఎందుకు నశించిపోయాడో తెలుసా హనుమ యోగిగా కూర్చుని ఒక మాట అన్నారు ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషంబోనితనః నియమస్తిపురం లంకానయయం నచరాక్షసః అస్మాదవాకు నాధేన బద్ధం వైరం మహాత్మ అన్నారు ఇచ్వాకునాధుడైన రాముడితో మీరు
(02:30) వైరం పెట్టుకున్నారు ఈ లంక ఉండదు కాలిపోతుంది రాక్షసులు ఉండరు ఎవ్వరు ఉండరు సుగ్రీవుడు వస్తాడు వానరులు వస్తారు మీరు నశించిపోతారు అన్నారు ఆయన వాక్కు నిజమైపోయింది అందుకు సుందరకాండది యోగి పలికినది సత్యము కాదు యోగి పలికినది సత్యమయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడిని ఆయన దీర్ఘాయుష్మాన్భవ అన్నాడు అనుకోండి ఆయన నోటి మాటగా అనలేదు ఆయన మనసు వాక్కు ఏక ఏకమై అంటాడు దీర్ఘాయుష్మాన్భవ అన్నాడు ఆయన దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు ఇప్పుడు ఆయన ఏది మాట్లాడాడో అది సత్యం అయిపోతుంది. ఆయన సత్యం మాట్లాడాడని
(03:09) అనకూడదు అప్పుడు వాక్కు యందు ఎవడు అటువంటి నియతి పాటించాడో వాడు అంత స్థితికి వెళ్ళిపోతాడు. అది ఈ దేశం నిరూపించింది ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడ ఉంది అంటే అటువంటి మహాత్ములు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఉపకరణములను అలా ఉపయోగించి అంత గొప్ప స్థితికి ఎదిగారు ఈ దేశ ప్రతిష్ట ఐశ్వర్యము చేత కాదు ఈ దేశానికి గౌరవం అంతా కూడా మహాత్ములైన యోగుల వలన భక్తుల వలన ఋషుల వలన వచ్చింది.
(03:38)  అందుకే మీరు చూడండి తిరుక్కడయూర్ అని ఒక క్షేత్రం ఉంది ద్రవిడి దేశంలో ఇప్పటికి షష్టి పూర్తి చేస్తూ ఉంటారు అక్కడ అక్కడ అభిరామ భట్టు అని ఒక మహాభక్తుడు ఆయన అభిరామి అంటారు అమ్మవారిని అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఉండేవాడు ఆయన మహాభక్తుడు అని చెప్పారు సర్ఫోజీ మహారాజ్కి మీరు ఇప్పటికీ తంజావూరు వెళ్లి ఆ మహారాజు గారు సేకరించిన గ్రంథాలు చూస్తే తెల్లపోతారు కొన్ని వేల గ్రంథాలు సేకరించాడు సరస్వతీ మహల్ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఆయనవి ఇన్ని పుస్తకాలు సేకరించాడో ఓ మహానుభావుడు ఆయనకి కబురు అందింది అంతటి మహాభక్తుట ఆలయ ప్రాంగణంలో కూర్చుంటాట అని చూడాలని
(04:17) వచ్చాడు ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు అభిరామభట్టు లోపలికి వెళ్ళిపోతూ గుడిలోకి అర్చకులు ఎదురు వచ్చారు పూర్ణకుంభం పెట్టారు వెళ్తున్నాడు వెడుతూ వెడుతూ యోగంలో మంచి ధ్యానంలో ఉన్న ఆయన్ని చూశడు ఇతను ఎవరని అడిగాడు లేచి నిలబడలేదు మహారాజు వస్తే చంపేస్తాడేమో ధ్యానంలో ఉన్నాడంటే నమ్మడేమో అని వాళ్ళ అన్నారు ప్రభువు ఉన్మాది మత్తు పదార్థాన్ని సేవించాడు అందుకని అలా ఉంటాడు అన్నారు ఓహో అని రాజు లోపలికి వెళ్ళాడు పూజ చేశడు బయటికి వచ్చాడు ఆయన అలాగే ఉన్నాడు కొద్దిగా కదపండి అన్నాడు కదిపాడు ఆయన బహిర్ముఖుడుఅయ్యాడు ఆయన లోపల అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు
(04:57) అమ్మవారి ముఖం పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉంటుంది లలాటం లావణ్యదతి విమల మాభాతితవయత్ ద్వితీయం తన్మన్ ఏమకుటతం చంద్రశకలం అంటారు శంకర భగవత్పాదులు పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉన్న అమ్మవారి ముఖాన్ని ధ్యానం చేస్తున్నాడు. తట్టి లేపేటప్పటికి అకస్మాత్తుగా బహిర్ముఖుడు అయ్యాడు ఇలా తలెత్తి చూసాడు రాజుగారు ఉన్నారు ఇవాళ తిధి ఏమిటి అన్నాడు రాజుగారు అప్పటివరకు మనసులో పౌర్ణమినాటి చంద్రబింబంలా ఉన్న అమ్మవారి ముఖాన్ని చూస్తున్నాడు కదు పౌర్ణమి అన్నాడు మహారాజు అన్నాడు రాత్రి చీకటి పడ్డాక వస్తాను ఆకాశంలో చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు
(05:36) తప్పకుండా నేను చూపించడం ఏమిటి చంద్రబింబం అదే ఉంటుంది అలాగే వస్తానని వెళ్ళిపోయాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడావురా మాట్లా మాట్లాడకుండా ఉంటే గొడవ వదిలిపోయేది ఇవాళ అమావాస్య ఎక్కడ తీసుకొస్తావు పౌర్ణమి చంద్రబింబాన్న అన్నారు నేను ఏ పరదేవత యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తూండగా నాకు మహారాజు వచ్చి కనపడి పలకరించి మాట్లాడిన చేత పౌర్ణమి అని అనిపించాడో ఆ పరదేవతయే ఇవ్వాళ పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని ఆకాశంలో చూపిస్తుంది.
(06:06) అని సాయంకాలం వేళ ఆయన సంధ్యావందనం చేసుకొని కూర్చుని అంత్యాది లోప అభిరామ అంత్యాది అంటారు ఇప్పటికి మనకి కంచిలో కామాక్షి దేవి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంటుంది ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతోటే మళ్ళీ మొదలు పెట్టాలి ఆ అభిరామి అంతా అది చెప్తున్నాడు ఆయన చీకటి పడింది మహారాజు వచ్చాడు ఏది చంద్రబింబం అన్నాడు ఆయన ఇలా అన్నాడు అటు తిరిగి చూసాడు అమావాస్య చంద్రబింబం ఉండడానికి అవకాశం లేదు అమ్మవారు చూసింది ఆయన అన్న మాట మాట అసత్యం అవ్వడానికి వీలు లేదు యోగి ఆయన అన్న మాట సత్యం అవ్వాలి వెంటనే తన చెవికి ఉన్నటువంటి కుండలాన్ని తీసి ఆకాశంలోకి
(06:43) విసిరింది అది పౌర్ణమి నాటి చంద్రబింబంగా కాంతులని కాంతులీనగానే తెల్లబోయి మహారాజు ఆయన కాళ్ళ మీద పడ్డాడు యోగి నోటి వెంట వచ్చినటువంటి వాక్కు సత్యమయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు అందుకే వాంగ్ నియమమును పాటించిన వాడు ఎవరో వాక్కుని పలికేటప్పుడు అంత జాగ్రత్త జాగ్రత్త పాటిస్తూ అసత్యము నోటి వెంట రాకుండా మనసు వాక్కు రెండు ఏకీకృతం అయ్యేటట్టుగా చూసుకుంటున్న వాడు ఎవరో అటువంటి వాడు పలికినటువంటి వాక్కు ఎన్నడూ హింస కిందకి రాదు ఎందుకని అంటే ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు ఆయన అభిప్రాయంగా చెప్పాడు అది ఉద్ధరణ కొరకు చెప్పాడు తప్ప ఇతరులను బాధ పెట్టడానికి రాదు అది కాబట్టి
(07:30) ఆ వాక్యము అసత్యమని కానీ ఆ వాక్యము దుర్బుద్ధితో కూడుకున్నదని కానీ హింసకు కారణం అని కానీ సిద్ధాంతీకరించడానికి వీలు లేదు. అది హింసా దోషంలోకి రాదు సరి కదా ఆయన అన్నమాట సత్యం అయిపోతుంది ఆయన యోగి అయితే కాబట్టే మీరు చూడండి ఒక్కొక్క చోట వాక్కు చేత హింస చేసి అహింసగానే నిలబెట్టాడు పరమాత్మ అత్యంత క్లిష్టమైన ఘట్టాలు అవి ఆ పురాణాల్లో మహాభారతంలో ద్రోణాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు.
(08:02) సాక్షాత్తుగా పాండవులకు కౌరవులకు గురువైన ఆయనే విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరు నిలబడలేకపోయారు ఆఖరికి అత్రి వశిష్టుడు విశ్వామిత్రుడు అలాగే భరద్వాజుడు ఇటువంటి మహర్షులందరూ బయలుదేరి తేజోరూపాల్లో వచ్చి ద్రోణాచార్యులు వారికి ఎదురుగుండా నిలబడ్డారు. ద్రోణాచార్య నువ్వు పుట్టుక చేత బ్రాహ్మణుడవు శాస్త్రాన్ని పది మందికి చెప్పవలసిన వాడివి నువ్వు వధ చేయకూడదని క్షత్రియుడు చేయాలి నువ్వు ధనస్సు పట్టుకున్నావు నువ్వు బాణాలు పట్టుకున్నావు పట్టుకొని నువ్వు అవతల దుర్యోధనుడి పక్షాన నిలబడి ధర్మ పక్షమైన పాండవుల అందరినీ కూడా చిరిగేస్తున్నావ్
(08:42) ఇలాగైతే ధర్మం ఎలా నిలబడుతుంది నీకు అవసాన కాలం ప్రాప్తించింది నీ శరీరం పడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది ఇప్పటికైనా ధనుర్బాణాలు విడిచిపెట్టేయ్ జరిగింది జరిగింది చేతిలో ధనుర్బాణాలు పట్టుకొని శరీర త్యాగం చేయకు బ్రాహ్మణునికి ఉండవలసినటువంటి లక్షణానికి వ్యతిరేకమైన లక్షణంలో ఉన్నవాడివ అవుతావు విడిచిపెట్టేసేయ అన్నారు.
(09:02)  ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు విడిచిపెట్టలేదు ఎంత దారుణమైన యుద్ధం చేశడని మహాభారతంలో చెప్పారంటే అరగంట గంట సమయంలో 21 వేల మంది యోధుల్ని తెగటార్చాడు.పవేల పవేల ఏనుగుల్ని పడగొట్టాడు కొన్ని వేల గుర్రాలని పడగొట్టాడు ఆఖరికి తన ఎదురుగుండా వచ్చి నిలబడినటువంటి దుష్టజుని యొక్క రథాన్ని కూడా తుత్తునియలు చేస్తే భీముడు వచ్చి రథం ఎక్కించుకు తీసుకెళ్లవలసి వచ్చింది అంత భయంకరమైన యుద్ధం చేసేస్తున్నాడు ధర్మం నిలబడాలి అధర్మం పోవాలి అధర్మ పక్షాన్ని ద్రోణాచార్యుల వారు కాపు కాసేస్తున్నాడు ఆయనని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు కానీ ధర్మమునందు ఆయనకి పక్షపాతం ఉంది
(09:41) అందుకే భీష్మ భీష్ముడి దగ్గరికి మొట్టమొదటి రోజు యుద్ధంలో ధర్మరాజు వెళ్లి నమస్కారం చేయగానే భీష్ముడు ఒక మాట అన్నాడు నువ్వు ఇలా నమస్కారం చేసి ఉండకపోతే నీకు జయం కలిగేది కాదు అన్నాడు. తాతా మీరు అవతల వైపు నిలబడి యుద్ధం చేస్తుంటే నాకు జయం ఎలా వస్తుంది అన్నాడు భీష్ముడు నవ్వి అన్నాడు అప్పుడు ఎందుకులే నా యుద్ధం నీకుంత భరించలేనిది అయినప్పుడు నన్ను కలు నేను పడిపోయే మార్గం చెప్తాను అన్నాడు.
(10:10)  అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి తను పడిపోయే మార్గం తానే చెప్పాడు మరి కౌరవుల వైపు ఎందుకు ఉండాలి ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఇప్పుడు మారిపోయి ఇంకో చోటికి వెళ్ళిపోడు ఆయన అది వాళ్ళ నైతిక ధర్మం అది వాళ్ళ గొప్పతనం ఇవ్వాళ ఇక్కడ అనుకూలంగా లేదని ఇది వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం వాళ్ళకి చేత కాలేదు పాపం వాళ్ళ ధర్మం అటువంటిది అందుకని వాళ్ళు అలాగే నిలబడిపోయారు.
(10:30) ద్రోణాచార్యుల వారు ఆయనే చెప్పుకున్నాడు ఒరేయ్ నా చేతిలో ధనుర్బాణాలు ఉండగా ఎవరు నన్ను నిగ్రహించలేరురా దేవతలు రాక్షసులు వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినా నన్ను తెగతార్చలేరు సాధ్యం కాదు తుత్తునియలు చేస్తారు నేను ధనుర్బాణాలు విడిచిపెట్టడం అంటే సాధ్యం కాదు ఎవరు నా చేత విడిచిపెట్టేటట్టు చేయలేరు ఒక్క కారణానికి విడిచిపెడతారు సత్యవ్రతం కలిగి అబద్ధమాడనటువంటి వ్యక్తి పరమ దారుణమైనటువంటి అమంగళకర వార్త చెప్తే అప్పుడు బాధతో వదిలి పెట్టేస్తాను అప్పుడు నన్ను కొట్టేయచ్చు అందుకే ఆయన అంత యుద్ధం చేసేస్తున్నాడు ధర్మ పక్షం పోవడానికి వీలు లేదు భగవానుడు
(11:12) కృష్ణుడు ఉన్నాడు అక్కడ గబగబా వచ్చి ధర్మరాజు గారితో ఒక మాట అన్నాడు ఇంకొక్క అరగంట సేపు కానీ ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తే నీ వైపు ఎవరైనా మిగులుతారని హామీ ఇవ్వడం చాలా కష్టం ఇక ఎవరు మిగలరు ఈ మాట అన్నది ఎవరో తెలుసా అండి సాట్ సాక్షాత్ కృష్ణ భగవానుడు ఏమని చెప్పాడంటే మములీతని ఒప్పింపక సముచితముగా కాచికొనుము అసత్య అసత్య వచన దోషము లేదు ప్రాణ రక్షణ సమయమునన్ అతని కొడుకు చచ్చెనోనుమి అన్నాడు ప్రాణాన్ని రక్షించుకోవడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి వాక్కులో దోషం వస్తే ఇబ్బంది లేదు ఈయన పరమ అమంగళకరమైన మాట ఏదైనా వింటే తప్ప విడిచిపెట్ట ధనస్సు
(12:00) బాణాలు అలా విడిచిపెట్టితే తప్ప చంపలేం అలా ఆయన చచ్చిపోతే తప్ప ధర్మం నిలబడదు మీ పక్షం నెగ్గదు నెగ్గకపోతే అధర్మం నిలబడిపోతుంది అధర్మం నిలబడిననాడు అర్థం లేదు ఇంకా అసలు ఈశ్వరావతారానికే అర్థం లేదు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పైగా ఈయన యందు దోషాలు ఉన్నాయి ఇది కృష్ణుడు అక్కడ చెప్పిన మాట కాదు బ్రాహ్మణుడై ఉండి అస్త్రం పట్టుకుంటున్నాడు బ్రాహ్మణుడై ఉండి శస్త్రం పట్టుకుంటున్నాడు బ్రాహ్మణుడై ుండి నిండు సభలో తెలిసి కూడా ఒకనాడు ధర్మ సూక్ష్మం చెప్పకుండా మౌనం పాటించాడు.
(12:32) ఇన్ని దోషముల చేత ఇతను పడిపోవలసిందే కాబట్టి ఒక్క అబద్ధం చెప్పు ఈయన కొడుకు అశ్వద్ధామ మరణించాడుఅని చెప్పు అతను వెంటనే అమంగళకరమైన వార్త వింటే చాలా బాధపడిపోయి ధనుర్బాణాలు వదిలేస్తాడు ఒక్కసారి వదిలిపెట్టాడు ఆ అర్జునుడు చాలు బాణం వేసేస్తాడు అర్జునుడు అంగీకరించలేదు వాళ్ళ గురుభక్తి అటువంటిది గురువు అంటే ప్రాణం అర్జునుడికి ఒక్కనాటికి అంగీకరించాను గురువుగారిని అలా పడగొట్టడానికి వీలు లేదు అన్నాడు గెలుప వస్తే వచ్చింది పోతే పోయింది గురువుగారిని అలా పడగొట్టడం నేను అంగీకరించాను.
(13:07) భీమసేనుడు అన్నాడు కృష్ణుడు చెప్పింది సత్యం ధర్మము నిలబడాలి ఇవాళ గురుభక్తి మంచిదే కానీ గురువుగారు దోషభవిష్టమైన నడవడిలో ఉన్నారని మనం చెప్పకూడదు కానీ ధర్మం నిలబడాలంటే ఇదొక్కటి వినా మార్గం ఇంకోటి లేదు ఆయన నిగ్రహించలేము కాబట్టి చెప్పవలసిందే పోనీ ఇది సత్యం అయ్యేట్టు చేయమంటావా అదిగో అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి ఇంద్రచండు మహారాజు ఉన్నాడు ఆయన యొక్క ఏనుగు ఉంది దాని పేరు అశ్వద్ధామ దాన్ని గలబెట్టి కొట్టి చంపేస్తాను అశ్వద్ధామ హతః అను అశ్వద్ధామ చ్చిపోయాడు ఏనుగు చచ్చిపోయిందిగా అబద్ధం ఎక్కడ అన్నావు అలా అను అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నాడు మనసులో అది కాదని
(13:46) తెలుసుగా అశ్వద్ధామ చచ్చిపోయాడు అని నాకే నమ్మకం లేదుగా ఏనుగు చచ్చిపోయిందని నాకు తెలుసు ఏనుగు చచ్చిపోయిందని తెలిసి అశ్వద్ధామ హతః అని ఆయనకి వినపడేటట్టుగా అన్న వాళ్ళ కొడుకు చచ్చిపోయాడని వినపడేటట్టుగా అబద్ధం కదు అసత్యం కదు నేను అలా చేయలేదే ఈ తప్పు పూర్వం అలా ఎలా చేస్తాను అన్నాడు ఇక్కడ కృష్ణుడికి ఎలా ధర్మ పక్షాన్ని నిలబెట్టడం ఒక నిమిషానికి వేల మందిని పడగొట్టేస్తున్నాడు ద్రోణుడు ఆపాలి చాలా అవసరం ద్రోణుడిని ఆపకపోతే అయిపోయింది అంతే ఆ రోజులతో యుద్ధం ఆయనే చెప్పాడు ఒక పూట చాలు ఇక నిన్ను రక్షించేవాడు లేడుఅని చెప్పాడు దుర్నిరీక్షుడు మధ్యాహ్నపు సూర్యబింబంలా
(14:28) ఉన్నాడు ద్రోణుడు ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు అంగీకరించల నేను అనలేని ఈ మాట అన్నాడు భీముడు వెళ్లి తాను అరిచాడు అశ్వద్ధామహతః అన్నాడు ద్రోణుడు ఒక్కసారి విని ఖిన్నుడు అయ్యాడు అశ్వద్ధామ దివ్యాస్త్ర సంపన్నుడు నా కొడుకు గొప్ప తపస్సు చేస్తే శివానుగ్రహంతో పుట్టాడు వాడు పడిపోతాడా నేను నమ్మను భీముడు నన్ను పడగొట్టడానికి ఈ మాట అంటున్నాడని యుద్ధం చేసేసాడు కృష్ణుడు పరుగు పరుగున వచ్చాడు ధర్మరాజుకి అప్పుడు చెప్పాడు ఈ మాట మముతని ఒప్పింపక అన్నాడు నన్ను కూడా తీసుకెళ్లి అప్ప చెప్పేస్తావా ద్రోణాచార్యుల వారికి సముచితముగా కాచికొనుము నీ వారిని రక్షించుకోవడం నీ ప్రాణాన్ని
(15:08) రక్షించుకోవడం ధర్మాన్ని రక్షించడం నీకు ప్రధాన కర్తవ్యం అలాగని మనకు మనం అన్వయం చేసే అబద్ధాలు అడకూడదు సముచితముగా కాచికొనుము ఎప్పుడు అంటే అసత్య వచన దోషము లేదు ప్రాణ రక్షణ సమయంబునన్ ప్రాణమును రక్షించాలి లేకపోతే చంపేస్తున్నాడు ఇతల యుద్ధంలో చంపడం ధర్మం కావచ్చు కానీ అధర్మాన్ని నిగ్గేస్తుంది పైగా ఎవడు అలా యుద్ధం చేయకూడదో వాడు యుద్ధం చేసి చంపేస్తున్నాడు బ్రాహ్మణుడు కాబట్టి ఇప్పుడు ప్రాణములను రక్షించుకోవాలి అధర్మాన్ని నిగ్రహించాలి అందుచేత వాని కొడుకు చచ్చనోనునిమి అతని కొడుకే చచ్చిపోయాడును అశ్వద్ధామ అంటే ఏనుగు అశ్వద్ధామ అంటే తన కొడుకు కాదు
(15:48) భీముడు చెప్పింది అబద్ధం అని యుద్ధం చేస్తున్నాడు నువ్వు ఒక్కడివి చెప్తేనే నమ్ముతాడు. భీముడు మళ్ళీ అరిచాడు అశ్వద్ధామహతః అన్నాడు కొంచెం అనుమానం వచ్చింది అందులో ద్రోణాచార్యుల వారి యుద్ధం ఎలా ఉంటుందంటే ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తే నా నాలుగు వేళ్ళు ఇలా నిలువుగా పెట్టాను అనుకోండి భూమిమీద ఎంత ఎత్తు ఉంటుందో ఆయన రథ చక్రాలు భూమికి తగలకుండా వెళతాయి ఎందుకు వెళతాయి అంటే ఆయన సంకల్ప బలం అంత ఉత్సాహంతో యుద్ధం చేస్తాడు ఆ ఉత్సాహానికి రథ చక్రాలు భూమికి తగలవు పైకి లేస్తాయి నేను చెప్తున్నది ఆ తెలుగు భారతం సంస్కృత భారతం అయితే ధర్మరాజు గారి రథ చక్రాలు
(16:24) పైకి ఉంటాయి నేను తిక్కన గారి హృదయంతో మాట్లాడుతున్నాను. ఆ ద్రోణాచార్యుల వారి రథ చక్రాలు నానాలుగువేల ఎత్తు ఎంత ఉంటుందో అంత ఎత్తులో పెడతాయి అలా రథాన్ని నడుపుతాడు అలా యుద్ధం చేస్తాడు అంత ఉత్సాహం ఎప్పుడైతే భీముడు అలా అంటున్నాడో అనుమానం వచ్చింది అజాత శత్రువు అన్నాడు ధర్మరాజుని పిలిచి తన శిష్యుడు నిజమా భీముడు చెప్పేది అని అడిగాడు చెమటలు పట్టేసాయి ధర్మరాజు గారికి ఎదురుగుండా ఉన్నది గురువుగారు పక్కన ఉన్నది కృష్ణుడు చెప్పకపోతే తన పక్షం ధర్మం పోతోంది చెప్తే తన సత్య వచనం పోతుంది ఎలా కృష్ణుడు అన్నాడు అశ్వద్ధామహతః పైకను కుంజరః
(17:04) మెల్లిగాను వాద్యఘోషం పోగుతుంది వెనక ఎందుకని అంటే అశ్వద్ధామహతః అని నువ్వు అన్నావు ఎదురుగుండా ఉన్న గొప్ప వీరుడు పడిపోయాడు పడిపోయాడు కాబట్టి శుభవార్త కాబట్టి మన పక్షం వాళ్ళందరూ పెద్ద వాద్యఘోష చేస్తారు ద్రోణుడికి వినపడదు కాబట్టి తన కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాడు కనీసం పోన అలా అను అన్నాడు అబద్ధం ఆడినట్టు కాదుగా పుంజరః అన్నావుగా అన్నాడు అంత ధర్మరాజుకి మనసులో ఒక కాంక్ష ఉంది విజయకాంక్ష గెలవాలి అది ధర్మ పక్షమా ఇంకోటి తర్వాత ఆఖరణ ఏడిచాడు గురువు దగ్గర నిలబడి గురువుగారి దగ్గర అబద్ధం మాట్లాడి గురువుగారి మృత్యువుకు కారణమైనందుకా నాకు
(17:42) ఈ భూమి పట్టాభిషేకం అని అడిగాడు మనసుని తులిచేసింది ధర్మరాజుని అశ్వద్ధామహతః అన్నాడు వెంటనే వాద్యఘోషం అయింది కుంజరః అన్నాడు ధర్మరాజు చెప్పాడు ద్రోణాచార్యుల వారు ధనస్సు బాణాలు వదిలేసాడు కృపాచార్యుల వారిని దుర్యోధనుడిని పిలిచి నన్ను ప్రతిరోజు అనకూడని మాటలు అన్ని అని నాలో ప్రతీకార ధోరణి కల్పించి యుద్ధం చేయించారు ఇక ధనుర్బాణాలు వదిలేసాను అభ్యున్నతి పదంలో నడవండి అని విడిచిపెట్టేసి అది ఆయన యోగశక్తి క్షణాల మీద బొటనవేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసాడు లాగేసి ఊర్ధముక చలనం చేసి బ్రహ్మ స్థానాన్ని బదలగొట్టి తిన్నగా వెళ్ళిపోయి బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయాడు
(18:25) వెళ్ళిపోయి ఆయన పద్మాసనం వేసుకొని కూర్చును ఉండగా కక్షతో ఎలాగైనా ఆయన్ని చంపాలని అందుకే పుట్టాడు ఆ యజ్ఞకుండంలో నుంచి దృష్టజ్యుమనుడు ఆయన గబగబా వచ్చి రథం మీదకి దూకి ద్రోణాచార్యుల వారి యొక్క జుట్టు పట్టుకొని శిరస్సు ఖండించి ఎత్తి నేలకేసి కొట్టాడు ధర్మరాజాదులు అరుస్తున్న కూడా సరే అది వేరు విషయం అనుకోండి ఇప్పుడు నేను మహాభారతం మీద ప్రసంగం చేయడానికి రాలేదు కానీ మరి వాక్కు చేత చంపేసాడా లేదా ద్రోణాచార్యుల వారిని దేని చేత చంపారు ద్రోణాచార్యుల వారిని వాక్కుతో చంపారు ఒక మాట ద్రోణుడిని చంపేసింది ఆ మాట ధర్మరాజు పలకకుండా ఉంటే విజయం దుర్యోధనుడిదే అన్నది నిస్సందేహం
(19:09) కానీ దుర్యోధనుడు విజయం పొందడం కాదు అక్కడ భగవంతుడికి కావలసినది ధర్మం విజయం పొందాలి ధర్మరాజు గెలిచాడా భీముడు గెలిచాడా అర్జునుడు గెలిచాడా దుర్యోధనుడు గెలిచాడా ఇది అక్కర్లేదు కృష్ణుడికి బాగా గుర్తుపట్టండి కృష్ణుడికి కావలసినది వ్యక్తులు గెలుపు కాదు ధర్మాన్ని పట్టుకున్న వ్యక్తుల గెలుపు ధర్మాత్ముల గెలుపు అందుకే భగవంతుడు ఏదైనా చేస్తాడు అధర్మాన్ని పడగొట్టేస్తాడు ఆయనే అడ్డువచ్చిననాడు రక్షించగలిగినవాడు లేడు రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాగిలందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతనగారు మనకి మనం ఎన్ని రక్షణలు
(19:45) పెట్టుకున్న ఆయన అనుగ్రహం లేనినాడు పడిపోతాడు. ఆయన అనుగ్రహం ఉన్ననాడు ఎంత ఆపదలోకి వెళ్ళినా బతికేస్తాడు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలి వాక్కుని ఆయుధం చేసి పడగొట్టేసాడు వాక్కు గతులు తిప్పేస్తుంది వాక్కు ఎంత గొప్ప విశేషాన్ని కూడా ఒకలా వెడుతున్న దాన్ని ఒకలా మారుస్తుంది అసలు వాగ్వైభవము వాక్కు గొప్పతనము అంటే శ్రీరామాయణమే మీరు ఎప్పుడైనా రామాయణాన్ని పరిశీలించండి అందులో రామాయణంలో చమత్కారం ఏమిటంటే ఆడది మాట్లాడుతుంది రామాయణం ఇంకా ఏమవ్వాలి తెలియకుండా డ బిగుసుకుపోయింది అనుకోండి రామాయణం అయిపోయింది అనిపించింది అనుకోండి
(20:25) మనకి అప్పుడు ఎవరో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఆవిడ మాట్లాడుతుంది రామాయణం ఇంకా ముందుకు వెళ్తుంది. సీతారామ కళ్యాణం అయిపోయింది సీతారాములు అయోధ్యకు వచ్చేసారు యవ్వరాజ్య పట్టాభిషేకం అయిపోతుంది ఇంకేముంది రాముడు రాజు అయిపోతాడు హాయిగా పరిపాలన అవుతుంది రావణ మధ ఎలా ఆయన అరణ్యవాసం ఎలా వెళ్ళాలి అకస్మాత్తుగా మందర లేచింది నిన్న చెప్పాగా మందర మాట్లాడింది రెండు వరాల కైకం అడిగింది సీతారాములు అడవికి వెళ్ళిపోయారు సీతారాములు అడవికి వెళ్ళిపోయారు 13 ఏళ్ళు అయిపోయింది ఇంకొక ఏడాది అయితే ఇంటికి వచ్చేస్తాడు రావణుడితో యుద్ధం ఏది కారణం లేకుండా రాముడితో రాముడు యుద్ధం చేయడు
(21:03) కారణం ఏది శూర్పణకు వచ్చింది. రావణాసురుడి దగ్గరికి వెళ్లి చెప్పకూడని మాటలు చెప్పింది ఒకే మాట అంది తనకి రాముడి మీద మోహం కానీ రాముడు ఆదరించలేదు ఆదరించకపోవడానికి కారణం పక్కన సీతమ్మ ఉంది సీతమ్మ మీద మనసు ఉంది రాముడికి ఏ సీతమ్మని చూసి తనని కాదన్నాడో ఆ సీతమ్మని దూరం చేసి బాధపెట్టాలి. తను పొందలేని సుఖాన్ని సీతమ్మ పొందడానికి వీలు లేదు అది ఆవిడ అక్కసు అందుకని ఆవిడ వెళ్ళండి నీ మొహం నీ భార్యలు ఏమిటిరా భార్య ఆడది అందం అంటే సీతమ్మ నీకు ధైర్యం ఉంటే ఆవిడ్ని ఎత్తుకొచ్చి ఆవిడ్ని భార్యగా అనుభవించరా అంది అసలే దుర్మార్గ బుద్ధి వెంటనే బయలుదేరాడు
(21:40) శివపనక మాట్లాడింది సీతాపహరణం జరిగింది. సీతమ్మ తల్లి చచ్చిపోదాం అనుకుంది ఒకప్పుడు త్రిజట మాట్లాడింది మళ్ళీ సీతమ్మ బతికింది. ఒకప్పుడు నిజంగా రాముడు మరణించాడు అని అనుకునేటట్టుగా బ్రహ్మాస్త్ర బంధనం జరిగి రామలక్ష్మణులు యుద్ధభూమిలో పడిపోతే పుష్పక విమానం ఎక్కించి పైకి తీసుకొచ్చి చూపించాడు రామలక్ష్మణులు ఇద్దరు పడిపోయారు శరీరం విడిచిపెట్టారు అని చెప్పాడు ఆవిడ చూసి నిజం అనుకుంది గుండెలు బాదుకుని ఏడ్చిన సర్గలు చదివితే కళ్ళం నీళ్ళ వస్తాయి అప్పుడు త్రిజట కూతురు చెప్పింది నిజంగా నీకు సుమంగళిత్వం పోతే ఈ పుష్పక విమానం నిన్ను ఎక్కించుక కోదు సువాసిని
(22:21) అయితేనే పుష్పక విమానం ఎక్కించుకుంటుంది నీ ఐదోతనం చెక్కు చెదరలేదు రాముడు స్పృహ తప్పి ఉన్నాడు కాసేపట్లో లేచిపోతాడు నమ్మకు రావణుడి మాటలు అంది సీతమ్మ బతికింది. రామాయణం ఎక్కడ అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ వచ్చి మాట్లాడుతుంది రామాయణం ముందుకు వెళ్తుంది అసలు నిజానికి రామాయణం అంతా పెనుమలుపు ఎందుకు జరిగింది లక్ష్మణ స్వామిని అక్కడ పెట్టి రామచంద్రమూర్తి వెళ్లారు లక్ష్మణుడు ఉండగా రావణుడు రాడు సీతమ్మ ఒక్క మాట అంది మమహేతోహ ప్రయచచిన్నః ప్రయుక్తో భరతేనవా అంది మమహేతోహ ప్రతిచన్నః ప్రయుక్తో భరతేనవా దుర్మార్గుడా లక్ష్మణ ఒక తమ్ముడు భరతుడు
(23:06) రాజ్యాన్ని కొల్లగొట్టాడు ఆ భరతుడు నిన్ను రాముడి వెంట పంపాడు సమయం చూసి రామున్ని సంహరించి లేదా మృత్యువుకి అప్పచెప్పి నన్ను పొందాలని నువ్వు చూస్తున్నావు అందుకే రాముడు పిలిచి వెళ్ళటం లేదు ఒక్కనాటికి నీకు నేను దక్కనురా దుర్మార్గుడా అంది తల వంచేసుకున్నాడు అమ్మ ఈ మాట వినలేనమ్మా నేను వెళ్ళిపోతున్నాను నిన్ను దేవతలు రక్షించుగాక నిన్ను ఈ వనము రక్షించుగాక చెట్లు రక్షించుగాక మృగములు రక్షించుగాక వెళ్ళిపోయాడు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు సీతాపహరణం అయిపోయింది ఒక్క వాక్కు తిప్పేసింది రామాయణాన్ని వాక్కు ఎంత దూరమైనా వెళతది అంత శక్తివంతమైన వాక్కు
(23:48) ఈశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు దాని విలువ తెలుసుకని ఎంత జాగ్రత్తగా వాడాలి ఆ వాక్కు సక్రమంగా వినియోగించాడా తరించిపోయాడు అంతే

No comments:

Post a Comment