💐18శ్రీలింగమహాపురాణం💐
🌼పరమేశ్వరునిలింగోద్భవం🌼
#పద్దెనిమిదవ భాగం#
శౌనకాది మునులు సూత మహర్షితో "మహర్షీ! పరమే శ్వరుని పంచ బ్రహ్మ మూర్తుల గురించివినిధన్యులంఅయ్యాoమాకు పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించినలింగోద్భవంగురించి చెప్పండి" అని కోరారు.
సూత మహర్షి సంతోషించి లింగోద్భవ కథ చెప్పనారంభిం చారు.మునులారా!పూర్వo దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్లి నమస్కరించి, మీరడిగినట్టే అడిగారు. "పితామహా! పర మేశ్వరుడికి లింగ స్వరూపము ఎలా ఏర్పడింది?లింగరూపంలో ఉన్న శివుని ఏలా పూజించాలి? లింగము అంటేఏమిటిలింగాన్ని అధిష్ఠించి ఎవరు ఉంటారు? " అని అడిగారు.
బ్రహ్మ "దేవతలారా! నన్ను,విష్ణు వునిరక్షించడంకోసంమహాసముద్రం నుండి పరమేశ్వరుడు జ్యోతిర్లింగరూపంలోఉద్భవించాడు.
వేల కోలది మహాయుగాలు గడ చినతరువాతప్రళయంసంభ
వించింది. మహర్షులందరు పైపైన గల సత్యలోకానికి వెళ్లి పోయారు.దేవతలు,మానవులురాక్షసులు, గంధర్వులు మొదలై నవారు,పశుపక్ష్యాదులు,వృక్షాలతో కలిపి సమస్త చరాచర ప్రపంచం సూర్యుని తేజస్సుకి మండి భస్మమైనారు. తరువాత అనంతజలరాశిప్రళయమేఘాలవలనఆగకుండాసంవత్సరాలు కురిసింది. లోకాలన్ని నీటిలోమునిగిమహాసముద్రంగా మారింది. సూర్య చంద్రులు మాయమై అంతటా అంధకారం ఆవరించింది.
బ్రహ్మనైననాఅస్థిత్వంనశించింది. విష్ణుమూర్తి సాగరజలాలపై నిద్రలోకి వెళ్లాడు. కొన్ని వేల సంవత్సరాలుగడచిపోయాయి. బ్రహ్మగా నేను పద్మము నుండి ఉద్భవించి చుట్టూ చూశాను. గాఢాంధకారంలోచుట్టూఅనంతమైన మహాసాగరం. నన్ను మాయ ఆవహించింది. నేనే సృష్టిలో మొదటి వ్యక్తిని అనే అహంకారం నాకు కలిగింది.
నేను ఆవిర్భవించిన పద్మము యొక్కకాడనుపట్టుకునిమూలా న్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్లాను. చాలా దూరం వెళ్లిన తర్వాత మహావిష్ణువుశేషతల్ప ముపైనీటిపైనిదురిస్తుకనిపించాడు.ఆయనను నేను గుర్తించక, నేను మొదటి వ్యక్తిని అను కుంటుంటే "ఈ పడుకున్న వ్యక్తి ఎవరు" అనుకుని పడుకున్న విష్ణువుని గట్టిగా చేతితో కొట్టి నిద్ర లేపాను. నా చేతి దెబ్బకు విష్ణువు నిద్ర లేచి శేషతల్పము పై కూర్చుని కన్నులు తెరచి అటు ఇటు చూశాడు. నేను కన్పించాను.
నా వంకనవ్వుతూచూసిపుత్రా! వత్సా! బ్రహ్మా! స్వాగతం!" అని పలకరించాడు. మాయ ఆవ హించిన నాలో రజోగుణము ఉత్పన్నమై కోపం వచ్చింది. "ఎవరునీవునన్నుకుమారుడిగాశిష్యుడిగా సంబోధిస్తున్నావు. నేను ఆదిపురుషుడను. ఈ జగత్తుకి సృష్టి లయ కర్తను. అజ్ఞానంతో నన్ను వత్సా అని, పుత్రా అని పిలిచావు. నేనేవరో గుర్తించి మర్యాదగా గౌరవించి మాట్లాడుము" అన్నాను.
విష్ణువు కోపం తెచ్చుకోకుండా "బ్రహ్మా! నీవు నా నాభి నుంచి ఉత్పన్నమైన కమలం నుండి ఉద్భవించావు. పుత్రుడివి కనుక పుత్రా అని పిలిచాను. నేను విష్ణువుని. సమస్త సృష్టికి కారణభూతుడిని. మాయలో పడినన్నుగుర్తించలేకపోతున్నావు. ఈ విశ్వము సమస్తము నాలో లీనమై ఉంది. నీకు జ్ఞాన బోధ చేయాలి కనుక వత్సా అని పిలిచాను" అని నచ్చ చెప్పబోయాడు.
నాలోని రజోగుణ అహంకారం ఒప్పుకోలేదు.విష్ణువుతోయుద్దా నికి సిద్దమయ్యాను. విష్ణువు సరేనని రావడంతో మా ఇద్దరి మధ్య వేల సంవత్సరాలు యుద్దం జరిగింది. అప్పుడు పరమేశ్వరుడు మా ఇరువురి వివాదం తీర్చి శాంతింప చేయు టకు మహాజలధి నుండి జ్యోతి ర్లింగంగా ఉద్భవించాడు. లింగం నుండే వెలువడే జ్వాలలు వేయి సూర్యుల తేజస్సుకిసమానంగా ఉన్నాయి. ఆది, అంతము లేని ఆ మహా లింగముఅంతరిక్షాన్ని తాకుతున్నట్టు ధృడంగా నీటి మధ్యన నిలబడింది.
మేమిరువురము యుద్దం మాని ఆలింగంవంకఆశ్చర్యంగాచూస్తు న్నాము. ఆ లింగం నుండి వెలువడుతున్న మహాగ్ని జ్వాలలు మమ్మల్ని భయ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. ముందు తేరుకున్న విష్ణువు నాతో "ఈ మహాగ్ని స్థంభము ఏమిటో, ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. నేను ఈ స్థంభము మూలము వెతుకుతూక్రిందకుపాతాళానికి వెళతాను.నీవుపైకివెళ్లిస్థంభము ఎంతవరకు వ్యాపించి వున్నదో తెలుసుకొనుము"
అని చెప్పి విష్ణువు వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ క్రిందకు వెళ్లాడు. నేను విరాట్ హంస రూపం ధరించి మనోవేగముతో సమానమైన వేగంతో పైకి ఎగురుతూ వెళ్ళాను. అప్పటి నుండి నాకు హంసవిరాట్ అనే పేరు వచ్చింది. నారాయణుడు నల్లటివరాహరూపంతోలింగస్థంభముయొక్కమూలమువెతుకుతూ క్రిందకువేయిసంవత్సరాలు ప్రయాణం చేశాడు.ఎంతవెళ్లినా స్థంభపు మూలభాగం కనపడ లేదు. నిరాశతో పైకి వచ్చాడు.
నేను కూడావేయిసంవత్సరాలు పైకి పయనించి లింగం యొక్క పైభాగాన్నిచూడ.లేకపోయాను. లింగ స్థంభానికి ఆది అంతం లేదనుకుని నిరాశతో బయలు దేరిన ప్రదేశానికి వచ్చాను. విష్ణువు నిరాశతో అప్పుడే అక్కడకు వచ్చాడు. ఇద్దరం ఆ జ్యోతిర్లిగాన్నిభయాశ్చర్యాలతో చూస్తున్నా భాగ్యం కలిగించాడు.
విష్ణువు తన్మయుడై శివ స్తుతి ఇలాచేశాడు."ఓంఅనేఅక్షరాన్ని అనుసంధానించడం వలనే పరమేశ్వరుడు లభిస్తాడు. ఓం కారం వాచ్యం అయితే శివుడు వాచ్యుడుఅవుతాడు"స్తుతించిన తరువాత పంచ బ్రహ్మల మంత్రాలు శివలింగం మీద కనపడుతుంటే వాటిని భక్తి శ్రద్థలతో జపించాడు.
విష్ణువు చేసిన జప స్తోత్రాలకు శివుడు ప్రసన్నుడై ఈశాన మంత్రాన్ని కిరీటంగా, తత్పురుష మంత్రాన్ని ముఖంగా, అఘోర మంత్రాన్ని హృదయంగా, వామదేవ మంత్రాన్ని గుహ్యభాగంగా, సద్యోజాత మంత్రాన్ని పాదాలుగా చేసుకుని పంచబ్రహ్మ రూపంలో దర్శనమిచ్చాడు. నేను, విష్ణువుపులకరించిపరమానందంతో పరమేశ్వరుని స్తుతి స్తోత్రాలతో కీర్తించాము.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment